Monday, February 28, 2011

తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya


తన పై జోక్స్ వేసిన సైట్ పై కేసు :baalayya
ఈ మధ్య కాలంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా బాలకృష్ణ మీదో లేదా జూ.ఎన్టీఆర్ మీదో జోక్ వస్తోంది. సర్దార్జీల జోక్ లను బాలకృష్ణకు అనువర్తించి ఈ జోక్ లను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ పై ఇలాంటి జోక్ లు వికృతమైన ఫోటోలతో http://www.ihatebalayya.com/ అనే వెబ్ సైట్ రన్ అవుతోంది. ఈ విషయం తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్నవారితో పాటు వెబ్‌సైట్ నిర్వాహకుల ను పట్టుకుని కేసు పెట్టడానకి వెతుకుతున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

దీక్షావివేకి


ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాజకీయనాయకులు ఎంచుకునే మార్గం దీక్ష. ఏదైనా డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గనప్పుడు దీక్షలకు దిగడం సాధారణం. ఎంతోమంది ఇలా చేసే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ, ఇప్పుడో దీక్షాదక్షుడు వచ్చాడు. అతడే జగన్. ఆయన చేస్తున్న దీక్షలే ఇప్పుడు హాట్ టాపిక్..ఫీజు చెల్లింపుల కోసం వారం రోజుల పాటు దీక్షకు దిగిన జగన్.. చివరకు నిమ్మరసం తాగి విరమించారు. కానీ, విరమిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన దీక్షను పట్టించుకోలేదన్నారు. జగన్ వర్గం కూడా ఈ వారంరోజుల్లో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ దుమ్మెత్తిపోశారు. కానీ, అక్కడే అసలు విషయాన్ని వారు గుర్తించలేరు. ఒక్కరోజు, రెండు రోజుల దీక్షలు చేస్తూ వచ్చిన జగన్ .. ఫీజు కోసమూ ముందు ఒక్కరోజే దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇలా దీక్ష ఎన్నిరోజులు చేస్తామన్నది ప్రకటించి చేయడం సమకాలీన రాజకీయాల్లో ఒక్కజగన్‌కే చెల్లింది. ఎంత వివేకం లేని రాజకీయనాయకుడైనా ముందుగానే ముగింపు రోజును ముందుగానే ప్రకటించి దీక్షకు దిగలేదు. కానీ, జగన్‌కు బహుశా వివేకం ఎక్కువనుకుంటా.. అందుకే ముందుగానే తాను విరమించే రోజునూ ప్రకటించేశారు. ఎలాగూ వారంరోజుల్లో ముగిసిపోతుందని తెలిసినప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా..? సరిగ్గా అదే జరిగింది. అనుకున్నట్లే జగన్ దీక్షా శిబిరాన్ని ఎత్తేశారు. అయితే, ఈ వారం రోజుల్లో ఎలాగైనా ప్రభుత్వం తనతో దీక్షను విరమింపజేస్తుందని ఆయన భావించారు. అది జరగలేదు. ఇక 24వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామంటూ జగన్ వర్గం ప్రకటించింది. కానీ, బడ్జెట్ తర్వాత రోజు అసెంబ్లీకి సెలవన్న విషయం మర్చిపోయింది. మొత్తంమీద రాజకీయంగా జగన్ ఇంకా ఎదగలేదన్న విషయం ఈ దీక్షతో మరోసారి తేలిపోయింది.... 

కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకము ???


రాజు
ప్రజల ఆదాయం బాగా పెరిగింది కాబట్టే మద్యం దుకాణాలకు ఇంతగా గిరాకీ పెరిగిందనీ,కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకమనీ మంత్రిగారుచెబుతున్నారు. దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని,1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనలు: " 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.మరింత ఎక్కువ మందిని మద్య వినియోగదారులుగా మార్చడం, మద్యవ్యాపారం పరిమాణాన్ని విపరీతంగా పెంచడం- లక్ష్యంగానే ఎక్సైజ్ విధానం కొనసాగుతున్నది. నడికుడి వంటి చిన్న కేంద్రంలో ఒక మద్యం దుకాణం ఐదుకోట్ల రూపాయలకుపైగా రేటు పలికింది. హైవేల పక్కనా, విద్యాలయాలకు సమీపంలో, చివరకు దేవాలయాల కు చేరువలో మంచినీరు కూడా దుర్లభమైన మారుమూల దుర్బిక్ష గ్రామాలలో కూడా మద్యాన్నిప్రవహింపజేస్తున్నారు.మద్యవ్యాపారంతో పాటే సంచరించే గూండాల దండు, దానితో పాటే పెరిగే రాజకీయ ప్రాపకం- మొత్తం వ్యవస్థనే దుర్గంధ భరితం చేస్తున్నాయి.మద్యాన్ని వ్యాప్తి చేయడం వల్ల నష్టమవుతున్న ఆరోగ్యాలు, కోల్పోతున్న పనిదినాలు, తరిగిపోతున్న ఉత్పాదకత లెక్కవేస్తే, వేలం పాటల్లో వచ్చే వేల కోట్లు ఏ మూలకు?సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి" .

Saturday, February 26, 2011

APకి శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు

హైదరాబాద్ MMTS రెండోదశకు గ్రీన్‌సిగ్నల్ 
ఈ రైల్వే బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. ఎంతో ఆశగా ఎదురు చూసినా... నిరాశే మిగిలింది. కొత్త లైన్ల ప్రతిపాదనలు తప్ప... చెప్పుకోదగ్గ కేటాయింపులేమీ లేవు. మొత్తం 15 దురంతో ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటిస్తే... అందులో ఒకటి మనకు కేటాయించారు. సికింద్రాబాద్‌- విశాఖ మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చారు. సికింద్రాబాద్‌- పూణే మధ్య ఓ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. హౌరా - తిరుపతి, హౌరా -విశాఖల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు, తిరుపతి - అమరావతిల మధ్య కొత్త రైలును ప్రకటించారు. విశాఖ - కోరాపూట్‌ల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిపాదించారు. తిరుపతి - గుంతకల్లు, కాచిగూడ - నడికుడి, కాచిగూడ - మిర్యాలగూడ, సికింద్రాబాద్‌ - నిజామాబాద్‌ల మధ్య ప్యాసింజర్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జెట్‌లో తెలిపారు. వీటితో పాటు కొత్త లైన్లను కూడా ప్రతిపాదించారు. సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌- కరీంనగర్‌ మధ్య కొత్త లైను వేయనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. కరీంనగర్‌ - హసన్‌పర్తి, విశాఖ - భద్రచాలం, దొనకొండ - ద్రోణాచలం, పటాన్‌చెరు - ఆదిలాబాద్‌ , భద్రాచలం - ఖరగ్‌పూర్‌, తిరుపతి - కాంచీపురం - నాగూరు మధ్య కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్‌ రెండోదశ ఎంఎంటీఎస్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

