Thursday, January 10, 2013

తెలగపాముల జాతికి చెందిన మహిళా దొంగలు పట్టుబడ్డారు,


 రుచూ ఆటోల్లో ఎక్కుతూ దిగుతూ మహిళల మెడలో ,బేగల్లో వస్తువులు కాజేస్తున్న తెలగపాముల జాతికి చెందిన దొంగలు వీరే....
రుచూ ఆటోల్లో ఎక్కుతూ దిగుతూ మహిళల మెడలో ,బేగల్లో వస్తువులు కాజేస్తున్న తెలగపాముల జాతికి చెందిన దొంగలు వీరే....
బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో ఇద్దరు మహిళా నిందితులిని దువ్వాడ జోన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వీరిద్దరూ పాతనేరస్తులని పోలీసులు తెలిపారు. జోన్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ దాసరి రవిబాబు వెల్లడించిన వివరాలు ఇవీ. అగనంపూడి శాంతినగర్‌కు చెందిన కె.సామ్రాజ్యలక్ష్మి కుమార్తె ఉదశ్రీ ఇటీవల అమెరికా నుంచి వచ్చింది. తల్లీ కూతుర్లిద్దరూ ఈనెల ఏడో తేదీన అనకాపల్లి వీనస్ జ్యూయిలరీస్‌కు వెళ్లి పాతబంగారాన్ని ఇచ్చి కొత్త వస్తువులు కొనుగోలు చేశారు. నగల్ని రెండు పర్సుల్లో పెట్టి ఇంటికి వెళ్లేందుకు అనకాపల్లి పెరుగు బజార్ వద్ద ఆటో ఎక్కారు. 

అప్పటికే ఆటోలో కె.కోటపాడు మండలం గొట్లాంకు చెందిన రావాల ఎల్లారమ్మ, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన బండి లక్ష్మి ఉన్నారు. తాము ముందు జంక్షన్‌లోనే దిగిపోతామని చెప్పి సీటు మారుతున్నట్లు నటిస్తూ సామ్రాజ్యలక్ష్మి బ్యాగులోని ఓ పర్సులోని ఆభరణాలు వీరిద్దరూ కాజేసారు. ఆ తర్వాత వచ్చిన జంక్సన్ లో వారు దిగిపోయారు. దీన్ని గమనించని బాధితులు ఇంటికి వెళ్లి బ్యాగ్ లు చూసుకోగా ఓ పర్సులోని ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దువ్వాడ జోన్  సీఐ త్రినాథ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేష్, ఏఎస్‌ఐ సూరిబాబు, సిబ్బంది నిందితుల కోసం నిఘాపెట్టారు. 

బుధవారం ఉదయం అగనంపూడి ఆంజనేయస్వామి గుడివద్ద నిందితులు సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.75 వేల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడైన ఆటో డ్రైవర్ బంకు శ్రీను పరారీలో ఉన్నాడని, అతని వద్ద కొంత సొత్తు ఉందని చెప్పారు. నిందితులిద్దరూ పాతనేరస్తులని, అందుకే వీరి కదలికలపై నిఘా పెట్టామని ఏసీపీ దాసరి రవిబాబు వివరించారు. 

No comments:

Post a Comment