Sunday, April 1, 2012

చిరంజీవి నెత్తిన తిరుపతి భారం !!!


చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో తిరుపతి అసెంబ్లీ సీటుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. తాను ఖాళీ చేసిన ఈ సీటుని తన భార్య సురేఖతో భర్తీ చేయాలని చిరంజీచి మొదట భావించారు. అయితే దీనికి అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ ఎవరికీ టిక్కెట్ ఇస్తే వారిని గెలిపించడానికి కృషి చేస్తానని చిరంజీవి మాట వరసకు అన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా అభ్యర్థి ఎంపిక బాధ్యతను, అతన్ని గేలించుకునే కర్తవ్యాన్ని కూడా చిరంజీవికే అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఐదు రోజుల క్రితం 18 శాసనసభ స్థానాల ఎంపిక గురించి మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తిరుపతి అభ్యర్థి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ భారం చిరంజీవికే వదిలేద్దామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
దీంతో చిరంజీవికి తిరుపతి బరువు బాధ్యతలు మోయకతప్పేట్లు కనిపించడం లేదు. చిరంజీవికి ఈ బాధ్యతను అప్పగించడం ద్వారా కొంత బరువును దించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ వైఫల్యం చిరంజీవిపై నెట్టివేసి ఆయన పరపతిని తగ్గించవచ్చు. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి గెలిస్తే దానికి పెద్ద్డగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదనేది కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. 

No comments:

Post a Comment