Thursday, February 24, 2011

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌
రాష్ట్రంలో కొత్తగా నమోదైన ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అధ్యక్షునిగా దివంగత నేత వైయఎస్‌ తనయుడు, కడప మాజీ ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోగా జగన్‌ స్వయంగా దరఖాస్తు చేసుకొన్న ‘వైఎస్‌ఆర్‌ పార్టీ’కి ఎన్నికల కమీషన్‌ గుర్తింపు లభించకపోవచ్చుననే అనుమానంతో జగన్‌ ఇంతకుముందే శివకుమార్‌ అనే వ్యక్తి దరఖాస్తును ఆమోదించి రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీగా కమీషన్‌ రిజిస్టర్‌ చేసిన ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని ఆయన అనుమతితో సొంతం చేసుకొన్నట్లు తెలియవచ్చింది. ఈ కొత్త పార్టీ అధ్యక్షునిగా జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియజేసే పత్రాలను వైఎస్‌ తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి మంగళవారంనాడిక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులను కలుసుకొని సమర్పించారు. జగన్‌ దరఖాస్తు చేసిన ‘వైఎస్‌ఆర్‌ పార్టీ’ని ప్రాంతీయ పార్టీగా రిజిస్టర్‌ చేసేందుకు కూడా ఎన్నికల కమిషన్‌ సూత్రప్రాయంగా అనుమతిని తెలియజేసినప్పటికీ ఇందుకేమైనా అభ్యంతరాలుంటే వాటిని ఎవరైనా నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు తెలియజేయాలంటూ ప్రచార మాధ్యమాలతో జగన్‌ తన సొంత ఖర్చుతో వాణిజ్య ప్రకటనలను విడుదల చేయాలని ఆదేశించిన నేపధ్యంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందనే అభిప్రాయంతో ఆయన ఇప్పటికే అన్ని లాంఛనాలు పూర్తిచేసుకొన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైనట్లు సమాచారం. తాను రాజీనామా చేసిన కడప లోక్‌సభ స్థానానికి, తన తల్లి విజయలక్షి రాజనామాతో ఖాళీయ అయిన పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలలో తన సొంత పార్టీ పేరు, గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు జగన్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.

