Thursday, March 31, 2011

పాక్ పరాజయం, ఫైనల్లో భారత్







పాక్ పరాజయం, ఫైనల్లో భారత్









 భారత్ విజయభేరీ మోగించింది. క్రికెట్ ప్రపంచకప్ కీలక సెమీస్ సమరాంగణంలో పాకిస్థాన్ జట్టును మట్టికరిపించింది. శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమయ్యింది. ఇక్కడ మొహలి స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనిసేన, ఆఫ్రిది నేతృత్వంలోని పాక్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మన్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 85 పరుగులు చేశాడు. వందవ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. తదుపరి బ్యాటింగ్ దిగిన పాక్ జట్టును భారత బౌలర్లు సమిష్టిగా కట్టడి చేశారు. ఫలితంగా పాక్ 49.4 ఓవర్లలో, ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 29 పరుగుల తేడాతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. భారత్ ప్రపంచకప్‌లో మూడోసారి ఫైనల్ చేరుకుంది. భారత బౌలర్లు సంయుక్తంగా రాణించారు. జహీర్‌ఖార్, నెహ్రా, మునాఫ్, యువరాజ్, హర్భజన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్థ సెంచరీతో రాణించిన సచిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

No comments:

Post a Comment