Saturday, May 21, 2011

గుడ్డు(జగన్)వచ్చి పిల్ల(బాబు)ను వెక్కిరించిందట: బాబు


గుడ్డు(జగన్)వచ్చి పిల్ల(బాబు)ను వెక్కిరించిందట: బాబు
రైతుల పట్ల గతంలో తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ విమర్శించడాన్ని చంద్రబాబు కొట్టి పారేశారు. వెనకటికి ఓ సామెత చెప్పినట్లు గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా జగన్ మాటలున్నాయన్నారు. నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ, అందునా పదవికోసమే పాకులాడే వారు రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 
రైతులకోసం తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రైతుకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు. ప్రజల బాగోగులు పట్టించుకోని ఇటువంటి పనికిమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకూ చూడనే లేదన్నారు.
రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు తిరుగుబాటు యాత్రలు జరుగుతాయన్నారు. రైతు సమస్యలపై గురువారం నుంచి రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
తెలంగాణా అంశంపై స్పందిస్తూ... తెలంగాణపై తమ అభిప్రాయాన్ని ఎప్పుడో చెప్పామన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కనుక సమావేశం ఏదైనా పార్టీ జెండాతోనే జరగాలని ఆయన పరోక్షంగా నాగం జనార్థన్ రెడ్డికి సూచించారు.

No comments:

Post a Comment