సంక్షేమమే మా పథం!,,,మంత్రి ఆనం


అభివృద్ధికీ సమ ప్రాధాన్యం.. మాంద్యం నుంచి రికవరీ
మంత్రి ఆనం తొలి బడ్జెట్ ప్రసంగం

రూ.2లకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, వృద్దాప్య పించన్లు, గృహ నిర్మాణం, పావలా వడ్డీ, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, అభయహస్తం, తదితర సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఆర్థికమంత్రి ఆనం వారు గణాంకాల బడ్జెట్‌ను ఘనంగా రచించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమతౌల్యం చేశామని విరచించారు. ప్రాధాన్యతా రంగాలకు ఇంతింతలేసి నిధుల మూటలను కేటాయించినట్టు ఢంకా భజాయించారు. ఎన్నో ఒడుదుడుకుల మధ్య రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి దాదాపు 19 శాతం సాధించేశామని లెక్కల చిట్టా విప్పారు. అందరినీ అసహనానికి గురిచేస్తున్న ఫీజుల రీయంబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలకు ఒక్క పైసా కూడా తగ్గించలేదని విడమరచారు. పించన్లు, పక్కా ఇళ్లు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, బియ్యం, విద్యుత్‌ పథకాలు కొనసాగుతాయని వక్కాణించారు. గుడిసె రహిత ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తామన్నారు. అయితే, కొండంత పెరిగిపోయిన ద్రవ్యలోటును ఎలా పూడుస్తారో, రుణాంధ్రప్రదేశ్‌గా మారుతున్న రాష్ట్రాన్ని ఏవిధంగా ఒడ్డున పడేస్తారో మాత్రం ఆనం వారు ఆనతీయలేదు. మొత్తానికి ఇందిరమ్మ మార్క్‌ బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ జబ్బలు చరుచుకోగా… ముందుచూపు, అవగాహనా రాహిత్య బడ్జెట్‌ అని ప్రధాన విపక్షం తెదేపా పెదవి విరిచింది.  హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసే ప్రయత్నంలో ప్రాధాన్యత రంగాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ రూ.1,18,542 కోట్ల వ్యయంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2011-12ను ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రూ.80,984 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా, రూ.47,558 కోట్లు ప్రణాళిక వ్యయం కింద కేటాయించారు. రెవెన్యూ మిగులు రూ.3,826 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.17,602 కోట్లు ఉంటుందనే అంచనాతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వార్షిక ప్రణాళిక వ్యయాలను తదనుగుణంగా పెంచుకుంటూ ప్రణాళిక వ్యయంలో రాష్ట్ర ప్రణాళిక రూ.42,931 కోట్లు, కేంద్ర ప్రతిపాదిత పథకాల ఖాతాలకు రూ.4,627 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో ఆర్థిక ప్రణాళిక వ్యయంలో ఆర్థిక సేవలకు 57.64 శాతం, సామాజిక సేవలకు 40.78 శాతం, సాధారణ సేవలకు 1.58 శాతం నిధులు కేటాయించారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2010-11లో పన్ను ఆదాయం రూ.46,999 కోట్లు బడ్జెట్‌ అంచనాలు వేయగా, 20 శాతం పెరుగుదల రేటుతో 2011-12లో రూ.56,435 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 13వ ఆర్థిక సంఘం 2010-15 అవార్డు కాలానికి రూ.13,919 కోట్లు సిఫారసు చేసింది. 2011-12లో ఈ సిఫారసుల కింద రూ.2,359 కోట్ల మొత్తాన్ని పొందుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే రాష్ట్రానికి కేంద్ర నిధుల నుంచి రూ.32,218 కోట్లు ఉంటాయని, అందులో కేంద్ర పన్నులలో రూ.16,826 కోట్లు, ఏఐబిపి, ఇతర కేంద్ర ప్రతిపాదిత పథకాల కింద రూ.15,392 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక మాంధ్య ప్రభావంతోపాటు భారీ, అకాల వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తుల వంటి అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి జాతీయస్థాయికంటే మెరుగైన అభివృద్ధి సాధించగలమని రాంనారాయణరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత ధరల సూచీ ప్రకారం 2009-10లో రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి రూ.4,75,267 కోట్లు ఉండగా, 2010-11లో 18.89 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ.5,65,066 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. అలాగే తలసరి ఆదాయం కూడా 18 శాతం పెరుగుదలతో రూ.51 వేల నుంచి రూ.60 వేలకు పెరగనున్నట్లు అంచనా వేశామని ఆయన చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 156 లక్షల టన్నుల నుంచి 190 లక్షల టన్నులకు పెరగనుందని ఆయన పేర్కొన్నారు. రాబడి వసూళ్ళు 20 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని, వీటిని ప్రణాళికేతర వ్యయం కింద జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులతోపాటు ప్రణాళికబద్ధుల కింద సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యయం చేయనున్నట్లు రాంనారాయణరెడ్డి చెప్పారు.  రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణం, పావలా వడ్డీ, ట్యూషన్‌ ఫీజు రీయంబర్స్‌మెంటు, అభయహస్తం తదితర సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో సాగునీరు, రోడ్లు, భవనాలు, తాగునీటి సరఫరా, విద్యుత్‌ ప్రాజెక్టుల లాంటి మౌలిక సదుపాయాలకు గణనీయమైన కేటాయింపులు కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను గుడిసెరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అర్హతగల పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. సబ్సిడీ బియ్యం పథకం కోసం 2011-12 బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1.19 కోట్ల కుటుంబాలకు రూ.14.69 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ కార్యక్రమం కింద ఇప్పటివరకు 33.79 లక్షల ఇళ్ళు పూర్తి చేశామని, మరో 13.20 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. అర్హులైన మిగిలిన వారికి 4.71 లక్షల ఇళ్ళు ఈ ఏడాది మంజూరు చేశామని రాంనారాయణరెడ్డి తెలిపారు. 2011-12లో 6 లక్షల అదనపు ఇళ్ళను పూర్తి చేయాలని ప్రతిపాదించామని, ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ళకు రూ.2,300 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. వ్యవసాయం: ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరించి, రైతాంగాన్ని మరింత ఆదుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. పంటల బీమా పథకం కింద 2009 ఖరీఫ్‌లో 11.54 లక్షల మంది రైతులకు రూ.699.48 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 2010-11లో ఖరీఫ్‌లో రూ.24,978 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రబీలో రూ.12.63 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.7.63 వేల కోట్లు పంపిణీ చేసినట్లు రాంనారాయణరెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.2,606 కోట్లు, పశుసంవర్థన, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమల శాఖకు మొత్తం రూ.931 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాగునీరు: జలయజ్ఞం కింద 43 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 29.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రెండేళ్ళలో 13.85 లక్షల ఎకరాల్లో సాగునీటిని స్థిరీకరించవచ్చునని ఆయన చెప్పారు. ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు, అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అన్ని అవసరమైన ఆమోదాలను పొంది జాతీయ ప్రాజెక్టుగా పరిగణించేందుకు అన్నివిధాలా అర్హత కలిగి ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ళకు ఏఐబిపి కింద ఆమోదాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. నాగార్జున్‌సాగర్‌ ఆధునీకరణకు రూ.4,444 కోట్ల ఖర్చుతో ప్రపంచ బ్యాంకు రుణ సహాయం కింద చేపడుతున్నామని, ఇందులో రూ.2,025 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందిస్తుందని ఆయన తెలిపారు. అనావృష్టి ప్రాంతాల్లో చెరువులు, కుంటల మరమ్మతులు చేస్తున్నామని, వీటికి 25 శాతం కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌, మిగిలిన 75 శాతం ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్నట్లు చెప్పారు. 2004 నుంచి 2010 వరకు 26.81 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కల్పించగా, 22.94 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును ఏర్పాటు చేశామని, 3.87 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి శాఖకు రూ.15,010 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.  పరిశ్రమలు : రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమల ప్రగతిపైనే ఆధారపడినందున మెరుగైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతో కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలతో 2010-15 నూతన పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక విధానాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద విద్యుత్‌ పరికరాల తయారీ కోసం ఎన్‌టిపిసి-బిహెచ్‌ఇఎల్‌ ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఆరు వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని రాంనారాయణరెడ్డి వివరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి రూ.858 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ : ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎగుమతుల వాటా, జాతీయ ఐటి ఎగుమతుల్లో 15 శాతం ఉందని, రాష్ట్రంలోని అన్ని రంగాల ఎగుమతుల్లో ఐటి రంగం వాటా 49 శాతం ఉందని మంత్రి చెప్పారు. ఐటి రంగం రాష్ట్రంలో దాదాపు 2.75 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందని, ఇతర రంగాల్లో పది లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఐటి రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు 2010-15 కొత్త ఐటి విధానాన్ని రూపొందించిందని, ఈ రంగానికి రూ.51 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.  రోడ్లు, భవనాలు : రాష్ట్రంలో రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టును రూ.8,072 కోట్లతో చేపట్టగా, ఇందులో రూ.1568 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం, రాష్ట్ర వాటా రూ.1597 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 5, 7, 9వ నెంబర్ల జాతీయ రహదారులను నాలుగు లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో స్వర్ణచతుర్భుజి పథకం కింద 1,016 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేసినట్టు చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల కింద ఖమ్మం జిల్లాను కేంద్రం గుర్తించి 599 కిలోమీటర్ల రోడ్డును, 11 వంతెనలను మెరుగుపరిచేందుకు రూ.1,115 కోట్లు ఆమోదించిందని ఆయన తెలియజేశారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖకు రూ.4,108 కోట్ల నిధులను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పాతబస్సులను మార్చి రూ.1,000 కోట్ల వ్యయంతో 6 వేల కొత్త బస్సులను సేకరించాలని ప్రతిపాదించింది. ఆర్టీసికి రూ.200 కోట్ల రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.  మౌలిక సదుపాయాలు, పెట్టుబడి : ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక అభివృద్ధి కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఓడరేవులు, విమానాశ్రయాలు చేపట్టినట్లు చెప్పారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వాడరేవు, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయికి పెంచే పనులు చేపట్టినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.143 కోట్లు ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి చెప్పారు. ఇంధనం: విద్యుత్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం ఉత్పత్తిని పెంచేందుకు అనేక ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. ప్రస్తుతం 14,781 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన శక్తి కలిగి ఉందని, వచ్చే ఏడాది అదనంగా 1,033 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన శక్తిని పెంచాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. 2010-11లో 539 మెగావాట్లను అదనంగా ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 28.35 లక్షల పంపుషెడ్లకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది అదనంగా మరో 1.5 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని ప్రతిపాదించి డిసెంబర్‌ నాటికి 66,106 వ్యవసాయ సర్వీసులను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. విద్యుత్‌ రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.4,940 కోట్లు కేటాయింపులు ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి తెలిపారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య : పాఠశాల విద్యను గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా ప్రోత్సహించేందుకు, మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. సర్వశిక్షా అభియాన్‌, బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమం, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను రాజీవ్‌ విద్యామిషన్‌ కింద అమలు చేస్తున్నామని, ఈ పథకాల అమలుకు ఈ బడ్జెట్‌లో రూ.805 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. సెకండ్రీ విద్య అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టామని, దీనికి రూ.1394 కోట్లు కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం ఖర్చుతో 355 ఆదర్శ పాఠశాలలను పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. రూ.518 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ కింద 1650 ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, సైన్స్‌ ప్రయోగ శాలలు తదితర మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 6,300 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.14,025 కోట్లు కేటాయింపును ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 14 కొత్త విశ్వవిద్యాలయాలను ఇప్పటికే నెలకొల్పామని, వీటిలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు విస్తరిస్తున్నామన్నారు. 13 విశ్వవిద్యాలయాల్లో ఫైనాన్షియల్‌ సర్వీసులు, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, టూరిజం, హాస్పిటాలిటీ, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌లలో ఫినిషింగ్‌ పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు. డిగ్రీ స్థాయిలో సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పేందుకు 75 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల భాష ప్రయోగ శాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ శాఖకు బడ్జెట్‌లో రూ.3,337 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి తెలిపారు. ఆరోగ్యం : ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపరిచి ఏకీకృతం చేస్తున్నామని, దీనికింద లక్షలాది రూపాయలకు ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారానే త్వరలో సేవలు అందిస్తామని స్పష్టంచేశారు. గిరిజనులకు, వలస కార్మికులు, ఇళ్ళు లేనివారికి, మత్స్యకారులు, ఎస్సీలకు సరసమైన ధరలకు ప్రామాణికమైన మందులు అందించేందుకు జన ఔషధి, జనజీవని కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి కోసం రూ.200 కోట్ల ఖర్చుతో కొత్త భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.5,040 కోట్లు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. సంక్షేమం : సాంఘిక సంక్షేమ శాఖకు రూ.2,352 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,230 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.2,104 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.301 కోట్లు, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,948 కోట్ల కేటాయింపును ప్రతిపాదించినట్లు రాంనారాయణరెడ్డి వెల్లడించారు.  నిరుపేదలకు పక్కా గృహాలు, ఎస్సీ విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్‌లు, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నామన్నారు. సంక్షేమ సంస్థలకు బాకీ ఉన్న మార్జిన్‌ మణి రుణాలను మాఫీ చేశామని, ఆదాయం సమకూరే కార్యకలాపాలకు 50 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు ఏర్పాటు చేస్తూ, షెడ్యూల్డ్‌ కులాల వారికి సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం విద్యకు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న 143 హాస్టళ్ళకు అదనంగా మరో 126 కొత్త పోస్టు మెట్రిక్‌ హాస్టళ్ళను మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్షా 46 వేల మంది ఎస్టీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇచ్చామన్నారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు సరికొత్త విధానంలో స్కాలర్‌షిప్‌లను, బోధనా రుసుంలను రీయంబర్స్‌మెంటు చేయనున్నట్లు రాంనారాయణరెడ్డి స్పష్టంచేశారు. బీసీల కోసం 1442 ప్రీీ-మెట్రిక్‌ హాస్టళ్ళు ఉన్నాయని, బీసీల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. లక్ష రూపాయల ఆదాయం లోపుగా ఉన్న మైనారిటీ విద్యార్థులకు రెండవ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు ఫీజు రీయంబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌లను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. మైనారిటీ ఆర్థిక సంస్థ ద్వారా క్రిస్టియన్‌లకు, ముస్లింలకు స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, పిల్లతల్లులకు, 22 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని 231 ఐసిడిఎస్‌ బ్లాకుల్లో ప్రవేశపెట్టామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పిల్లతల్లులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు వారానికి రెండు గుడ్లను అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.  గ్రామీణ, పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా : గ్రామీణాభివృద్ధికి రూ.3,341 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.627 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.773 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.5,080 కోట్లు కేటాయించినట్లు రాంనారాయణరెడ్డి వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ పల్లెబాట, రాజీవ్‌ నగరబాట లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధి పథకం కింద ఈ బడ్జెట్‌లో రూ.400 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.

