Friday, September 21, 2012

టీ టి డి ఈవో, ఛైర్మన్ (కంకణం) మధ్య వివాదం


టీ టి డి ఈవో, ఛైర్మన్ (కంకణం) మధ్య వివాదం

ప్తగిరులు బ్రహ్మోత్సవ శోభతో విరాజిల్లుతున్నాయి. వెంకన్న నామస్మరణతో ఏడుకొండలు మార్మోగుతున్నాయి. గోవిందా నీవే దిక్కంటూ శేషాచలంలో కోలాహలం సంతరించుకుంది. అదే సమయంలో వివాదాలూ రచ్చకెక్కుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కంకణధారణ కలకలం రేపింది. ఇంతకూ ఏం జరిగింది? 

కంకణధారణపై ఈవో, ఛైర్మన్  మధ్య వివాదం
బ్రహ్మోత్సవాలకు ఈవో కంకణం కట్టుకోవడం ఆనవాయితీ
దీక్షతోనూ, నిష్ఠతోనూ నిర్వహిస్తామని స్వామి ఎదుట ప్రమాణం
సీఎం పర్యటనలో కంకణం కట్టుకున్న బాపిరాజు
ఇద్దరికి కంకణం కట్టడం ఆనవాయితీ కాదు
కంకణం ఉన్నా లేకున్నా ఉత్సవాల్లో పాల్గొంటానన్న ఈవో
నియమాలు తెలియవంటున్న బాపిరాజు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడంటే అందరికీ భక్తిభావమే. వేంకటేశుని దివ్య మంగళ స్వరూపం చాడాలన్న తపనతో ఏడుకొండలెక్కిన ప్రతి ఒక్కరిలోనూ ఆధ్మాత్మిక చింతనే. మాములు రోజుల్లోనే కిటకిటలాడే సప్తగిరులు... బ్రహ్మోత్సవాల సమయంలో మరింత హోరెత్తుతాయి. గోవిందా నామ స్మరణతో మార్మోగుతాయి. పద్మావతి వల్లభుని దర్శించి తరించాలన్న ప్రతి భక్తిని మది.... భక్తిభావంతో పొంగిపొర్లుతుంది. హృదయం నిండా అడుగడుగు దండాల వాడినే నింపుకొని తన్మయత్వంతో తపన పడే ప్రతి ఒక్కరూ తిరుమలగిరులపై ఎక్కడ చూసినా కనిపిస్తారు. గోవిందుడు అందరి వాడేలే అంటూ గొంతెత్తుతారు.  ఇంతటి ఆధ్మాత్మిక  క్షేత్రంలో ఇంతటి పరమ పుణ్యక్షేత్రంలో తరుచూ వివాదాలు చెలరేగడం సగటు భక్తుని ఆవేదనకు గురిచేస్తోంది.

బ్రహ్మోత్సవాల సమయంలో కంకణధారణపై టీటీడీ ఛైర్మన్ , ఈవోల మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారడమే విడ్డూరం. సాధారణంగా ఆలయ ఉన్నతాధికారి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణదారుడిగా కంకణం కట్టుకోవడం ఆనవాయితీ. ధ్వజారోహణం తర్వాత స్వామి వారి ఉత్సవాలను అకుంఠిత దీక్షతోనూ, నిష్టగా నిర్వహిస్తామని శ్రీవారి ఎదుట ప్రమాణం చేసి తిరుమలను వదలి వెళ్లకుండా ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. కానీ ఈసారి టీటీడీ ఛైర్మన్  కనుమూరి బాపిరాజు కంకణం కట్టించుకోవడమే అసలు వివాదానికి కారణం. ముఖ్యమంత్రి పర్యటనలో ఉండగానే బాపిరాజు ఆలయంలోకి వెళ్లి కంకణం కట్టించుకోవడం ఈఓకు కోపం తెప్పించింది.

బ్రహ్మోత్సవాల నిర్వహణాధికారులు ఇద్దరు కంకణం కట్టించుకోవాలని తొలత భావించినా ఆగమశాస్త్రం నిభంధనలు అడ్డురావడంతో ఈఓ వెనక్కి తగ్గారు. తాను కంకణం కట్టించుకున్నా.. లేకపోయినా స్వామి సేవల్లో నిష్ఠగా పాల్గొంటానని ఈవో అంటున్నారు. దీనిపై బాపిరాజు కూడా వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి నియమాలు తెలియవని.. ఆలయ సిబ్బంది వచ్చి తనను కంకణ మహోత్సవానికి అహ్వానించారని చెప్పారు. గతంతో కొంత మంది ఛైర్మన్లు బ్రహ్మోత్సవాలకు కంకణం కట్టించుకోని నిర్వహణదారులుగా వ్యవహారించారని చెప్పడంతో తానూ అసక్తి చూపానన్నారు.  మొత్తానికి కిందటేడాది బ్రహ్మోత్సవాల్లో కలసికట్టుగా ఆడిపాడిన ఛైర్మన్ , ఈవోలు ఈసారి ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కంకణ వివాదం కలకలం రేపింది.

No comments:

Post a Comment