Monday, August 8, 2011

బీరు కావాలా ? మేము కావాలా?


బీరు కావాలా ? మేము కావాలా?
ఓ యువకుడు తాపీగా కూర్చొని ఎవేవో ఊహలతో ఉత్సాహం ఉరకలువేస్తుండగా మెల్లగా "బీరు" సిప్ చేస్తున్నాడు. అతని దగ్గరికి ఓ అందాల యువతి వచ్చి " నీకు బీరుకావాలా... ? నేనుకావాలో తేల్చుకోమని కోరితే ఆయువకుడు ఎటువైపు మొగ్గు చూపుతాడు ? సరీగ్గా యిలాంటి సంఘటనే 04-08-11గురువారం సెంట్రల్ మాస్కోలో జరిగింది. రష్యా యువతలో నానాటికి పెరిగిపోతున్న "బీరు" వ్యసనాన్ని తగ్గించడమే ధ్యేయంగా బీరును మధ్యం జాబితాలో చేర్చారు. ఈ బిల్లుపై అధ్యక్షుడు మెద్వెదెవ్ జులైలో సంతకం చేశారు. పది శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ఉన్న బీరును గతంలో ఆహార పదార్ధంగానే పరిగణించేవారు. ఈ నేపధ్యంలో బహిరంగ ప్రదేశాల్లో బీరు తాగే యువత తీరును నిరసిస్తూ అధ్యక్షుడి నిర్ణయానికి మద్దతుగా ఒక వినూత్నమైన నినాదంతో ప్రదర్శన చేశారు. " మీకు బీరు కావాలా ? మేము కావాలా ... తేల్చుకోండి" అంటూ , అంతటితో ఆగకూండా యువకులముందే తమ దుస్తులు విప్పేస్తూ ఫోజులిచ్చారు. మరి ఈ ప్రదర్శన యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే !

No comments:

Post a Comment