Thursday, February 24, 2011

దశ దిశ లేని బడ్జెట్ ! ఫీరీయింబర్స్‌మెంట్ ఎలా చెల్లిస్తారు ?


ఉచిత విద్యుత్ ప్రస్తావన ఏది? : చంద్రబాబు
బడ్జెట్‌పై ప్రభుత్వానికి అవగాహన లేదని, శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దశ దిశ లేని బడ్జెట్‌గా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభివర్ణించారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని పేర్కొన్న ప్రభుత్వం రైతుల ఉచిత కరెంట్ గురించి ప్రస్తావించలేదని అన్నారు. గతంలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అది ఎక్కడా అమలుకాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం ప్రవేళపెట్టిన బడ్జెట్‌పై చంద్రబాబు స్పందిస్తూ బడ్జెట్‌లో సంక్షేమానికి రెండు శాతం కోత విధించారని, విద్యార్ధుల ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి నిధులను సేకరించడం సంస్కరణల కిందకు రాదని అన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని, రైతుకు రోజుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని గతంలో పేర్కొన్నారు. కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వలేదని అన్నారు. విద్యుత్ రంగాన్ని ఈ ప్రభుత్వం రోజు రోజుకూ పతనావస్థకు తీసుకు వెళుతోందని, బడ్జెట్‌లో శాంతిభద్రతల ప్రస్తావనే లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment