Friday, October 19, 2012

అన్‌రాక్ పై మా పోరాటం ఆగదు...!!?



అన్‌రాక్ పై మా పోరాటం ఆగదు...!!?
న్‌రాక్ నిర్వాసితులు, కార్మికుల సమస్యలను పరిష్కరించేవరకు యాజమాన్యంపై పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అన్‌రాక్ యాజమన్యం తీరును నిరసిస్తూ, నిర్వాతుల, కార్మికుల సమస్యలపై తన కుమారుడు విజయ్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ కలిసి తామరం నుంచి విశాఖకు చేపట్టిన పాదయాత్రను కామేశ్వరమ్మ గుడి వద్ద అయ్యన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అన్‌రాక్ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్‌రాక్ కంపెనీ వల్ల రానున్న రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. అదే విధంగా ప్రజలు పలురకాల వ్యాధులబారిన పడతారని అందోళన వ్యక్తం చేశారు.
అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ, అన్‌రాక్ వద్ద పక్కనే వున్న ఏలేరు నీరు కలుషితమై విశాఖ వాసులు కూడా రోగాలబారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అన్‌రాక్ కంపెనీపైనే కాకుండా కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు, నిర్వాతులు, కార్మికుల సమస్యలపై అన్ని కంపెనీలపైనా పోరాటాలు చేస్తామన్నారు.ఈ పాదయాత్రలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాధంశెట్టి నీలబాబు,కోమటి వెంకటరావు,రౌతు శ్రీనువాసురావు బొడ్డపల్లి అప్పారావులు తో పాటు, దానబోయిన నీలకంటరావు గొల్లవిల్లి నాగరాజు తదితరులుఉన్నారు. కొంతదూరం వరకు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, స్థానిక మండల టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి విళ్ళా రామ మోహనరావు,  గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల నాయకులు, కార్యకర్తలు, అన్‌రాక్ నిర్వాసితులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment