Friday, August 19, 2011

సి.బి.ఐ సెగ: జగన్, అనుచరులు, ఆస్తులపై ఏకకాలంలో సోదాలు


సి.బి.ఐ సెగ: జగన్, అనుచరులు, ఆస్తులపై ఏకకాలంలో సోదాలు
జగన్ కు సి.బి.ఐ సెగ గట్టిగానే తగిలింది. జగన్ అతని అనుచరులు ఊహించనంత వేగంగా సి.బి.ఐ విరుచుకుపడుతుంది. సెలవు మూడు రోజులు కూడా అధికారుల చర్యలు వేగంగానే ఉన్నాయి. దిల్ కుష్ అతిధి గృహం ఆఫీసుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకోవడం, సోదాలు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం చక చక జరిగిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచే భారీ స్థాయిలో సోదాలు చేస్తున్నారు. సాక్షి కార్యాలయంలో ఆరుగురు అధికారులు సోదా చేస్తున్నారు. లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. జగన్నివాసంలో ఉన్న 74 గదులు పరిశీలించడానికి రెండు గంటల సమయం పట్టిందని సమాచారం. ఇంకా జగతి పబ్లికేషన్స్ లో, బెంగుళూరులోని జగన్నివాసం, ముంబై లో ఉన్న జగన్ ఆఫీస్, పెన్నా సిమెంట్స్ అధినేత విజయసాయి రెడ్డి ఇంట్లో, రాజకీయ నేత లక్ష్మి రెడ్డికి చెందిన బంజారా హిల్స్ నివాసంలో, మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ సైనిక్ పురి నివాసంలో, హెట్రో డ్రగ్స్, హెట్రో ఫార్మా అధినేత శ్రీనివాస రెడ్డి, పార్ధసారది రెడ్డి ఇంట్లో, జగన్ సోదరి షర్మిలా నివాసంలో ,  పులివెందుల పాలిమర్స్ కంపెనీ ఆఫీసులో, జూబ్లీ మీడియా, ఆర్.ఆర్ గ్లోబల్ , ఆల్ఫా విల్లాస్, ఏ.కె దండమూడి,  ఇందు ప్రాజెక్ట్ కుకట్ పల్లి ఆఫీసు లో, ఐ.ఏ.ఎస్ అధికారి బి.పి ఆచార్య, జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ రెడ్డి ఇంట్లో, సాక్షి వైస్ చైర్మన్ విజయ్ సాయి రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. జగతి పబ్లికేషన్స్ కు చెందిన సోదాల్లో సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ సోదాలు చేయడానికి విశాఖపట్నం, తమిళనాడు, కర్ణాటక నుంచి అధికారులను తీసుకువచ్చినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోదాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.

No comments:

Post a Comment