Thursday, February 3, 2011

వైఎస్ లేఖను బయటపెట్టిన ఉండవల్లి,


చిరుతో రాజకీయ బంధం
ఆనాడే చెప్పిన రాజశేఖర్ రెడ్డి
వైఎస్ లేఖను బయటపెట్టిన ఉండవల్లి, 
 రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యంతోప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో రాజకీయ బంధం పెంచుకోవాలన్న ప్రయత్నాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే స్వయంగా అంకురార్పణ చేశారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. విధానసభ ఎన్నికలలో 15.75 శాతం ఓట్లు సంపాదించుకున్న చిరంజీవి కేంద్ర మంత్రి వర్గంలో చేరితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారని ఆయన అన్నారు. ఈ మేరకు విధానసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే18న సోనియా గాంధీకి వైఎస్ రాసిన లేఖను ఉండవల్లి బుధవారం విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే ఈలేఖను తన ద్వారా ఒక సీల్డు కవర్‌లో పార్టీ అధ్యక్షురాలికి అందచేయించారని ఆయన చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే వైఎస్ ఈ ప్రతిపాదన చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీతో కలిసి పనిచేసే విషయంలో రాజశేఖర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని అనేక సార్లు బహిరంగంగానే చెప్పారని అరుణ్‌కుమార్ తెలిపారు. తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఘన విజయం తెచ్చిపెడతాయని ఆశించిన రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో 36 శాతం ఓట్లు రావడంతో నిరాశపడ్డారు. 2014లో జరిగే ఎన్నికలలో 50 శాతం ఓట్లు సాధించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చిరంజీవితో కలసి ప్రయాణం చేయాలని భావించే పార్టీ అధ్యక్షురాలికి చిరంజీవిని కేంద్రంలోకి తీసుకోవాలని సూచించారని ఆయన చెప్పారు. సోనియాగాంధీకి రాసిన సుదీర్ఘ లేఖలో కేంద్ర మంత్రి వర్గం ఏర్పాటులో సొంతపార్టీ వారి కంటే బయటి వారికే ప్రాధాన్యం ఇచ్చామన్న విషయాన్ని గుర్తు చేశారని అరుణ్ స్పష్టం చేశారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాల ముందే దూరదృష్టితో రాజశేఖర్‌రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన తనకు కెవిపికి, పార్టీ అధ్యక్షురాలికి తప్పించి ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. రాజశేఖర్‌రెడ్డి మనోగతాన్ని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖను బయటపెట్టినట్లు ఆయన చెప్పారు.
నీకా లేఖ ఎక్కడిది?
ఉండవల్లిని ప్రశ్నించిన అంబటి,
 వైఎస్ లేఖను ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించిన తీరును జగన్ వర్గనేత అంబటి రాంబాబు ఆక్షేపించారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, చిరంజీవిని కేంద్ర మంత్రిగా చేయాలని వైఎస్సే సూచించారని, దానినే ఇప్పుడు కేంద్రం అమలు చేస్తోందన్న ఉండవల్లి వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. అధిష్ఠానంతో చేసే ఉత్తర ప్రత్యుత్తరాలు మూడో కంటికి తెలియవని, ఆ లేఖ ఉండవల్లికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 

No comments:

Post a Comment