త్వరలో 2జీకి కొత్త ప్రతిపాదనలు
మరికొన్ని రోజుల్లో 2జీ మొబైల్ ఫోన్ స్పెక్ట్రమ్ ధరకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు చేయనున్నట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ప్రకటించింది. గత ఏడాది మేలో ఇచ్చిన ప్రతిపాదనలపై విమర్శలు రావడంతో తాజాగా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు ట్రాయ్ చైర్మన్ జేఎస్ శర్మ తెలిపారు. ఈ నెల చివర్లో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలను పంపనున్నట్టు ఆయన వెల్లడించారు.
35 శాతం పెరిగిన NIIT లాభం
బిఎఫ్ఎస్ఐ, ట్రావెల్స్ వర్టికల్స్ విభాగంలో వృద్ధిని సాధించటంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 35 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు NIIT టెక్నాలజీస్ వెల్లడించింది. గడచిన త్రైమాసిక కాలంలో 301 కోట్ల రూపాయల రాబడిపై 48 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం 35 కోట్ల రూపాయలుగా ఉంది.
******************************************************************************************************************************************************************************************************************************************************కంటెంట్‌కు దాటివెయ్యండి
| నా ఖాతా | సైన్ ఔట్
Blogger సహాయం
Blogger సహాయం
Share ముద్రించు
తరచుగా అడిగే ప్రశ్నలకు మా సమాధానాలు ఈ క్రింద ఉన్నాయి. మరింత సహాయం కంటెంట్‌ను ఈ క్రింది భాషలో మీరు పొందవచ్చు:
తరచుగా అడిగే ఫ్రశ్న
నేను బ్లాగర్ ఖాతాను ఎలా సృష్టించగలను?
నేను బ్లాగర్ బ్లాగును ఎలా సృష్టించగలను?
నేను నా బ్లాగుకు ఎలా పోస్ట్ చెయ్యగలను?
నేను చిత్రాలను ఎలా పోస్ట్ చెయ్యగలను?
నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను. ఏమి చెయ్యాలి?
నేను ఒక బ్లాగును ఎలా తొలగించగలను?
నేను నా ఖాతాను ఎలా రద్దు చెయ్యగలను?
ఒకరు కంటే ఎక్కువ మంది ఒక బ్లాగు పోస్ట్‌చెయ్యవచ్చా?
నేను నా ఫోటోను నా ప్రొఫైల్‌కు ఎలా జోడించాలి?
నా బాహ్య వెబ్ హోస్ట్‌కు FTP (లేదా sFTP) కనెక్షన్‌ను ఎలా సెట్ చెయ్యగలను?
నేను నా బ్లాగులో కస్టమ్ డొమైన్‌ను ఎలా ఉపయోగించగలను?
బ్లాగర్ మొబైల్ ఎలా పని చేస్తుంది?
నా పోస్ట్‌లను ఎలా లేబుల్ చెయ్యాలి?
నేను నా బ్లాగులో AdSenseను ఎలా ఉంచగలను?
నా బ్లాగు కోసం సైట్ ఫీడ్‌ని ఎలా ఎనేబుల్ చెయ్యగలను?
"ఫ్లాగ్"బటన్ అంటే ఏమిటి?
నేను నా బ్లాగులో వ్యాఖ్యలను ఎలా మోడరేట్ చెయ్యగలను?
నేను బ్లాగర్ లేఅవుట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించగలను?
నేను నా ఫారమ్‌ను పోస్ట్ చేసేటప్పుడు పద నిర్ధారణ ఎందుకు చెయ్యాలి?
నా బ్లాగు ఎందుకు డిసేబుల్ అయింది?
నేను పోస్ట్ చేసేటప్పుడు కీబోర్డు సత్వర మార్గాలను ఉపయోగించవచ్చా?
నేను లిప్యంతరీకరణ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
బ్లాగర్ యొక్క పోస్ట్ ఎడిటర్‌ను నేను ఎలా ఉపయోగించాలి?
నా బ్లాగు కోసం కస్టమ్ డొమైన్ పేరును ఎక్కడ కొనుగోలు చెయ్యగలను?
నా బ్లాగులో ప్రదర్శించబడిన తేదీల ఫార్మాట్‌ను ఎలా మార్చగలను?
పోస్ట్ టెంప్లేట్ అంటే ఏమిటి?
బ్యాక్‌లింక్‌లు అంటే ఏమిటి, వాటిని నేను ఎలా ఉపయోగించగలను?
పద నిర్ధారణ ఎంపిక అంటే ఏమిటి?
నా బ్లాగు లేఅవుట్ యొక్క HTMLను నేను సవరించవచ్చా?
నా బ్లాగు యొక్క శీర్షిక ఎక్కడ కనిపిస్తుంది?
URL అంటే ఏమిటి?
"జాబితా" సెట్టింగు ఏమి చేస్తుంది?
ఎన్‌కోడింగ్ సెట్టింగు ఏమి చేస్తుంది?
FTP సర్వర్ అంటే ఏమిటి?
FTP మార్గం అంటే ఏమిటి?
సూచికను మళ్ళీ ప్రచురించడం మరియు పూర్తి బ్లాగు మధ్య ఉన్న తేడా ఏమిటి?
చట్టపరమైన సమస్య గురించి నేను ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి?
1. నేను ఒక బ్లాగర్ ఖాతాను ఎలా సృష్టించగలను?
బ్లాగర్ హోమ్‌పేజీలో, "ఇప్పుడు మీ బ్లాగును సృష్టించండి" బటన్‌పై క్లిక్ చెయ్యండి. తరువాత పేజీలో మిమ్మల్ని ఒక Google ఖాతాను సృష్టించమని మీకు ప్రాంప్ట్ వస్తుంది. మీ Google ఖాతాను ఇతర Google సేవలలో మీరు ఉపయోగించవచ్చు. మీకు Gmail, Google గుంపులు లేదా orkutలో ఇప్పటికే Google ఖాతా ఉంటే, దయచేసి మొదట సైన్ ఇన్ అవ్వండి. మీరు సైన్ ఇన్ అయిన తర్వాత, ప్రదర్శిత పేరును ఎంటర్ చేసి, బ్లాగర్ యొక్క సేవా నిబంధనలను అంగీకరించాలి. ఒకసారి మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత, ఒక బ్లాగును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు ప్రాంప్ట్ వస్తుంది!
2. నేను ఒక బ్లాగర్ బ్లాగును ఎలా సృష్టించగలను?
మీరు బ్లాగర్ యొక్క హోస్టింగ్ సేవ అయిన Blog*Spotలో ఒక ఉచిత బ్లాగును సృష్టించే ముందు, blogger.comలో ఇప్పటికే ఒక ఖాతాను సృష్టించి ఉండాలి. ఒకసారి blogger.comకు లాగిన్ అయిన తర్వాత, "ఒక బ్లాగును సృష్టించు" లింక్‌పై క్లిక్ చెయ్యండి. 2వ దశలో, శీర్షిక మరియు చిరునామా (URL)ను ఎంటర్ చెయ్యండి. ఈ పేజీలో ప్రదర్శించబడిన నిర్ధారణ పదంలో కూడా మీరు టైప్ చెయ్యాలి. మీరు పూర్తి చేసిన తర్వాత, “కొనసాగు”పై క్లిక్ చెయ్యండి. 3వ దశలో, మీ బ్లాగు కోసం ఒక టెంప్లేట్‌ను ఎంచుకోవచ్చు; మీరు దాన్ని ప్రచురించినప్పుడు అది ఇలా కనిపిస్తుంది. తర్వాత, బ్లాగర్ మీ క్రొత్త బ్లాగును సృష్టించి, BlogSpotలో మీ స్థానాన్ని మీ కోసమ్ ఉంచుతుంది. మీరు మీ మొదటి పోస్ట్‌ను రూపొందించినప్పుడు, మీ పేజీ మీరు ఎంచుకున్న చిరునామాలో కనిపిస్తుంది.
