Thursday, March 31, 2011

నూతన్‌ప్రసాద్‌కు టాలీవుడ్ అశ్రునివాళి


నూతన్‌ప్రసాద్‌కు టాలీవుడ్ అశ్రునివాళి
ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు. ఆయన 1950 అక్టోబర్ 10న కృష్ణాజిల్లా కలిదిండిలో జన్మించారు. నూతనప్రసాద్ అసలు పేరు తాడినాడ వర ప్రసాద్.
అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., చలిచీమలు సినిమాలో‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.
నూతన్‌ ప్రసాద్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మా అసోసియేషన్‌ అధ్యక్షుడు, నటుడు మురళీమోహన్‌. కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలో... ఆయన్ను చూసి నేర్చుకోవచ్చన్నారు. ప్రసాద్‌తో తనకు నాటక రంగం నుంచే పరిచయం ఉందన్నారు మురళీమోహన్‌. తనకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు మురళీమోహన్‌.

పాక్ పరాజయం, ఫైనల్లో భారత్







పాక్ పరాజయం, ఫైనల్లో భారత్









 భారత్ విజయభేరీ మోగించింది. క్రికెట్ ప్రపంచకప్ కీలక సెమీస్ సమరాంగణంలో పాకిస్థాన్ జట్టును మట్టికరిపించింది. శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమయ్యింది. ఇక్కడ మొహలి స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనిసేన, ఆఫ్రిది నేతృత్వంలోని పాక్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మన్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 85 పరుగులు చేశాడు. వందవ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. తదుపరి బ్యాటింగ్ దిగిన పాక్ జట్టును భారత బౌలర్లు సమిష్టిగా కట్టడి చేశారు. ఫలితంగా పాక్ 49.4 ఓవర్లలో, ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 29 పరుగుల తేడాతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. భారత్ ప్రపంచకప్‌లో మూడోసారి ఫైనల్ చేరుకుంది. భారత బౌలర్లు సంయుక్తంగా రాణించారు. జహీర్‌ఖార్, నెహ్రా, మునాఫ్, యువరాజ్, హర్భజన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్థ సెంచరీతో రాణించిన సచిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

Monday, March 21, 2011

టోక్యోను వెంటాడుతున్న రేడియేషన్‌


టోక్యోను వెంటాడుతున్న రేడియేషన్‌
* నగరాన్ని వీడుతున్న ప్రజలు
జపాన్ రాజధాని టోక్యోను రేడియేషన్ వణికిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు సమీపంలో ఉన్న ఒసాకోకు వలసపోతున్నారు. నిన్న జాతినుద్దేశించి ప్రసంగించిన జపాన్‌ రాజు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 
భూకంపం, ఆతర్వాత అణు విద్యుత్ ప్లాంట్ల నుంచి రేడియేషన్ వెలువడటంపై విచారాన్ని వ్యక్తం చేశారు. దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఒసాకో మీదుగా పలు దేశాల విమానాల సర్వీసులు రాకపోకలు కొనసాగుతున్నాయి.

Sunday, March 20, 2011

జీవిత రాజశేఖర్‌ కు పోలీసు శాఖ నోటీసులు

సినీ నటులు జీవిత రాజశేఖర్‌ దంపతులకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేసింది. 
తమకు ప్రాణ హాని ఉందంటూ భద్రత కోసం ప్రభుత్వానికి వారు దరఖాస్తు చేసుకోగా
 అంగరక్షకులను నియమించారు. అయితే భద్రతా సిబ్బందికి జీవిత రాజశేఖర్‌ 
దంపతులు నెలసరి జీతాలు చెల్లించలేదు. దీంతో ఈ విషయంపై
 పోలీసు శాఖ వారికి నోటీసులు జారీ చేసింది. 

happy holiholi greetings


happy holiholi greetings

శనివారం ఉదయం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.మహిళలు పాటలు పాడుతుంటే తాను కొద్దిసేపు డప్పు కొట్టారు. మహిళలు రంగులతో అక్కడ ఉన్న పార్టీ నేతలను ముంచెత్తారు. పెద్ద సంఖ్యలో యువకులు, గిరిజనులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి హోలీ ప్రతీకని, పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా జరుపుకొనే ఈ పండుగ భారత సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనము, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మేయర్ కార్తీకరెడ్డి ,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

Tuesday, March 15, 2011

ఉపమాక కల్యాణోత్సవాలు ప్రారంభం ...