రాష్ట్ర బడ్జెట్‌లో శాఖలవారీగా కేటాయింపులివే..


(రూపాయలు కోట్లలో)
జలయజ్ఞం : రూ.15,010
ఉన్నత విద్య : రూ.3,335
పాఠశాల విద్య : రూ.14,025
సాంఘిక సంక్షేమం : రూ.2,352
బీసీ సంక్షేమం : రూ.2,104
గిరిజన సంక్షేమం : రూ.1,230
మైనారిటీ సంక్షేమం : రూ.301
వైద్యం, ఆరోగ్యం : రూ.5,040
రాయితీ బియ్యం : రూ.2,500
పరిశ్రమల శాఖ : రూ.858
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ : రూ.51
రహదారులు, భవనాలు : రూ.4,108
మహిళా శిశు సంక్షేమం : రూ.1948
గ్రామీణాభివృద్ధి : రూ.3,341
గ్రామీణ రహదారులు : రూ.627
మౌలిక వసతులు, పెట్టుబడులు : రూ.143
గ్రామీణ నీటి సరఫరా : రూ.773
పట్టణాభివృద్ధి : రూ.5,080
యువజన సంక్షేమం : రూ.57.95
నియోజకవర్గ అభివృద్ధి : రూ.385
అభివృద్ధి సంక్షేమం రూ.400
ఉపాధి హామీ : రూ.600
నీటి పారుదల : రూ.15,010
పశు సంవర్ధన : రూ.931
ఇంధన శాఖ : రూ.4,980
వ్యవసాయ శాఖ : రూ.2,606
ఆర్టీసీ : రూ.200
గృహ నిర్మాణం : రూ.2,300

మణుగూరు ప్యాసింజర్‌కు నిప్పు – ప్రయాణికులు సురక్షితం


రంగల్-విజయవాడ మార్గంలోని తాళ్ళపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు మణుగూరు ప్యాసింజెర్ రైలుకు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో ఒక బోగీ (ఎస్-3) పూర్తిగా దగ్ధమైంది. దీంతో రెండు గంటలపాటు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి.
అప్రమత్తమైన రైలుడ్రైవర్ విషయాన్ని సమీపంలోని తాళ్లపూసపల్లి స్టేషన్ మాస్టర్ షమీర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో పోలీసు, రెవిన్యూఅధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను కేసముద్రం స్టేషన్‌లో, అప్ లైనులో తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణాఎక్స్‌ప్రెస్, విజయవాడ-కాజీపేట ప్యాసింజర్, గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మహబూబాబాద్ స్టేషన్లో గంటపాటు నిలిపివేశారు. రైల్వే, పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