3. నేను నా బ్లాగులోకి ఎలా పోస్ట్ చెయ్యగలను?
మీ డాష్‌బోర్డులో, మీరు పోస్ట్ చెయ్యాలకుంటున్న బ్లాగు ప్రక్కన ఉన్న “క్రొత్త పోస్ట్”పై క్లిక్ చెయ్యండి. తర్వాత, క్రొత్త పోస్ట్‌ను సృష్టించు పేజీని మీరు చూస్తారు. మీ పోస్ట్‌కు ఒక శీర్షికను ఇవ్వండి (ఇచ్చాపూరితం) మరియు పోస్ట్‌ను ఎంటర్ చెయ్యండి. మీరు పూర్తి చేసిన తర్వాత, అది సిద్ధంగా ఉందో లేదో నిర్ధారించడానికి “ప్రివ్యూ” లింక్‌పై చెయ్యండి. మీ పోస్ట్‌పై మీకు సంతృప్తి కలిగినప్పుడు, “ప్రచురించు” బటన్‌పై క్లిక్ చెయ్యండి. ఇది మీ క్రొత్త పోస్ట్‌ను ప్రచురిస్తుంది.
4. నేను చిత్రాలను ఎలా పోస్ట్ చెయ్యగలను?
మీరు పోస్ట్ ఎడిటర్ ఉపకరణపట్టీలోని చిత్రం చిహ్నాన్ని ఉపయోగించి ఫోటోలను అప్‌లోడ్ చెయ్యవచ్చు. మీరు ఈ చిహ్నంపై క్లిక్ చేసినప్పుడు, మీ కంప్యూటర్ నుండి ఒక చిత్రం లేదా అనేక చిత్రాలను ఎంచుకునేలా ఒక విండోను చూస్తారు. మీకు కావలసిన వాటిని గుర్తించడానికి “బ్రౌజ్” బటన్‌పై క్లిక్ చెయ్యండి. ప్రత్యామ్నాయంగా, మీ పోస్ట్‌కు ఇన్సర్ట్ చెయ్యడానికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న ఒక చిత్రం URLను మీరు ఎంటర్ చెయ్యవచ్చు. ఒక లేఅవుట్‌ను ఎంచుకోవడానికి మీరు లింక్‌పై క్లిక్ చేస్తే, మీ పోస్ట్‌లో మీ చిత్రాలు కనిపించే తీరును మీరు అనుకూలీకరించవచ్చు. చిత్రాల చుట్టూ మీ పోస్ట్ యొక్క టెక్స్ట్ వెళ్ళే విధానాన్ని ఎడమ, మధ్య మరియు కుడి ఎంపికలు వివరిస్తాయి. ఈ పరిమాణం ఎంపిక చిత్రాలను ఈ పోస్టింగ్ ప్రాంతంలో విభిన్న పరిమాణాల్లో స్కేల్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంది.
5. నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను. ఏమి చెయ్యాలి?
మీరు మీ Google ఖాతా సమాచారాన్ని మర్చిపోయినట్లయితే, బ్లాగర్ లాగిన్ పేజీలో "పాస్‌వర్డ్" ప్రక్కన ఉన్న "?"పై క్లిక్ చేసి, మీ Google ఖాతా సమాచారాన్ని పునరుద్ధరించవచ్చు లేదా Google ఖాతాల పాస్ట్‌వర్డ్ సహాయం పేజీని ఉపయోగించవచ్చు.
మీ Google ఖాతా యూజర్‌పేరు మీ ఖాతాను సృష్టించడానికి మీరు ఉపయోగించే పూర్తి ఇమెయిల్ చిరునామా (ఉదా. yourname@example.com) అని గుర్తుంచుకోండి.
మీ ఖాతాలోకి మీరు లాగిన్ అయినప్పటికీ మీ డాష్‌బోర్డులో సరైన బ్లాగు(లు)ను చూడలేకపోతే, మీరు తప్పుడు ఖాతాలోకి లాగిన్ అయి ఉంటారు. ఈ సందర్భంలో, అవసరమైతే, పాస్‌వర్డ్ సహాయం ఫారమ్‌ను ఉపయోగించి మీ మొత్తం ఇమెయిల్ చిరునామాలతో లాగిన్ అవ్వండి. మీకు ఒక ఖాతా మాత్రమే ఉందని ఇంకా అనుకుంటే, దయచేసి దీనితో ప్రయత్నించండి. ఇతరులు ఖాతా ఉపయోగాన్ని తెలుసుకోకుండానే అదనపు ఖాతాను సృష్టించడం మేము అనేక సందర్భాల్లో చూసాము, కనుక మీరు స్వంతంగా తనిఖీ చేస్తే, అది మీ బ్లాగును తిరిగి పొందడం కంటే శీఘ్రంగా ఉంటుంది.
6. నేను ఒక బ్లాగును ఎలా తొలగించగలను?
మీ పూర్తి బ్లాగును తొలగించడానికి, సెట్టింగులు | ప్రాథమిక టాబ్‌కు వెళ్ళండి. ఈ సమయంలో, మీరు మీ ఖాతా నుండి శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న సరైన బ్లాగులో ఉన్నారో లేరో ఖచ్చితంగా నిర్ధారించుకోండి. ఆపై “ఈ బ్లాగును తొలగించు”పై క్లిక్ చెయ్యండి. మీ బ్లాగు మీ సర్వర్‌లో ఉంటే, దాని ఫైళ్లు తొలగించబడవు. ఒక FTP క్లయింట్ ద్వారా మీ సర్వర్‌కు కనెక్ట్ చేసి, వాటిని మీరు మాన్యువల్‌గా తొలగించవచ్చు.
7. నేను నా ఖాతాను ఎలా రద్దు చెయ్యగలను?
మీ బ్లాగులతో సహా, మీ Google ఖాతాను తొలగించడానికి, దయచేసి Google ఖాతాలు హోమ్‌పేజీకి లాగిన్ అవ్వండి. ఒకసారి మీరు లాగిన్ అయిన తరువాత "నా సేవలు" జాబితా ప్రక్కన ఉన్న "సవరించు" లింక్‌పై క్లిక్ చెయ్యండి మీ ఖాతాను తొలగించడానికి అనుమతించే పేజీని చూస్తారు. ఒక ఖాతాను తొలగిస్తే, ఆ ఖాతాతో అనుబంధమైన మీ orkut ప్రొఫైల్, మీ iGoogle పేజీ మరియు మీ బ్లాగర్ బ్లాగులు వంటి అన్ని Google సేవలను తొలగింపబడతాయని దయచేసి గమనించండి.
8. ఒకరు కంటే ఎక్కువ మంది ఒక బ్లాగుకి పోస్ట్‌చెయ్యవచ్చా?
చెయ్యవచ్చు, వీటిని “బృంద బ్లాగులు” అంటారు. సాధారణంగా, ఒకరు బ్లాగును ప్రాథమికంగా సృష్టించి, దానిలోకి చేరమని ఇతరులను ఆహ్వానిస్తారు. బృంద సభ్యులు నిర్వాహకులుగా అయినా లేదా రెగ్యులర్ పోస్టర్‌లుగా అయినా ఉండవచ్చు. నిర్వాహకులు (వారికి స్వంతమైనవి కాక) అన్ని పోస్ట్‌లను సవరించవచ్చు, బృంద సభ్యులను జోడించవచ్చు మరియు తొలగించవచ్చు (మరియు నిర్వాహక ఆక్సెస్‌ను ఇవ్వవచ్చు) మరియు బ్లాగు సెట్టింగులను సవరించవచ్చు. నిర్వాహకులు కాని వారు బ్లాగుకు పోస్ట్ మాత్రమే చెయ్యగలరు.