ఉపమాక కల్యాణోత్సవాలు ప్రారంభం


నక్కపల్లి : ఉపమాక వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పెళ్లి కావిడిని ఉపమాక మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు సమర్పించుకున్నారు. 
ఈ కార్యక్రమం ద్వారా కల్యాణోత్సవాలు ప్రారంభమైనట్టు భక్తులకు తెలియజేయడం జరిగిందని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్‌వరుణ నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా పుట్టమన్ను తెచ్చేందుకు పెరుమాళ్లను తీసుకెళ్లారు. అంకురార్పణ అనంతరం ఆలయంలో స్వామివారికి తిరువీధిసేవ, కల్యాణమండపంలో స్వామివారిని, ఉభయదేవేరులను వేంచేయింపజేసి వాస్తు మండప పూజ, యోగేశ్వర మండప పూజ, అగ్నిముఖ నిర్వహణ, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో కల్యాణోత్సవాలు లాంచనంగా ప్రారంభమయ్యాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపా రు. 
ఈ కార్యక్రమాల్లో పాలకమండలి చైర్మన్ చిలువూరి రామసూర్యనారాయణరాజు, నున్న శుభాష్ పాల్గొన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, పార్వతీపరమేశ్వరులు, అలివేలుమంగ వేంకటేశ్వరస్వామి రూపాలతో ఉన్న విద్యుత్ సెట్టింగులను ఏర్పాటు చేశారు. కొండపై మూలవిరాట్ వద్దకూడా మూడు నామాలతో ఉన్న లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్‌దీపాలంకరణకు హెట్రోరసాయనిక పరిశ్రమ చైర్మన్ పార్థసారధిరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.

Monday, March 14, 2011

పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు


పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు



విశాఖ : విశాఖలోని ఏవీఎన్ కళాశాల సమీపంలో సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకువెళ్లింది.ద ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.



Alam Ara, India’s first talkie made by Ardeshir M. Irani, exhibitor–turned-filmmaker under the banner of Imperial Movietone, was released on March 14, 1931 at Majestic cinema in Bombay. 

‘మున్నీ, మలైకా గిన్నిస్ రికార్డు!
మెల్‌బోర్న్: ,మున్నీ బద్నామ్ హుయీ, అంటూ కురక్రారును వెర్రెత్తించిన ,దంబాగ్, చిత్రంలోని పాటకు గిన్నిస్ బుక్‌లో చోటుదక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ పార్క్‌లో దబంగ్ పాటకు మున్నీ(మలైకా ఆరోరా)తో కలిసి 1200 మంది నర్తించి గిన్నిస్ బుక్‌లో చోటు కల్పించారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2001 సందర్భంగా ఈ పాటను ప్రదర్శించారు. ఆదివారం నాడు మలైకా ఆరోరా గిన్నిస్ బుక్ అధికారుల నుంచి సర్టిఫికెట్‌ను అందుకున్నారు. గతంలో 1008 మంది కలిసి ఓ పాటకు డ్యాన్ చేసిన రికార్డు సింగపూర్‌లో నమోదైంది. ఈ ప్రదర్శనకు తన భర్త అర్భాజ్‌ఖాన్, కొడుకులతో కలిసి మలైకా హజరయ్యారు. విద్యాబాలన్, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా, డెరైక్టర్ కబీర్‌ఖాన్, పాకిస్థాన్ పాప్ సింగర్ జఫర్‌లు కూడా ఈ రికార్డు ప్రదర్శనను తిలకించారు.

Sunday, March 13, 2011

జగన్‌ని కాంగ్రెస్‌లోకి తేకుంటే రాజీనామా


జగన్‌ని కాంగ్రెస్‌లోకి తేకుంటే రాజీనామా...


పది రోజులు తనకు అధిష్టానం సమయమిసే… జగన్‌ని ఆయన వెనకున్న నేతల్నికాంగ్రెస్లోకి తెచ్చి పడేస్తానంటూ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేసారు మంత్రి శంకరరావు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ.. జగన్‌ ప్రసుతం పార్టీ పెటినా త్వరలోనే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమని జోస్యం చెప్పారు. వైఎస్‌ ఆశయాలో రాహుల్ని ప్రదానిని చేయాలన్న లక్ష్యం కూడా ఒకటని.. దానిన కాదని జగన్‌ ముందు కెళ్లగలరా? అని ప్రశ్నించారు. జగన్‌ని కాంగ్రెస్‌ పార్టీలోకి తాను రపించలేక పోతే తన పదవికి రాజీనామా కూడా చేస్తానని సవాల్‌ విసిరారు.


జపాన్ సునామి ఫోటోలు మీ కోసం ...



జపాన్ సునామి ఫోటోలు మీ కోసం 

పాన్ ను కుదిపేసిన సునామి