జర్నలిస్టులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి


'మీట్ ది ఎడిటర్‌' లో ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ
విశాఖపట్నం, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థలకన్నా ఎక్కువగా ప్రజలకు జవాబుదారీతనంగా పత్రికా వ్యవస్థ ఉందని ఆంధ్రభూమి పత్రికా సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఎంవిఆర్ శాస్ర్తీతో సోమవారం మీట్ ది ఎడిటర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం అనుసరిస్తున్న ఎన్నికల విధానంలో మొత్తం ఓట్లలో 30 నుంచి 32 శాతం ఓట్లు సంపాదించుకున్న పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అంటే సుమారు 70 శాతం మంది ఆ పార్టీని వ్యతిరేకరించినట్టే కదా! అయినప్పటికీ ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పుకుంటూ, ఐదేళ్ళపాటు తమను అడిగేవాడు లేదన్న ధైర్యంతో ప్రభుత్వాలు, శాసనకర్తలున్నట్టు ఆయన అన్నారు. అలాగే న్యాయ వ్యవస్థకు కూడా అవినీతి జాడ్యం పట్టుకుందని, అందులో పనిచేస్తున్నవారే అంటున్నారని చెపుతూ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వ్యవహారంపై ఇప్పటికీ చర్చ నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ వ్యవస్థను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదని అన్నారు. ఈ రెండు వ్యవస్థలకు రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించారని, అలాంటివేవీ ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే పత్రికా వ్యవస్థకు లేవని చెప్పారు. ఒక పత్రిక తప్పుడు రాతలు రాస్తే, వెంటనే పాఠకుడు వేరే పత్రికను కొనుక్కుంటాడు. పాఠకుల ఆగ్రహానికి గురైతే పత్రిక, చానెళ్ల కార్యాలయాలపై దాడులు జరుగుతాయ. ఒక్కోసారి పత్రికా కార్యాలయాలను తగలబెడుతుంటారు. అయతే ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని మాత్రం రీకాల్ చేసే పరిస్థితి లేదు. కానీ పత్రికలు ప్రజాదరణ కోల్పోతాయని అన్నారు. లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థలకున్న సౌకర్యాలు పత్రికా వ్యవస్థకు లేకపోయినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నది పత్రికలేనని అన్నారు. రాజకీయ వ్యవస్థ కంటే జవాబుదారీతనం పత్రికా వ్యవస్థకే ఎక్కువగా ఉందని శాస్ర్తీ స్పష్టం చేశారు.పత్రికలు ఒక పార్టీకో, కులానికో కొమ్ముకాస్తే, పాత్రికేయులు నిష్పాక్షికంగా ఏవిధంగా రాయగలరని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఎంవిఆర్ శాస్ర్తీ సమాధానం చెపుతూ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్రికనో, ఛానల్‌నో పెట్టినవారు కొంతవరకూ వారి ప్రయోజనం నెరవేరాలనుకోవడంలో తప్పులేదని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఆ పత్రికో, చానలో వ్యవహరించ లేదని తేలినప్పుడు ప్రజలే వాటిని నిరాదరిస్తారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థను కావలి కుక్కతో పోల్చుకుంటారు. ఆ పాత్రను పత్రికలు ఇప్పటివరకు బాగానే నిర్వహిస్తున్నాయ. దొంగలను పసిగట్టి కుక్కలు మొరిగినప్పుడు అప్రమత్తమై ఆ దొంగల భరతం పట్టాల్సిన పని ఇంటి యజమానిదేనని ఆయన అన్నారు. అలాగే పత్రికా వ్యవస్థ ఉన్నత స్థానంలో ఉన్నదని, అవినీతి అక్రమాలను బహిర్గతం చేసినప్పుడు అప్రమత్తమై దోషులకు తగిన శాస్తి చేయవలసిన బాధ్యత పౌరసమాజానిదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు, సమాజం నిర్లిప్తంగా ఉంటూ మీడియానే అంతా చేయాలని మిన్నకుండడం వల్లే గ్రంథసాంగులకు ఆడిందే ఆటైందని అన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో పాత్రికేయులు తమ వృత్తిని పవిత్రంగా భావించి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ స్పృహ ఉన్నప్పుడు అద్భుతమైన వార్తలు రాయగలుగుతారని అన్నారు. పాత్రికేయులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మరే వ్యవస్థకూ తీసిపోని చురుకైన పాత్ర వహిస్తున్నందుకు వారికి వృత్తిపరమైన గర్వం, ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు.

దశ దిశ లేని బడ్జెట్ ! ఫీరీయింబర్స్‌మెంట్ ఎలా చెల్లిస్తారు ?


ఉచిత విద్యుత్ ప్రస్తావన ఏది? : చంద్రబాబు
బడ్జెట్‌పై ప్రభుత్వానికి అవగాహన లేదని, శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దశ దిశ లేని బడ్జెట్‌గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభివర్ణించారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పేర్కొన్న ప్రభుత్వం రైతుల ఉచిత కరెంట్ గురించి ప్రస్తావించలేదని అన్నారు. గతంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అది ఎక్కడా అమలుకాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం ప్రవేళపెట్టిన బడ్జెట్‌పై చంద్రబాబు స్పందిస్తూ బడ్జెట్‌లో సంక్షేమానికి రెండు శాతం కోత విధించారని, విద్యార్ధుల ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి నిధులను సేకరించడం సంస్కరణల కిందకు రాదని అన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని, రైతుకు రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని గతంలో పేర్కొన్నారు. కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వలేదని అన్నారు. విద్యుత్ రంగాన్ని ఈ ప్రభుత్వం రోజు రోజుకూ పతనావస్థకు తీసుకు వెళుతోందని, బడ్జెట్‌లో శాంతిభద్రతల ప్రస్తావనే లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tuesday, February 15, 2011

పులివెందులలో బాబు... తర్వాత చిరు: జగన్ ఓటమే లక్ష్యం


లక్షల ఓట్ల మెజార్టీ కట్టబెట్టే కడప జిల్లా, వైఎస్ జగన్ ఇలాకా‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం రోడ్ షో నిర్వహించారు. పర్యటనలో భాగంగా వైఎస్ వర్గానికి మహా పట్టున్న పులివెందుల, వేంపల్లిలోనూ పర్యటించారు. 
చంద్రబాబు నాయుడు రోడ్ షోకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆగిన చోటల్లా వైఎస్ జగన్ పై బాబు విమర్శల వర్షం కురిపించారు. జగన్ అక్రమ ఆస్తులను కోట్లలో కూడబెట్టారనీ, వేల ఎకరాలు స్వాహా చేసి ఆ డబ్బుతో సాక్షి పత్రికను నెలకొల్పారని దుమ్మెత్తి పోశారు. 
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చివుంటే సోనియా గాంధీ దేవత అంటూ అక్కడే జపం చేస్తూ ఉండేవారనీ, పదవి రాకపోయే సరికి సోనియా దెయ్యమంటూ నిందిస్తూ సొంత కుంపటికి సమాయత్తమయ్యారన్నారు. 
ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ నాటకమాడుతుంటే, బాబాయ్ వైఎస్ వివేకా పార్టీలోనే ఉంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నా రైతులను కష్టాల నుంచి గట్టున పడేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. 
కోటానుకోట్ల అక్రమ ఆస్తులను వెనకేసుకున్న నాయకులను పక్కనపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు ప్రయోజనాలకోసం అవిశ్రాంత పోరాటం చేస్తుందని అన్నారు. 
త్వరలో పులివెందుల, కడప లోక్‌సభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగనున్న నేపధ్యంలోనే బాబు రోడ్ షో నిర్వహించారని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ గెలుపుకు కళ్లెం వేయాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన చిరంజీవి కడపలో పర్యటించనున్నట్లు సమాచారం.