ఒక బ్లాగుకు చేరమని ఇతరులను ఆహ్వానించడానికి, మొదట సెట్టింగులు | అనుమతులు టాబ్‌కు వెళ్ళి, “రచయితలను జోడించు”పై క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత, మీరు బ్లాగుకు ఆహ్వానిస్తున్న వ్యక్తుల ఇమెయిల్ చిరునామాలను టైప్ చెయ్యండి; వారు త్వరలోనే ఆహ్వానం ఇమెయిల్‌ను అందుకుంటారు. వారికి Google ఖాతాలు ఖచ్చితంగా ఉండాలి, ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే, ఒక ఖాతాను సృష్టించాలని వారికి ప్రాంప్ట్ వస్తుంది. ఆహ్వానాలను పంపించడానికి మీరు సిద్ధంగా ఉంటే, “ఆహ్వానించు”పై క్లిక్ చెయ్యండి. బ్లాగుకు ఒక క్రొత్త బృంద సభ్యుడు విజయవంతంగా చేరినప్పుడు, మీకు ఇమెయిల్ వస్తుంది.
9. నేను నా ఫోటోను నా ప్రొఫైల్‌కు ఎలా జోడించాలి?
ముందుగా, మీ డాష్‌బోర్డులో “ప్రొఫైల్‌ను సవరించు” లింక్‌పై క్లిక్ చెయ్యండి. అక్కడ నుండి, ప్రొఫైల్ చిత్రం URLను ఫారమ్‌లో ఎంటర్ చేసి, పేజీ దిగువలో ఉన్న "సేవ్ చెయ్యి"పై క్లిక్ చెయ్యండి. మీకు ఇప్పటికే హోస్ట్ చెయ్యబడ్డ ఫోటో ఎక్కడా లేకపోతే, మొదట ఒక చిత్రాన్ని మీ బ్లాగుకు మీరు పోస్ట్ చెయ్యవచ్చు. ఒకసారి మీరు దాన్ని పూర్తి చేస్తే, అది ఇప్పటికే అక్కడ లేకపోతే, పోస్ట్ ఎడిటర్‌ను HTMLను సవరించు మోడ్‌కు మార్చండి. ఇప్పడు ఫోటో యొక్క URLను కాపీ చేసి, మీ ప్రొఫైల్‌లోని "ఫోటో URL"కు ఈ URLను పేస్ట్ చెయ్యండి. ఆపై పేజీ దిగువన ఉన్న “సేవ్ చెయ్యి”పై క్లిక్ చేసి దానిని పూర్తి చెయ్యన్డి. చిత్రం 50k లేదా అంతకంటే చిన్న పరిమాణంలో ఉండాలని దయచేసి గమనించండి.
10. నా బాహ్య వెబ్ హోస్ట్‌కు FTP (లేదా sFTP) కనెక్షన్‌ను ఎలా సెట్ చెయ్యగలను?
సెట్టింగులు | ప్రచురణకు వెళ్ళి, కనెక్షన్ విధానాన్ని ఎంచుకోండి. ఆపై, మీ సెట్టింగులను ఎంటర్ చెయ్యండి. మీరు పూర్తి చేసిన తర్వాత, క్రింద ఉన్న "సెట్టింగులను సేవ్ చెయ్యి" బటన్ ద్వారా మీ సర్వర్ వివరాలను సేవ్ చేసి, మీ బ్లాగును మళ్ళీ ప్రచురించండి. ప్రత్యామ్నాయ పోర్ట్ పని చేయదని సూచిస్తూ, డిఫాల్ట్ పోర్ట్ నంబర్లు (FTP కోసం :21 మరియు SFTP కోసం :22); ఉపయోగించబడతాయని దయచేసి గమనించండి. అంతేకాక, సర్వర్ చిరునామా లేదా మార్గం సెట్టింగులో http:// లేదా ftp://ను చేర్చవద్దు.
11. నేను నా బ్లాగులో కస్టమ్ డొమైన్‌ను ఎలా ఉపయోగించగలను?
మీరు మీ బ్లాగు చిరునామాలో blogspot.comను ఉంచుకోవడం గురించి శ్రద్ధ లేకపోతే, మీ స్వంత డొమైన్‌ను పొందవచ్చు. మేము ఇంతకు ముందు లాగ మీ మొత్తం కంటెంట్‌ను హోస్ట్ చేస్తాము, కానీ అది మీ క్రొత్త చిరునామాలో ప్రదర్శించబడుతుంది. దీనిని సెట్ చెయ్యడానికి మూడు భాగాలు ఉన్నాయి:
మీ డొమైన్
ముందుగా మీరు mysite.com వంటి ఒక డొమైన్ పేరును ఎంచుకుని, దానిని రిజిస్టర్ చెయ్యాలి. మీరు అనేక సంఖ్యలో వేర్వేరు రిజిస్ట్రార్‌ల నుండి డొమైన్ పేర్లను రిజిస్టర్ చెయ్యవచ్చు.
DNS సెట్టింగులు
తర్వాత, ghs.google.comతో మీ డొమైన్ అనుబంధమైన DNSతో మీ డొమైన్ కోసం ఒక CNAME రికార్డ్‌ను మీరు సృష్టించాలి. దీన్ని చేసే సరైన విధానం మీ డొమైన్ రిజిస్ట్రార్‌ఆధారంగా విభిన్నంగా ఉంటుంది, కనుక దయచేసి మీ రిజిస్ట్రార్‌ను నేరుగా సంప్రదించండి వారు మీకు సహాయం చేస్తారు. క్రొత్త DNS రికార్ట్ వెంటనే ప్రభావితం కాదని దయచేసి తెలుసుకోండి.
బ్లాగర్ సెట్టింగులు
ఈ సమయంలో, ఇతరులు మీ బ్లాగును చూడాలనుకున్నప్పుడు వారిని Googleకు మళ్లించడం DNS సర్వర్లకు తెలుసు. కాబట్టి, మీ డొమైన్‌తో సరైన బ్లాగును Google అనుబంధించి ఉందో లేదో అని మేము నిర్ధారించుకోవాలి. మీరు దీన్ని బ్లాగర్‌లో మీ బ్లాగు కోసం సెట్టింగులు | ప్రచురణ టాబ్‌లో చేస్తారు. మీరు Blog*Spotలో ప్రచురిస్తుంటే, మిమ్మల్ని కస్టమ్ డొమైన్‌కు మారమని ప్రతిపాదిస్తూ పైన ఒక లింక్‌ను చూస్తారు. కొనసాగి, ఆ లింక్‌పై క్లిక్ చెయ్యండి. Blog*Spot చిరునామా సెట్టింగు ఇప్పుడు మీ డొమైన్‌కు మారుతుంది. ఈ ప్రాసెస్ ప్రారంభంలో మీరు రిజిస్టర్ చేసిన డొమైన్‌లో పూర్తి చేసి, మీ సెట్టింగులను సేవ్ చెయ్యండి.
గమనికలు:
మీ క్రొత్త డొమైన్ మిమ్మల్ని మీ బ్లాగుకు తీసుకెళ్లకపోతే, అన్ని DNS సర్వర్లు అప్‌డేట్ చెయ్యబడ్డాయా లేదా అని నిర్ధారించడానికి ఒకటి, రెండు రోజులు వేచి ఉండండి. అది ఇంకా పనిచేయకపోతే, మీరు DNS సెట్టింగులను సరిగ్గా ఎంటర్ చేసారో లేదో నిర్ధారించడానికి మీ రిజిస్ట్రార్‌ను సంప్రదించండి.
మీ అసలు Blog*Spot చిరునామా మీ క్రొత్త డొమైన్‌కు ఆటోమేటిక్‌గా ఫార్వార్డ్ చెయ్యబడుతుంది. ఆ విధంగా, మీ సైట్‌కు ఇప్పటికే ఉన్న ఏదైనా లింక్‌లు లేదా బుక్‌మార్క్‌లు ఇంకా పనిచేస్తాయి.
