Sunday, May 1, 2011

మేమంటే జగన్‌కు అసూయ: జీవిత, రాజశేఖర్‌


జగన్‌ని కడిగి పడేసిన జీవిత, రాజశేఖర్‌
మొన్నటి వరకూ వీరుడూ   అని వైఎస్ జగన్ని పొగడ్తలతో ముంచెత్తిన హీరో డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రివర్స్‌ గేరులో జగన్‌పై నిప్పులవాన కురిపించారు. శుక్రవారం ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ జగన్‌ని కడిగి పారేసి కన్నీళ్లపర్యంతమయ్యారు. జలదీక్షలో తమ మాటలకు వచ్చిన ప్రతిస్పందన చూసి జగన్ అసూయ పడ్డారని… అందుకే జగన్, ఆయన పార్టీ నేతలు తమని కావాలే దూరంగా ఉంచారని ఆరోపించారు. ఇతరులు ఫోకస్ కావడం జగన్‌కు అసలూ ఇష్టం ఉండదని…తండ్రి వైయస్ సింపతీతో త్వరగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. తండ్రి ఆశయాలు సరిగా అమలు చేయడం లేదని పదే పదే ఆరోపిస్తున్న జగన్‌ అదే నిజమైతే ఆయన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులో ఎందుకు ఉన్నారో కూడా చెప్పాలని నిలదీసారు. పనిలో పనిగా చిరంజీవిపైనా విమర్శలు చేస్తూ… పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ సేవల్ని గురించకపోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు జీవిత.

No comments:

Post a Comment