చిరును కాంగ్రెస్ కొనేసింది... నేను జగన్‌కు అమ్ముడుపోలేదు
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎంతో ఆర్భాటంగా సామాజిక న్యాయం చేస్తానంటూ చంకలు గుద్దుకుంటూ వచ్చిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని "మెంటల్ కృష్ణ" పోసాని కృష్ణ మురళి విమర్శించాడు. ప్రజారాజ్యం పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరాననీ, అయితే కళ్లు తెరిచి చూసేలోగా అంతా అయిపోయిందనీ, చిరు ప్రజారాజ్యం పార్టీని టోకుగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని మండిపడ్డారు. తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంపై కొంతమంది తమకు తోచిన విధంగా బురద చల్లుతున్నారన్నారు. తానేమీ డబ్బులకు అమ్ముడు పోలేదనీ, రాష్ట్రంలో ఉన్న నాయకులందరిలో జగన్ నీతిపరుడనీ, అందుకే అతడి వెంట కలిసి నడవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ జగన్ అవినీతిపరుడని నిరూపిస్తే తన తలను వారి నిరూపించినవారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమని చెప్పుకొచ్చాడు.
No comments:
Post a Comment