మీరు ఈ ఫీచర్‌ను డొమైన్‌లతో (ఉదా. mysite.com) లేదా సబ్‌డొమైన్‌లతో (ఉదా. name.mysite.com) ఉపయోగించవచ్చు. కానీ, మీరు సబ్‌డైరెక్టరీలను (ఉదా. mysite.com/blog/) లేదా వైల్డ్‌కార్డ్‌లను (ఉదా. *.mysite.com) పేర్కొనలేరు.
12. బ్లాగర్ మొబైల్ ఎలా పని చేస్తుంది?
ఒక మొబైల్ బ్లాగును ప్రారంభించడానికి, go@blogger.comకు (అది ఒక ఫోటో, కొంత టెక్స్ట్ లేదా రెండూ ఉన్న) ఒక సందేశాన్ని పంపించండి, మేము మీ కోసం ఒక బ్లాగును ప్రారంభిస్తాము! సందేశాన్ని పంపించిన తర్వాత, మీ మొబైల్ బ్లాగు URL మరియు టోకెన్‌తో ఒక ప్రతిస్పందనను అందుకుంటారు. దానితో మీ క్రొత్త బ్లాగును మీరు క్లెయిమ్ చెయ్యగలరు. మీ బ్లాగును క్లెయిమ్ చెయ్యడానికి, http://go.blogger.comలో టోకెన్‌ను ఎంటర్ చెయ్యండి. మీ మొబైల్ బ్లాగును క్లెయిమ్ చేస్తే, Blogger.com సెట్టింగులు మరియు ఫీచర్లకు పూర్తి ఆక్సెస్‌ను ఇస్తుంది, Google ఖాతాతో మీ బ్లాగును అనుబంధించడానికి అనుమతిస్తుంది మరియు మీ మొబైల్ బ్లాగును ఇప్పటికే ఉన్న బ్లాగుతో విలీనం చెయ్యనిస్తుంది.
13. నా పోస్ట్‌లకు ఎలా లేబుల్ చెయ్యగలను?
మీరు ఒక పోస్ట్‌ను వ్రాసేటప్పుడు, ఫారమ్ క్రింద "ఈ పోస్ట్‌కు లేబుళ్లు" అని గుర్తించబడి ఉన్న ఖాళీ స్థలం ఉంటుంది. మీకు కావలసిన లేబుళ్లను , కామాతో వేరుచేయబడిన వాటిని, ఎంటర్ చెయ్యండి. మీరు ఇప్పటికే ఉపయోగించిన లేబుళ్ల జాబితాను ప్రదర్శించడానికి “అన్నీ చూపించు” లింక్‌పై కూడా క్లిక్ చెయ్యవచ్చు. వాటిని జోడించడానికి లేబుళ్లుపై క్లిక్ చెయ్యండి. మీరు మీ పోస్ట్‌ను ప్రచురించినప్పుడు, దానితో లేబుళ్లు జాబితా చెయ్యబడతాయి. ఏదైనా లేబుల్ పై క్లిక్ చేస్తే, ఆ లేబుల్‌పేరుతో ఉన్న పోస్ట్‌ల పేజీకి మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్షర క్రమంలో క్రమబద్ధీకరించబడిన లేదా తరచుగా ఉపయోగించబడే మీ మొత్తం లేబుళ్ల జాబితాను కూడా మీ బ్లాగు యొక్క సైడ్‌బార్‌లో మీరు జోడించవచ్చు.
14. నేను నా బ్లాగులో AdSenseను ఎలా ఉంచగలను?
మీ బ్లాగులో AdSenseను ఉంచడానికి, మీ బ్లాగుకు టెంప్లేట్ లేదా లేఅవుట్‌లు టాబ్‌పై క్లిక్ చెయ్యండి. లేఅవుట్‌లు-ఎనేబుల్ అయిన బ్లాగులో, ఒక క్రొత్త పేజీ ఎలిమెంట్‌ను జోడించి, AdSense ఎంపికను ఎంచుకోండి. మీరు క్లాసిక్ టెంప్లేట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, టెంప్లేట్ టాబ్‌లో "AdSense" లింక్‌ను ఎంచుకోండి. మీ ప్రకటనలకు ఒక పరిమాణాన్ని ఎంచుకుని, మీ బ్లాగులో అవి కనిపించే తీరును అనుకూలీకరించవచ్చు.
15. నా బ్లాగు కోసం సైట్ ఫీడ్‌ను ఎలా ఎనేబుల్ చెయ్యగలను?
మొదట, సెట్టింగులు | సైట్ ఫీడ్ టాబ్‌కు వెళ్ళండి. ఇక్కడ, మీరు ఎంత కంటెంట్‌ను సిండికేట్ చెయ్యాలనుకుంటున్నారో ఎంచుకునే ఒక సాధారణ ఎంపిక ఉంది. "మొత్తం" అనే ఎంపిక మీ సైట్ ఫీడ్ యొక్క పూర్తి కంటెంట్‌ను ఉంచితే "తక్కువ" అనే ఎంపిక ప్రతి పోస్ట్ ప్రారంభం నుండి సంగ్రహిస్తుంది. "ఏదీకాదు" ఎంపిక మీ సైట్ ఫీడ్‌ను పూర్తిగా ఆఫ్ చేస్తుంది.
16. "ఫ్లాగ్"బటన్ అంటే ఏమిటి?
ఈ ఫీచర్ "అభ్యంతరకరమైనదిగా ఫ్లాగ్ చెయ్యి" అని అనబడుతుంది మరియు ఇది బ్లాగర్ Navbar ద్వారా ఆక్సెస్ చెయ్యబడుతుంది. ప్రశ్నించదగిన కంటెంట్‌ను సులువుగా గమనించడానికి బ్లాగింగ్ కమ్యూనిటీని "ఫ్లాగ్ చెయ్యాలా?" బటన్ అనుమతిస్తుంది, అది అవసరమైనప్పుడు మేము చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి ఒక బ్లాగును సందర్శించి బ్లాగర్ Navbarలోని "ఫ్లాగ్ చెయ్యాలా?" బటన్‌పై క్లిక్ చేసినప్పుడు, అతను బ్లాగు యొక్క కంటెంట్ హానికరమైన శిక్షార్హమైనదిని లేదా చట్టవిరుద్ధమైనదని నమ్ముతారని అర్థం. ఒక బ్లాగు ఎన్నిసార్లు అభ్యంతకరమైనదిగా ఫ్లాగ్ చెయ్యబడినదని మేము ట్రాక్ చేసి, ఏ చర్య అవసరమని వివరించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము. యూజర్లు వారి ఫ్లాగ్‌ను రెండవసారి వెనక్కు తీసుకోవడానికి ఈ బటన్‌పై క్లిక్ చేస్తారని గమనించండి.
17. నేను నా బ్లాగులో వ్యాఖ్యలను ఎలా మోడరేట్ చెయ్యగలను?
మీరు వ్యాఖ్య మోడరేషన్ సెట్టింగును సెట్టింగులు | వ్యాఖ్యలు టాబ్‌లో పొందవచ్చు. ఇది కేవలం అవును/కాదు ఎంపిక మాత్రమే. మీరు ఈ ఎంపికకు “అవును” ఎంచుకుంటే మీ ఇమెయిల్ చిరునామాను ఎంటర్ చెయ్యడానికి స్పేస్‌ను ఇస్తుంది. ఇది మీ రెగ్యులర్ వ్యాఖ్య ప్రకటన సెట్టింగును ప్రభావితం చెయ్యకుండా వ్యాఖ్యలను ఇమెయిల్ ద్వారా మోడరేట్ చెయ్యనిస్తుంది. మీరు బ్లాగర్ ఇంటర్‌ఫేస్ ద్వారా వ్యాఖ్యలను ఎల్లప్పుడూ మోడరేట్ చెయ్యవచ్చు కనుక ఇది ఇచ్చాపూరితం. కాబట్టి ఎంపికను “అవును”కు సెట్ చెయ్యండి, మీరు కావాలనుకుంటే ఒక ప్రకటన చిరునామాను ఎంటర్ చేసి, సెట్టింగులను సేవ్ చేసి, మీ తదుపరి వ్యాఖ్య కోసం వేచి ఉండండి.