Sunday, February 13, 2011

మే 5న జూనియర్ ఎన్టీఆర్‌ వివాహం


జూనియర్ ఎన్టీఆర్‌ లగ్నపత్రిక వేడుక నార్నే వారి ఇంట ఘనంగా జరిగింది. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, నారావారి దంపతులతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మే 5న హైటెక్‌సిటీలోని హైదరాబాద్‌ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతిల వివాహం చేయడానికి రెండు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే వివాహ సమయాన్ని మాత్రం తర్వాత చెబుతామని హరికృష్ణ తెలిపారు. 

Saturday, February 12, 2011

వైయస్ జగన్ టీమ్ READY : అంబటి రాంబాబు, భూమనలకు పెద్ద పీట.


పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్వివివిధ జిల్లాలకు 
శుక్రవారం సమన్వకర్తలను ఏర్పాటు చేశారు.కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు కూడా
సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. తనజట్టును ఏర్పాటు చేసుకున్నారు.
జట్టులో అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డిలకు పెద్ద పీట
వేశారు . కోస్తాంధ్ర సమన్వయకర్తగా అంబటి రాంబాబును, రాయలసీమ
సమన్వయకర్తగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు .
తెలంగాణకు మాత్రం సమన్వయకర్తను ఏర్పాటు చేసినట్లు లేదు.
శాసనసభ్యురాలు కొండా సురేఖ మాత్రం ఈజాబితాలో ఉన్నట్లు లేరు .
నల్లగొండ జిల్లాకు ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిని , మెదక్
జిల్లాకు కె. కె. మహేందర్ రెడ్డిని,కడప జిల్లాకు బాలరాజును,
కర్నూలు జిల్లాకు నలిమిల్లి శేషారెడ్డిని ,విజయనగరం జిల్లాకు అత్తిలి
రంగరాజును , తూర్పు గోదావరి జిల్లాకు ఇందుకూరు రామకృష్ణ రాజును,
గుంటూరు జిల్లాకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ,నెల్లూరు జిల్లాకు బాలినేని
శ్రీనివాస రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది .
ఖమ్మం జిల్లాకు జాడ కృష్ణ మూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాకు అమర్నాథ్
రెడ్డిని , విశాఖపట్నం జిల్లాకు భూమా నాగిరెడ్డిని, శ్రీకాకుళం ఆళ్ల
నానిని, చిత్తూరు జిల్లాకు మేకపాటి చంద్రశేఖర రెడ్డిని సమన్వయకర్తలుగా
నియమించినట్లు సమాచారం .కాగా, నిజామాబాద్ జిల్లాకు గోనె
ప్రకాశ రావును, రంగారెడ్డి జిల్లాకు జూపూడి ప్రభాకరరావును,
ఆదిలాబాద్ జిల్లాకు రెహ్మాన్ను, వరంగల్ జిల్లాకు బాజిరెడ్డి
గోవర్దన్ను , మహబూబ్నగర్ జిల్లాకు గట్టు రామచంద్రరావును,
అనంతపురం జిల్లాకు శోభానాగిరెడ్డిని , హైదరాబాద్
జిల్లాకు జనక్ ప్రసాద్ను వైయస్ జగన్ సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది


Sunday, February 6, 2011

కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం: చిరంజీవి




 సోనియాతో భేటీ అనంతరం ప్రకటించిన చిరు 
 సామాజిక న్యాయం కోసమే విలీనం 
 మంత్రివర్గంలో చేరతామన్న చిరు 

సస్పెన్స్‌ వీడిపోయింది. హస్తంలో ఒదిగిపోయాడు సూర్యుడు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినప్పటికీ దీపముండగానే ఇల్లు చక్కబెట్టేసుకున్నారు చిరు. పొత్తా, విలీనమా ఇలా ఇప్పటివరకు సాగిన ఊహాగానాలకు పుల్‌స్టాప్‌ పడింది. కాంగ్రెస్‌ పార్టీలో పీఆర్పీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ విలీనంపై చర్చించారు. సామాజిక న్యాయం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు చిరు. వ్యక్తిగత ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారాయన. రాష్ట్ర మంత్రి వర్గంలో చేరనున్నట్లు చెప్పిన చిరు...పార్టీ నేతల అభిమతం మేరకే ఈ డెసిషన్‌ తీసుకున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, రాష్ట్ర ప్రయోజనాలంటూ విలీనానికి చిరంజీవి చాలా కారణాలే చెప్పినా దీని వెనుక పెద్ద ఎత్తుగడే ఉన్నట్లు కన్పిస్తోంది. సమైక్య నినాదం ఎత్తుకోవడంతో ఇప్పటికే తెలంగాణలో పీఆర్పీ చరిత్ర క్లోజ్‌ అయింది. సీమాంధ్రలోనూ పలువురు ఎమ్మెల్యేలు, నేతలు జగన్‌కే జై కొట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నడపడం చిరుకి శక్తికి మించిన పనిగా మారింది. ఈ టైంలో జగన్‌ ఫ్యాక్టర్‌ కాంగ్రెస్‌ను షేక్‌ చేయడం చిరుకు బాగా లాభించింది. జగన్‌ వెనుక దాదాపు 30 మంది ఎమ్మెల్యేలుండడంతో పీఆర్పీ మద్దతు కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. అంతే చిరంజీవి కాంగ్రెస్‌కు ఆపన్న హస్తం అందిస్తానంటూ ముందుకొచ్చారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఇరుపార్టీల పొత్తు కూడా ఇందులో భాగమే. అప్పట్నుంచీ జరుగుతున్న ప్రక్రియ ఇప్పుడు ఫైనలైంది. ఇక తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా చిరు బాగానే లాభపడ్డారనే టాక్‌ విన్పిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో పీఆర్పీకి ఐదు పదవులతోపాటు చిరుకు పార్టీలో సముచిత స్థానం దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. పీఆర్పీ విలీనంతో తమ బలం మరింత పెరిగిందన్నారు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీ. పార్టీలో చిరుకు సముచిత స్థానం ఇస్తామని తెలిపారాయన.

