లాడెన్ మృతితో అమెరికాలో సంబరాలు
ప్రపంచాన్ని గడగడలాడించిన కరుడు గట్టిన ఉగ్రవాది, అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మృతి చెందినట్లు సమాచారం. లాడెన్ మృతిచెందాడని అమెరికా న్యూస్‌నెట్‌వర్క్ సోమవారం వెల్లడించింది. ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. లాడెన్ మృతదేహాన్ని అమెరికా సైనికులు కనుగొన్నట్లు అల్‌జజీరా, అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇస్లామాబాద్‌లో అమెరికా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో లాడెన్ హతమయ్యారు. అతని మృతిని యూఎస్ ఇంటిలిజెన్స్ కూడా ధ్రువీకరించింది.
ఇస్లామిక్ ఉగ్రవాదంతో లాడెన్ ప్రపంచం వెన్నులో చలి పుట్టించాడు. 2002, సెప్టెంబర్ 11న డబ్ల్యూటీవోపై జరిగిన దాడితో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. అప్పటివరకూ ఉగ్రవాదంపై ఉదాసీనత ప్రదర్శించిన అమెరికా ఈ దాడితో మేల్కొంది. ఉగ్రవాదంపై పోరులో పెద్దన్న పాత్ర పోషించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లపై యుద్ధాలు చేసింది. అప్ఘాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను పట్టుకోవడం కోసం అమెరికా అణువణువు గాలించింది.
పదేళ్లుగా దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టి, తప్పించుకు తిరుగుతున్న లాడెన్ ఎట్టకేలకు అమెరికా సైన్యం చేతిలో హతమయినట్లు తెలుస్తోంది.
లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదా ప్రపంచంలోని పలుదేశాలపై దాడులు జరిపింది. మానవబాంబు దాడులతో భారీస్థాయిలో ప్రాణనష్టం, భయోత్పాతాన్ని సృష్టించింది.
అమెరికా దాడిలో ఒసామా బిన్ లాడెన్ మృతిచెందాడన్న వార్తలు వెలువడడంతో అమెరికాలో సంబరాలు చేసుకుంటున్నారు. లాడెన్ మరణవార్తను ధ్రువీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటన చేయగానే శ్వేతసౌధం వద్ద గుమిగూడిన ప్రజలు ఆనందానికి హద్దులేకపోయాయి. కేరంతలతో ఆమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

No comments:
Post a Comment