పోస్టింగ్ టాబ్ క్రింద ఉన్న వచ్చి చేరే మొత్తం వ్యాఖ్యలు ఇప్పుడు ఒక ప్రత్యేక "వ్యాఖ్యలను మోడరేట్ చెయ్యి"కు వెళుతాయి. ఈ పేజీలో, సృష్టించబడిన మొత్తం వ్యాఖ్యల జాబితాను మీరు చూస్తారు అయితే ఇంకా అంగీకరించని లేదా నిరాకరించని వ్యాఖ్యలను చూడలేరు. (బ్లాగు యొక్క నిర్వాహక సభ్యులు రూపొందించిన ఏదైనా వ్యాఖ్యలను ఈ జాబితా మినహాయిస్తుంది.) జాబితాలోని ప్రతి పంక్తి వ్యాఖ్య యొక్క ప్రారంభ విషయం, రచయిత పేరు, మరియు అది సృష్టించబడిన సమయాన్ని ప్రదర్శిస్తుంది. త్రికోణాన్ని ఎడమ వైపుకు క్లిక్ చేస్తే, వ్యాఖ్య యొక్క పూర్తి టెక్స్ట్‌ను చూపించడానికి వరుస విస్తరణ చెందుతుంది, "ప్రచురించు" మరియు "నిరాకరించు" లింక్‌లతో పాటు, వ్యాఖ్యను అంగీకరించడానికి లేదా నిరాకరించడానికి దాన్ని మీరు ఉపయోగిస్తారు.
ఈ పూర్తి ప్రాసెస్‌ను ఇమెయిల్ ద్వారా కూడా చెయ్యవచ్చు. మీరు మోడరేషన్ కోసం ఒక ఇమెయిల్ చిరునామాను ఎంటర్ చేస్తే, ప్రతి వ్యాఖ్యకు "ప్రచురించు" మరియు "నిరాకరించు" లింక్‌లతో ఒక సందేశాన్ని అందుకుంటారు దానితో పాటు బ్లాగు కోసం ప్రధాన మోడరేషన్ పేజీకి ఒక లింక్‌ను అందుకుంటారు.
18. నేను బ్లాగర్ లేఅవుట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించగలను?
మొదట మీ డాష్‌బోర్డులో మీ బ్లాగు పేరును కనుగొని, దానికి ప్రక్కన ఉన్న "టెంప్లేట్" లింక్‌పై క్లిక్ చెయ్యండి. బదులుగా ఈ లింక్ "లేఅవుట్"ను చూపిస్తే, మీరు ఇప్పటికే లేఅవుట్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు మరియు ఈ మొదటి దశలను మీరు దాటవేయవచ్చు. టెంప్లేట్ పేజీలో, “మీ డిజైన్‌ను అనుకూలపరచండి” అనే టాబ్ కోసం నావిగేషన్ లింక్‌లను చూసి, వాటిపై క్లిక్ చెయ్యండి. మీ ప్రస్తుత టెంప్లేట్ యొక్క బ్యాకప్‌ను బ్లాగర్ రూపొందిస్తుందని వివరిస్తూ ఒక సందేశాన్ని మీరు అందుకుంటారు. (తర్వాత మీరు దానికి అనిర్దిష్టంగా మళ్ళీ తిరిగి రావాలనుకుంటే అందుబాటులో ఉండేలా బ్యాకప్ చేస్తుంది.) కొనసాగడానికి “మీ టెంప్లేట్‌ను అప్‌గ్రేడ్ చెయ్యండి” బటన్‌పై క్లిక్ చెయ్యండి. ఆపై, మా డిఫాల్ట్ టెంప్లేట్ డిజైన్‌లో ఒకదాన్ని ఎంచుకుని, “టెంప్లేట్‌ను సేవ్ చెయ్యి”పై క్లిక్ చెయ్యండి ఇప్పుడు మీరు అన్నిటినీ సెట్ చేసారు.
ఒకసారి మీ టెంప్లేట్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత, మీరు ప్రదర్శించాలనుకుంటున్న రీతిలో మీ టెంప్లేట్‌లోని ఎలిమెంట్‌ల క్రమాన్ని మీరు మార్చవచ్చు. మీరు తరలించాలనుకుంటున్న ఎలిమెంట్‌పై క్లిక్ చెయ్యండి మరియు ఎలిమెంట్‌ను ఉంచాలనుకుంటున్న స్థానానికి దాన్ని డ్రాగ్ చేసి, డ్రాప్ చెయ్యండి. (గమనిక: అనేక టెంప్లేట్‌లలో మీ Navbar, బ్లాగు పోస్ట్‌లు మరియు హెడర్ మినహా అన్ని ఎలిమెంట్‌లను మీరు తరలించవచ్చు.) మీరు "ఒక పేజీ ఎలిమెంట్‌ను జోడించు"పై క్లిక్ చేసి, మీ బ్లాగు పేజీ లేదా సైడ్‌బార్‌కు అనేక పేజీ ఎలిమెంట్‌లను జోడించవచ్చు. ఇది ఒక పాప్-అప్ విండోను తెరుస్తుంది, అందులో మీకు కావలసిన ఎలిమెంట్ విభాగంలో "బ్లాగుకు జోడించు"పై క్లిక్ చేసి మీ బ్లాగుకు ఎలిమెంట్‌లను మీరు జోడించవచ్చు.
19. నేను నా ఫారమ్‌ను పోస్ట్ చేసేటప్పుడు పద నిర్ధారణ ఎందుకు చెయ్యాలి?
పోస్టింగ్ ఫారమ్‌లో పద నిర్ధారణ అంటే సాధారణంగా BlogSpot కోసం స్పామ్ తగ్గింపు విధానం అని అర్థం. ఇక్కడ రెండు హానికరమైన కారణాలు ఉన్నాయి:
హానికరమైన స్పామ్
ఈ సందర్భంలో, కొన్ని ప్రత్యేక హానికరమైన స్పామ్ బ్లాగులకు ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా పద నిర్ధారణ వర్తింప చేయబడుతుంది. ఇది ఆటోమేటెడ్ అయినందున మరియు కొన్ని తప్పుడు విషయాలు తప్పనిసరిగా ఉన్నందున, వీటిని నివారించడానికి మా అల్గోరిథమ్‌లను మెరుగుపరచడానికి మేము నిరంతరంగా కృషి చేస్తున్నాము. మీ పోస్టింగ్ ఫారమ్‌లో పద నిర్ధారణ ఉన్నప్పటికీ మీరు ప్రచురించడాన్ని నిరోధించదు మరియు అది మా విధానాలను అసలు ఉల్లంఘించనట్లయితే, మీ బ్లాగు తొలగింపబడుతుందని లేకపోతే శిక్షించబడుతుందని అర్థం కాదు. ప్రచురించేటప్పుడు అదనపు అసౌకర్యాలను నిరోధించడానికి, మీ పోస్టింగ్ ఫారమ్‌లో పద నిర్ధారణకు ప్రక్కన ఉన్న (ప్రశ్న గుర్తు) "?" చిహ్నంపై క్లిక్ చెయ్యండి. అది మీరు మీ బ్లాగును సమీక్షించడానికి అభ్యర్థించే పేజీకి తీసుకెళుతుంది. మేము దానిని పరిశీలించి, అది స్పామ్ కాదని తనిఖీ చేసి, మీ బ్లాగును ఆమోదిస్తాము తద్వారా ఇకపై దానికి పద నిర్ధారణ అవసరం ఉండదు.
