Saturday, September 24, 2011
Sunday, September 18, 2011
ముగ్గురు నేతలకు మైనస్ మార్కులే ???
ముగ్గురు నేతలకు మైనస్ మార్కులే
Monday, September 12, 2011
12 వ పంచవర్ష ప్రణాళిక చివరికి 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్
విశాఖపట్నం;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
అంతకు ముందు సింహాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన సభలో షిండే మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఏటా 9,200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని అపంచవర్ష ప్రణాళిక చివరికి 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్
విశాఖపట్నం;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
అంతకు ముందు సింహాద్రి పవర్ ప్లాంట్‌లో జరిగిన సభలో షిండే మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఏటా 9,200 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోందని అన్నారు. పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని సేకరించడం వలన చాలా మంది నిరాశ్రయులవుతున్నారని అన్నారు. ఇకపై కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు ముందుగానే నిర్వాసితుల్లో అర్హత కలిగిన యువకులకు ఆయా ప్లాంట్లలో పనిచేయడానికి కావల్సిన శిక్షణను ముందుగానే ఇప్పించాలని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్‌టిపిసి దేశంలోనే తలమానికమైన సంస్థగా అభివర్ణించారు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు అంకితభావం ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్‌టిపిసి ఆరు లక్షల మొక్కలు నాటాలనుకోవడం శుభపరిణామమని అన్నారు. ఎన్‌టిపిసి సిఎండి అరూప్‌రాయ్ చౌదరి మాట్లాడుతూ దేశానికి అవసరమైన విద్యుత్‌లో 1/3 విద్యుత్‌ను ఎన్‌టిపిసి అందిస్తోందని అన్నారు. మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ ఎన్‌టిపిసి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ మొత్తాన్ని మన రాష్ట్రానికే చెందేటట్టు చూడాలని కోరారు.
Sunday, September 11, 2011
Friday, September 9, 2011
Monday, September 5, 2011
Sunday, September 4, 2011
శాకాహారమే ఎందుకు తినాలి?
శాకాహారమే ఎందుకు తినాలి?
కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చదవండి.డీటాక్సిఫై : వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు.
ధృడమైన ఎముకలు : మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.
కార్బోహైడ్రేట్స్ లోపం : నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం: బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.
బరువు నియంత్రణ : కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.
ఫైటో న్యూట్రియెంట్స్ : డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది.
సులభంగా నమలడం : మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.
Subscribe to:
Posts (Atom)