Thursday, February 3, 2011

వైఎస్ లేఖను బయటపెట్టిన ఉండవల్లి,


చిరుతో రాజకీయ బంధం
ఆనాడే చెప్పిన రాజశేఖర్ రెడ్డి
వైఎస్ లేఖను బయటపెట్టిన ఉండవల్లి, 
 రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యంతోప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో రాజకీయ బంధం పెంచుకోవాలన్న ప్రయత్నాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే స్వయంగా అంకురార్పణ చేశారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. విధానసభ ఎన్నికలలో 15.75 శాతం ఓట్లు సంపాదించుకున్న చిరంజీవి కేంద్ర మంత్రి వర్గంలో చేరితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారని ఆయన అన్నారు. ఈ మేరకు విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే18న సోనియా గాంధీకి వైఎస్ రాసిన లేఖను ఉండవల్లి బుధవారం విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే ఈలేఖను తన ద్వారా ఒక సీల్డు కవర్‌లో పార్టీ అధ్యక్షురాలికి అందచేయించారని ఆయన చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే వైఎస్ ఈ ప్రతిపాదన చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీతో కలిసి పనిచేసే విషయంలో రాజశేఖర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని అనేక సార్లు బహిరంగంగానే చెప్పారని అరుణ్‌కుమార్ తెలిపారు. తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఘన విజయం తెచ్చిపెడతాయని ఆశించిన రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో 36 శాతం ఓట్లు రావడంతో నిరాశపడ్డారు. 2014లో జరిగే ఎన్నికలలో 50 శాతం ఓట్లు సాధించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చిరంజీవితో కలసి ప్రయాణం చేయాలని భావించే పార్టీ అధ్యక్షురాలికి చిరంజీవిని కేంద్రంలోకి తీసుకోవాలని సూచించారని ఆయన చెప్పారు. సోనియాగాంధీకి రాసిన సుదీర్ఘ లేఖలో కేంద్ర మంత్రి వర్గం ఏర్పాటులో సొంతపార్టీ వారి కంటే బయటి వారికే ప్రాధాన్యం ఇచ్చామన్న విషయాన్ని గుర్తు చేశారని అరుణ్ స్పష్టం చేశారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాల ముందే దూరదృష్టితో రాజశేఖర్‌రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన తనకు కెవిపికి, పార్టీ అధ్యక్షురాలికి తప్పించి ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. రాజశేఖర్‌రెడ్డి మనోగతాన్ని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖను బయటపెట్టినట్లు ఆయన చెప్పారు.
నీకా లేఖ ఎక్కడిది?
ఉండవల్లిని ప్రశ్నించిన అంబటి,
 వైఎస్ లేఖను ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించిన తీరును జగన్ వర్గనేత అంబటి రాంబాబు ఆక్షేపించారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, చిరంజీవిని కేంద్ర మంత్రిగా చేయాలని వైఎస్సే సూచించారని, దానినే ఇప్పుడు కేంద్రం అమలు చేస్తోందన్న ఉండవల్లి వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. అధిష్ఠానంతో చేసే ఉత్తర ప్రత్యుత్తరాలు మూడో కంటికి తెలియవని, ఆ లేఖ ఉండవల్లికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

Tuesday, February 1, 2011

జగన్ పోలవరం యాత్రకు చకచకా ఏర్పాట్లు


* 73 కిలోమీటర్ల పాదయాత్ర 
* హరితయాత్రగా నామకరణం 
* నాలుగు రోజులపాటు యాత్ర 
* భారీ ఏర్పాట్లలో అనుచరులు 
* ఏడు - రావులపాలెం - పేరవరం 
* ఎనిమిది - పేరవరం - ధవళేశ్వరం - కొవ్వూరు 
* తొమ్మిది - కొవ్వూరు - వేగేశ్వరపురం 
* పది - వేగేశ్వరపురం - పోలవరం 
యువనేత జగన్‌ మహానేత వైఎస్‌ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. తన తండ్రిలా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ హరితయాత్రను చేయనున్నారు. వచ్చే నెల ఏడున రావులపాలెంలో ప్రారంభం కానున్న హరిత యాత్ర పదో తేదీన పోలవరం బహిరంగ సభతో ముగియనుంది. ఈ యాత్ర కోసం జగన్‌ అభిమానులు ఉభయగోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, యంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న యువనేత జగన్ ఈ సారి తన దృష్టిని పోలవరం ప్రాజెక్ట్ పై సారించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతూ పాద యాత్ర చేపడుతున్నారు. వచ్చే నెల 7 నుండి నాలుగు రోజుల పాటు హరిత యాత్ర కొనసాగుతుంది. 7న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి యాత్ర ప్రారంభమై పేరవరం వరకు 15 కిలో మీటర్లు పాద యాత్ర కొనసాగుతుంది.8న పేరవరం నుండి దవళేశ్వరం, రాజమండ్రి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు 22 కిలో మీటర్ల పాద యాత్ర కొనసాగుతుంది. 9న కొవ్వూరు నుండి ప్రారంభమై వేగేశ్వరపురం వరకు, 10న పోలవరం వరకు పాద యాత్ర కొనసాగుతుంది. మొత్తం 73 కిలో మీటర్లు జగన్ పాద యాత్ర కొనసాగుతంది. 
పోలవరం ప్రాజెక్ట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగానే జగన్ హరిత యాత్ర చేపడుతున్నారని టీటీడి మాజీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు, పోరాటాలు చేపట్టినా, జగన్ ఏకంగా పాద యాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.