అధిక పోస్టింగ్ రేట్
మీరు ఒక రోజులో అధిక సంఖ్యలో పోస్ట్‌లను రూపొందిస్తే, మీ బ్లాగు హానికరమైన స్పామ్ కాదని క్లియర్ చేసినా, చెయ్యకపోయినా మీరు ప్రతీదానికి పద నిర్ధారణను పూర్తి చెయ్యాలి. ఇది మీకు జరిగితే, ప్రతి పోస్ట్‌కు పద నిర్ధారణను పూర్తి చెయ్యండి లేదా అది ఆటోమేటిక్‌గా తొలగించబడే పాయింట్ వద్ద 24 గంటలు వేచి ఉంచండి. స్పష్టమైన స్పామ్‌ను నిరోధించి, మా సర్వర్లపై లోడ్‌ను నియంత్రించడానికి ఈ పరిమితి ఉంది. కాబట్టి, వ్యక్తిగత బ్లాగుల మినహాయింపు కోసం ఆమోదించే సమీక్ష ప్రాసెస్ లేదు.
20. నా బ్లాగు ఎందుకు డిసేబుల్ అయింది?
డిసేబుల్ చెయ్యడం అనేది బ్లాగును స్పామ్‌గా గుర్తించే మా ఆటోమేటెడ్ వర్గీకరణ సిస్టమ్ యొక్క ఫలితం. మీ బ్లాగు స్పామ్ బ్లాగు కాకపోతే, అది మా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా తప్పుగా వర్గీకరించబడింది కనుక దానికి మేము చింతిస్తున్నాము. మీ బ్లాగు డిసేబుల్ చెయ్యబడితే, అది మీ డాష్‌బోర్డులో జాబితా చెయ్యబడుతుంది, కానీ మీరు దాన్ని ఆక్సెస్ చెయ్యడానికి దానిపై క్లిక్ చెయ్యలేరు. ఇది కారణమైతే, దాని సమీక్ష మరియు పునరుద్ధరణకు మీరు అభ్యర్థించడానికి గడువు సమయం ఉంటుంది.
21. నేను పోస్ట్ చేసేటప్పుడు కీబోర్డు సత్వర మార్గాలను ఉపయోగించవచ్చా?
బ్లాగర్‌లో పోస్ట్‌లను సవరించేటప్పుడు ఉపయోగించడానికి అనేక కీబోర్డు సత్వరమార్గాలు ఉన్నాయి. అవి Internet Explorer 5.5+/Windows మరియు Mozilla కుటుంబం (1.6+ మరియు Firefox 0.9+)లో ఖచ్చితంగా పనిచేస్తాయి మరియు ఇతర బ్రౌజర్లలో కూడా పనిచేస్తాయి. అవి ఈ క్రింద ఉన్నాయి:
control + b = లావు
control + i = ఇటాలిక్
control + l = బ్లాక్‌కోట్ (HTML-మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే)
control + z = అన్డు
control + y = రీడు
control + shift + a = లింక్
control + shift + p = ప్రివ్యూ
control + d = డ్రాఫ్ట్ లాగ సేవ్ చెయ్యి
control + s = పోస్ట్‌ను ప్రచురించు
control + g = హిందీ లిప్యంతరీకరణం
22. నేను లిప్యంతరీకరణ ఫీచర్‌ను ఎలా ఉపయోగించగలను?
రోమన్ అక్షరాలని హిందీలో ఉపయోగించే దేవనాగరి అక్షరాలుగా మార్చడానికి ఒక ఆటోమేటిక్ లిప్యంతరీకరణ ఎంపికను బ్లాగర్ అందిస్తుంది. హిందీ పదాలను ఇంగ్లీష్ లిపిలో ఫొనెటిక్‌గా టైప్ చెయ్యడానికి మరియు అవి వాటి సరైన అక్షరక్రమంలో కనిపించడానికి ఇది అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చెయ్యడానికి సెట్టింగులు | ప్రాథమిక పేజీకి వెళ్ళి, లిప్యంతరీకరణ ఎంపిక కోసం "అవును" ఎంచుకోండి. ఈ సెట్టింగు కంపోజ్ మోడ్ సెట్టింగుకు సమానమైన మీ ఖాతాలోని అన్ని బ్లాగులను ప్రభావితం చేస్తుంది.
23. బ్లాగర్ యొక్క పోస్ట్ ఎడిటర్‌ను నేను ఎలా ఉపయోగించాలి?
బ్లాగర్ యొక్క పోస్ట్ ఎడిటర్‌లో మూడు మోడ్‌లు ఉన్నాయి:
కంపోజ్: మీరు ఫార్మాటింగ్ బటన్‌లతో టెక్స్ట్‌ను సమకూర్చే ఒక WYSIWYG మోడ్.
HTMLను సవరించు: మీరు htmlను మాన్యువల్‌గా సవరించే ప్రత్యేక మోడ్.
ప్రివ్యూ: పోస్ట్ శీర్షిక, లింక్‌లు మరియు చిత్రాలతో సహా పోస్ట్ యొక్క పూర్తి ప్రివ్యూను చూపుతుంది.
ఈ మోడ్‌ల మధ్య మారడానికి, సరైన లింక్‌పై క్లిక్ చెయ్యండి. ఫార్మాటింగ్ బటన్‌లు ప్రత్యేక బ్రౌజర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఫీచర్లు, ఎడమ నుండి కుడి:
ఫాంట్
ఫాంట్ పరిమాణం
లావు
ఇటాలిక్
ఫాంట్ రంగు
లింక్
ఎడమకు-జస్టిఫై
మధ్య
కుడికి-జస్టిఫై
పూర్తిగా-జస్టిఫై
క్రమ (అంకెలున్న) జాబితా
క్రమం లేని (బులెట్ ఉన్న) జాబితా
బ్లాక్‌కోట్
అక్షర క్రమ తనిఖీ
చిత్రాన్ని అప్‌లోడ్ చెయ్యి
ఎంపిక నుండి ఫార్మాటింగ్‌ను తొలగించు
24. నా బ్లాగు కోసం కస్టమ్ డొమైన్ పేరును ఎక్కడ కొనుగోలు చెయ్యగలను?
మీరు డొమైన్ పేర్లను కొనుగోలు చెయ్యడానికి అనేక కంపెనీలు ఉన్నాయి. అవి సాధారణంగా సంవత్సరంవారీగా న్యాయమైన ధరల్లో ఉంటాయి. డొమైన్ రిజిస్ట్రార్ కోసం Googleలో శోధిస్తే, అది అనేక ఎంపికలను చూపుతుంది. మీరు ఈ జాబితాను ఉపయోగించి కూడా షాపింగ్ చెయ్యవచ్చు:
GoDaddy.com
ix web hosting
1and1
EveryDNS.net
Yahoo! Small Business
No-IP
DNS Park
25. నా బ్లాగులో ప్రదర్శించబడిన తేదీల ఫార్మాట్‌ను ఎలా మార్చగలను?
మీ బ్లాగు సెట్టింగులను సవరించి, పోస్ట్‌లు మరియు ఆర్కైవ్ లింక్‌లు రెండింటికీ తేదీ ఫార్మాట్‌ను మీరు మార్చవచ్చు. సెట్టింగులు | ఫార్మాటింగ్ పేజీలో, "తేదీ హెడర్ ఫార్మాట్" మరియు "ఆర్కైవ్ సూచిక తేదీ ఫార్మాట్" కోసం ఫీల్డ్‌లు ఉన్నాయి. రెండు ఫీల్డ్‌లలో తేదీలను ప్రదర్శించడానికి ఫార్మాట్ ఎంపికలను జాబితా చేసే డ్రాప్-డౌన్ మెన్యులు ఉంటాయి. (తేదీ హెడర్‌లు సాధారణంగా మీ పోస్ట్‌ల ఎగువ ఉంటాయి మరియు ఆర్కైవ్ సూచిక సాధారణంగా మీ సైడ్‌బార్‌లో ఆర్కైవ్ లింక్‌ల జాబితా.) మీరు పూర్తి చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న “సెట్టింగులను సేవ్ చెయ్యి”పై క్లిక్ చెయ్యండి.
26. పోస్ట్ టెంప్లేట్ అంటే ఏమిటి?
పోస్ట్ ఎడిటర్‌ను ముందుగా ఫార్మాటింగ్ చేస్తే, యూజర్లు సమయాన్ని ఆదా చెయ్యడానికి పోస్ట్ టెంప్లేట్‌లు సహాయపడతాయి. కొంత మంది యూజర్లు వారి పోస్ట్‌లను ప్రత్యేక విధానంలో ఫార్మాట్ చెయ్యాలని ఇష్టపడతారు. ఉదాహరణకు, కొంతమంది మొదటి పంక్తిలో ఒక కథనానికి లింక్ చేసి, ఆపై కోట్ చెయ్యాలని అనుకుంటారు. ఈ సందర్భంలో, మొత్తం పోస్ట్ టెంప్లేట్‌లో లింక్ మరియు బ్లాక్‌కోట్ టాగ్‌లు ఎంటర్ చెయ్యబడతాయి మరియు అవి పూర్తి చెయ్యడానికి సిద్ధంగా ఉండి, ప్రతి క్రొత్త పోస్ట్‌లో కనిపిస్తాయి.
27. బ్యాక్‌లింక్‌లు అంటే ఏమిటి, వాటిని నేను ఎలా ఉపయోగించగలను?
మీ పోస్ట్‌లకు లింక్ చేసే ఇతర వెబ్‌పేజీలను మీరు ట్రాక్ చెయ్యడానికి బ్యాక్‌లింక్‌లు మీకు తోడ్పడతాయి. మీ స్నేహితుడు మీ పోస్ట్‌లలో ఒకదానికి లింక్ చేస్తే, ఉదాహరణకు, వేరొకరు దానికి లింక్ చేసి ఉంటే పోస్ట్ ఆటోమేటిక్‌గా చూపబడుతుంది మరియు మీ స్నేహితుడి టెక్స్ట్ యొక్క చిన్న స్నిప్పెట్‌ను అందిస్తుంది మరియు మీ స్నేహితుడి పోస్ట్‌కు ఒక లింక్‌ను అందిస్తుంది. బ్యాక్‌లింక్ సెట్టింగును సెట్టింగులు | వ్యాఖ్యలు టాబ్ క్రింద పొందవచ్చు మరియు దాన్ని ఆన్ మరియు ఆఫ్ చెయ్యడానికి ఒక ఏకైక, సాధారణ ఎంపిక ఉంటుంది. ఇది ఎనేబుల్ చెయ్యబడితే, ప్రతి పోస్ట్ కోసం వ్యాఖ్య లింక్ ప్రక్కన ఉన్న “ఈ పోస్ట్‌కు లింక్‌లు” అని గుర్తించబడిన ఒక లింక్‌ను మీరు చూస్తారు.
28. పద నిర్ధారణ ఎంపిక అంటే ఏమిటి?
మీ బ్లాగు కోసం "పద నిర్ధారణ" ఎంపికను సెట్టింగులు | వ్యాఖ్యలు టాబ్‌పై పొందవచ్చు. మీరు ఈ సెట్టింగుకు "అవును" ఎంచుకుంటే, అప్పుడు మీ బ్లాగుపై వ్యాఖ్యానించే వారు మీరు బ్లాగును సృష్టించేటప్పుడు ప్రదర్శించబడిన ఒక పద నిర్ధారణ దశను పూర్తి చెయ్యాలి. ఈ దశలో విజయవంతంగా పూర్తి చెయ్యడానికి మరియు పదాన్ని చదవడానికి ఒక మనిషి అవసరం కనుక ఇది మీ బ్లాగుకు ఆటోమేటెడ్ సిస్టమ్‌లు వ్యాఖ్యలను జోడించకుండా నిరోధించడానికి ఏమి చేస్తుంది. మీరు ఒక ప్రకటన లేదా సంబంధం లేని సైట్‌కు ఒక రాండమ్ లింక్ వంటి ఒక వ్యాఖ్యను అందుకున్నట్లయితే, అప్పుడు మీరు ఒక వ్యాఖ్య స్పామ్‌ను అందుకున్నారు. పద నిర్ధారణను పూర్తి చెయ్యలేని సాఫ్ట్‌వేర్ ఇటువంటి వాటిని ఆటోమేటిక్‌గా పూర్తి చేస్తాయి. కనుక ఇటువంటి పలు అవసరంలేని వ్యాఖ్యలను నిరోధించడానికి ఈ ఎంపికను ఎనేబుల్ చెయ్యడం ఉత్తమ పద్ధతి.
29. నా బ్లాగు లేఅవుట్ యొక్క HTMLను నేను సవరించవచ్చా?
ఖచ్చితంగా, టెంప్లేట్ | HTMLను సవరించు టాబ్‌కు వెళ్ళండి. మీ టెంప్లేట్ యొక్క ఒక కాపీని మీ హార్డ్ డ్రైవ్‌లోని ఒక టెక్స్ట్ ఫైల్‌కు డౌన్‌లోడ్ చెయ్యడమే ఈ పేజీలో మొదటి పని. మీరు మళ్ళీ ఇదే ఫైల్‌ను సులభంగా తిరిగి అప్‌లోడ్ చెయ్యవచ్చు కనుక మీరు ఈ విధంగా చెయ్యాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. తర్వాత మీ టెంప్లేట్ కోసం అసలైన కోడ్. ఇది సాధారణ HTML మరియు CSS లాగ ఉండటం మీరు గమనించవచ్చు, కాని ఇది మా డ్రాగ్-మరియు-డ్రాప్ లేఅవుట్ ఎడిటర్ మరియు ఫాంట్ మరియు కలర్ పిక్కర్‌తో అనుకూలంగా ఉండటానికి అనేక కస్టమ్ టాగ్‌లను కూడా కలిగి ఉంది.
30. నా బ్లాగు యొక్క శీర్షిక ఎక్కడ కనిపిస్తుంది?
బ్లాగర్‌లో సెట్టింగు | ప్రాథమిక టాబ్‌లో సెట్ చేసిన మీ బ్లాగు శీర్షిక అనేక స్థానాల్లో కనిపిస్తుంది: ప్రచురించబడిన మీ బ్లాగు, మీ డాష్‌బోర్డుపై, మీ ప్రొఫైల్‌లో మరియు మీ డాష్‌బోర్డుపైన "ఇటీవల అప్‌డేట్ అయినవి" జాబితాలో కనిపిస్తుంది (మీ బ్లాగు జాబితా చేయబడినట్లయితే). కనుక ఇది సృజనాత్మకంగా ఉండేటట్లు చెయ్యండి!
31. URL అంటే ఏమిటి?
URL అనేది వెబ్‌లో ఒక ఫైల్ యొక్క స్థలం. URLల కొన్ని ఉదాహరణలు http://www.blogger.com/ లేదా http://myblog.blogspot.com/. మీరు మరియు మీ సందర్శకులు మీ బ్లాగును ఆక్సెస్ చెయ్యడానికి మీరు ఎంచుకున్న URLను ఉపయోగిస్తారు.