కిరణ్‌ సర్కారులోకి మెగాపార్టీ ...!! సోనియాతో చిరంజీవి భేటీ, అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు


బడ్జెట్‌ సమావేశాలకు ముందే విస్తరణ ! 
* కేబినెట్‌లో PRPకి 3 లేదా 4 బెర్తులు ! 
* చిరుతో ఆంటోని రహస్య మంతనాలు 
* డిప్యూటీ సీఎంగా చిరు ?
ఊహించిందే జరిగింది. బేరం కుదుర్చుకుంది. PRPతో అధికారం పంచుకునేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. అకస్మాత్తుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆంటోని చిరంజీవితో భేటీ కావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా జరిగిన ఈ హాఠాత్పారిణామం రాష్ట్రాన్ని షేక్‌ చేస్తోంది. డిప్యూటీ సీఎం సహా మూడు నాలుగు బెర్త్‌లు ఇస్తారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే కాంగ్రెస్‌ ఆఫర్‌కు చిరు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కడిగిపారేసిన PRPతో అంటకాగేందుకు సిద్ధమైంది అధికారపార్టీ. బొటాబొటి మెజార్టీతో పాలన నెగ్గొకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ సర్కారుకు ఆక్సిజన్‌ ఎక్కించేందుకు గత కొన్ని నెలలుగా హైకమాండ్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. యువనేత జగన్మోహన్‌రెడ్డి కడప ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఢిల్లీ పెద్దలకు ముచ్చెమటలు పోశాయి. క్షణం ఆలస్యం చేయకుండా నువ్వే ఆపద్భాంధవుడివంటూ చిరు శరణు జొచ్చారు. ఎన్నికలప్పుడు దుమ్మెత్తిపోసిన చిరు మాటలను ఓ చెత్తో తుడుచుకుని మరో చేయితో స్నేహ హస్తం అందించింది కాంగ్రెస్‌. హుటాహుటిన హస్తినకు పిలిపించుకున్న సోనియా చిరుతో ఫేస్‌ టు ఫేస్‌ భేటీ అయ్యారు. తమను ఆదుకుంటే భారీ ప్రతిఫలం ఇస్తామని బేరం పెట్టారు. మరు మాట్లాడకుండా మేడం బంపరాఫర్‌కు OK చెప్పారు చిరు. ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేసిన వెంటనే PRP అధికారంలో చేరుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో సీన్‌ రివర్సయింది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత యువనేత జగన్‌ లక్ష్య దీక్ష, జలదీక్ష, జనదీక్ష చేయడంతో 25 మంది కాంగ్రెస్‌ MLAలు క్యూ కట్టారు. దీంతో మళ్లీ షేకయిన హైకమాండ్‌... నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. PRP, MIMలను టచ్‌లో ఉంచుకుని సర్కారుకు ముప్పు రాకుండా వ్యూహాలు సిద్ధం చేసింది. అయితే జగన్‌ దీక్షల్లో పాల్గొన్న MLAలు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్‌ విసరడం వివాదస్పదమైంది. దమ్ముంటే హైకమాండే చర్యలు తీసుకోవాలంటూ యువనేత వర్గం ప్రతిసవాల్‌ చేయడంతో ఖంగుతిన్నారు పెద్దలు. YS తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టబోమని పదేపదే చెబుతున్నా... కాంగ్రెస్‌ నుంచే కవ్వింపు చర్యలు వస్తుండడం అది కూడా CM స్థాయి వ్యక్తి నుంచే రావడం డేంజర్‌ సంకేతాలు వెళ్లాయి. మరో మూడేళ్ల పాటు అసెంబ్లీకి కాలపరిమితి ఉండడంతో భారీ నష్టం జరక్కముందే జాగ్రత్తపడాలనుకున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ హుటాహుటిన ఆంటోనిని పంపి రాజకీయం చక్కబెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి మలుపు ఉంటుందని గత కొన్ని నెలలుగా ఊహిస్తూనే ఉన్నారు. అయితే ఉరుములేని వానలా ఆంటోని హైదరాబాద్‌ రావడం పెను దుమారం రేపింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా చిరు నివాసానికి చేరుకున్న ఆంటోని వెంట PCC చీఫ్‌ D.శ్రీనివాస్‌ ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర సర్కారులో చేరే PRPకి డిప్యూటీ సీఎంతోపాటు మూడు నాలుగు బెర్త్‌లు ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్‌లో PRP విలీనం విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో MLC ఎన్నికల్లో సహాయం చేసింది PRP. బావమరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ స్థానం ఇస్తారని అప్పట్లో ప్రచారం గుప్పుమంది. కానీ చివరిలో ఆ డీల్‌ క్యాన్సిల్‌ అయింది. మరిప్పుడు అలాంటి ప్రతిపాదనలే ఉండొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌కు చిరు ఎలా రియాక్ట్‌ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది.  చిరంజీవి రేపో మాపో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారా, విలీనం కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించడానికే రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హైదరాబాదు వచ్చారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు. సోనియాను కలవాలని ఆంటోనీ చిరంజీవికి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆంటోనీ, చిరంజీవి భేటీలో రహస్యమేమీ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో చేరే విషయంపై చర్చ జరగలేదని, రెండు పార్టీలున కలిసి పనిచేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు.కాగా, చిరంజీవి వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రేపటి నుంచి చిరంజీవి తిరుపతి పర్యటన చేయాల్సి ఉంది. ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌ వర్గానికి చెందిన శాసనసభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుని, చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకుంటుందని అంటున్నారు. తొలి విడతగా జగన్ వర్గానికి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపై వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శానససభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సి. రామచంద్రయ్య కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.

జగన్‌కు చెక్, చిరుని తన నివాసంలో కలిసిన రక్షణ మంత్రి ఏకే ఆంటోని


కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు, రక్షణ మంత్రి ఏకే ఆంటోని హైదరాబాద్ వచ్చారు. వచ్చిన వెంటనే పీసీసీ చీఫ్ డి. శ్రీనివాసరావును వెంటబెట్టుకుని నేరుగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇంటికి వెళ్లడం జరిగింది. కేంద్రమంత్రి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రజారాజ్యం పార్టీని భాగస్వామి కావాలని కోరినట్లు తెలిసింది. ఇది కూడా బడ్జెట్ సమావేశాలకంటే ముందే జరిగిపోవాలని ఆయన కోరినట్లు సమాచారం.హఠాత్తుగా చిరుతో సోనియా దూత భేటీ కావడం వెనుక కారణాలను విశ్లేషిస్తే.... జగన్ వర్గం కాంగ్రెస్ సర్కార్‌ను ఎప్పటినుంచో బెదిరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మద్దతుతో ఆ వర్గంపై గట్టి చర్యలు తీసుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వంలో చేరితే ప్రస్తుతం యూపీఎ ఎదుర్కొంటున్న అనేక అవినీతి కుంభకోణాలకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందేమోనన్న భయంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా బడ్జెట్ సమావేశాలకంటే ముందుగా ఎలాగైనా పీఆర్పీని క్యాబినెట్‌లోకి ఆకర్షించాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా యత్నిస్తున్నట్లు సమాచారం. ఇక మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన సోంత జిల్లా అయినటువంటి చిత్తూరులో రచ్చబండ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాదులో లేకపోవడం కేంద్రమంత్రి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.ఐతే ఈవిషయంలో పెద్ద ఆలోచించవలసిందిగా ఏమిలేదని అంటున్నారు. ఈ సందర్బంలో డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజకీయాల్లో బాగా పరిణితి చెందారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి ప్రారంభ రాజకీయాలకు నేటి రాజకీయాలకు ఎంతో తేడా ఉందన్నారు.