బ్లాగును సృష్టించే ప్రాసెస్‌లో మీరు దీన్ని Blog*Spotపై హోస్ట్ చెయ్యాలనుకుంటే మీ బ్లాగుకు ఒక URLను ఎంచుకోవలని మీరు అడగబడతారు. ఇప్పటికే అత్యథిక సంఖ్యలో Blog*Spot బ్లాగులు ఉన్న కారణంగా, మీరు అందుబాటులో ఉన్నదాన్ని కనుగొనే ముందుగా మీ సృజనాత్మకతతో కొన్ని వేర్వేరు వాటిని ప్రయత్నించవలసి ఉంటుంది. మీరు మీ బ్లాగు URLను ఎంపిక చేసేటప్పుడు హైపన్‌లను (డాష్‌లగా కూడా పిలుస్తారు, -) ఆల్ఫాన్యూమరిక్ కాని అక్షరాలకు మాత్రమే అనుమతి ఉందని గమనించండి. స్పేస్‌లు, అండర్‌స్కోర్‌లు(_) లేదా ఏదైనా ఇతర ప్రత్యేక అక్షరాలు అనుమతించబడవు.
32. "జాబితా" సెట్టింగు ఏమి చేస్తుంది?
"మీ బ్లాగును మా జాబితాలకు జోడించాలా?" సెట్టింగు మీ బ్లాగు blogger.comపై కనిపించాలో లేదో నిర్ణయిస్తుంది — ప్రత్యేకంగా, మీ ప్రొఫైల్ పేజీపై బ్లాగు జాబితా కోసం మరియు బ్లాగర్ హోమ్‌పేజీపై కనిపించే ఇటీవల అప్‌డేట్ అయిన బ్లాగులు కోసం. మీరు ఈ సెట్టింగును సెట్టింగులు | ప్రాథమిక పేజీలో పొందవచ్చు. గమనిక: మీ బ్లాగు టెంప్లేట్ బ్లాగుమెటాడేటా టాగ్‌ను ఉపయోగిస్తుంటే, దీనిని ఆఫ్ చెయ్యడం అనేది శోధన ఇంజిన్‌లు మీ బ్లాగును పరిశోధించవని కూడా అర్థం.
33. ఎన్‌కోడింగ్ సెట్టింగు ఏమి చేస్తుంది?
ఎన్‌కోడింగ్ సెట్టింగు మీ బ్లాగును ఎలా ప్రదర్శించాలో వెబ్ బ్రౌజర్‌కు తెలియచేస్తుంది. ఇది ఇంగ్లీష్-భాష బ్లాగులకు అంత ముఖ్యమైనది కాదు, కాని ఇంగ్లీష్ కాని-భాషల బ్లాగులకు సరిగ్గా ప్రదర్శించడానకి ఇది ముఖ్యమైనది. అన్ని భాషలకు మద్దతు ఇచ్చే UTF-8 డిఫాల్ట్‌గా ఎంపిక అవుతుంది. కాని కొన్ని సందర్భాల్లో, మీరు మరొక ఎన్‌కోడింగ్‌ను ప్రయత్నించవలసి ఉంటుంది. మరియు మీకు అవసరమైన ఎన్‌కోడింగ్ జాబితా కాకపోతే, మాకు తెలియజేయండి మేము దాన్ని త్వరలోనే జోడిస్తాము.
34. FTP సర్వర్ అంటే ఏమిటి?
FTP సర్వర్ అనేది యూజర్ల నుండి అప్‌లోడ్ అయిన ఫైళ్లను అంగీకరించడానికి FTPను ఉపయోగించే ఒక కంప్యూటర్. మీ FTP సర్వర్ చిరునామా సాధారణంగా ఇలా ఉంటుంది: ftp.example.com
మీరు హోస్టింగ్ సర్వీసును కొనుగోలు చేసినప్పుడు, మీరు ఉపయోగించడానికి FTP సర్వర్ చిరునామాను అందుకుంటారు. మీకు ఈ సమాచారం లేకుంటే లేదా దీన్ని గురించి అనుమానం ఉంటే, దయచేసి మీ హోస్టింగ్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
గమనికలు:
డిఫాల్ట్ పోర్ట్ సంఖ్యలు ఉపయోగించబడతాయి (FTP కోసం :21 మరియు SFTP కోసం :22). ఒక ప్రత్యామ్నాయ పోర్ట్‌ను పేర్కొనడం పని చెయ్యదు.
సర్వర్ చిరునామాలో http:// లేదా ftp://ను ఉంచవద్దు.
35. FTP మార్గం అంటే ఏమిటి?
మీ బ్లాగులను మీ సర్వర్‌లో ఎక్కడ ఉంచాలని FTP మార్గం బ్లాగర్‌కు తెలియజేస్తుంది. ఇది క్రింది ఫార్మాట్‌లో ఉండాలి:
directory/directory/ (చివరిలో ఉండే స్లాష్‌ను ఖచ్ఛితంగా ఉంచండి)
మీకు FTP గురించి తెలిసి ఉంటే, మీ మార్గమే మీ వెబ్‌ను ఆక్సెస్ చెయ్యగల డైరెక్టరీ. ఉదాహరణకు, ఇది 'htdocs' లేదా 'www' లేదా 'public_html,' లేదా మీరు మీ బ్లాగును సబ్‌డైరెక్టరీలో ఉంచదలిస్తే, 'htdocs/blog/' మొదలైనవి.
మీకు ఇవన్నీ కాస్త క్లిష్టంగా ఉంటే, సహాయం కోసం మీ హోస్టింగ్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. వారు మీ నిర్దిష్ట సర్వర్ కోసం ఎలా సెటప్ చెయ్యాలో తెలియచేస్తారు.
గమనికలు:
మార్గంలో http://, ftp:// లేదా మీ సర్వర్ చిరునామాను ఉపయోగించవద్దు.
మీరు పేర్కొన్న డైరెక్టరీ మీ FTP సర్వర్‌లో ఇప్పటికే ఉండాలి.
ఇది పూర్తి మార్గం కానక్కర్లేదు - ఇది మీ సర్వర్‌పై మీ ftp మూల స్థానానికి సంబంధించబడి ఉండాలి.
36. సూచికను మళ్ళీ ప్రచురించడం మరియు పూర్తి బ్లాగు మధ్య ఉన్న తేడా ఏమిటి?
మీకు ఒక FTP బ్లాగు ఉంటే, అప్‌డేట్‌లు ప్రతిబింబించడానికి మీ బ్లాగును మళ్ళీ ప్రచురించాలి. సూచికను మాత్రమే మళ్లీ ప్రచురించడం అంటే సూచిక పేజీ (మరియు ఎనేబులే చేసి ఉంటే, సైట్ ఫీడ్) మాత్రమే మళ్ళీ ప్రచురించబడుతుంది.
మొత్తం బ్లాగును మళ్లీ ప్రచురించడం వలన మొత్తం బ్లాగు- సూచిక పేజీ, ఫీడ్, ఆర్కైవ్ మరియు పోస్ట్ పేజీలు మళ్ళీ ప్రచురించబడతాయి. ఇది మీ తాజా టెంప్లేట్ మార్పులను మీ బ్లాగు యొక్క అన్నీ పేజీలకు వర్తింపచేస్తుంది. మీరు ఎక్కువ పోస్ట్‌లను కలిగి ఉంటే దీనికి కొంచెం సమయం పడుతుంది.
37. చట్టపరమైన సమస్య గురించి నేను ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి?
చట్టపరమైన సమస్య గురించి మీరు రిపోర్ట్ చెయ్యాలనుకుంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
ఈ సమాచారం ఉపయోగపడిందా?
అవును కాదు
Blogger - మమ్మల్ని సంప్రదించడం - Help with other Google products - భాషను మార్చు:
©2011 Google - Google హోమ్ - గోప్యతా విధానం - సేవా నిబంధనలు
***********************************************************************************************************************************