ముగిసిన ఎంసెట్ పరీక్ష
ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎంసెట్ రాసే విద్యార్థులకు నిబంధనలు కఠినతరం చేయడంతో వారు అనేక ఇబ్బందులు పడ్డారు. నిబంధనల గురించి విస్తృతంగా ప్రచారం చేసినా పలువురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించకపోవడంతో కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. పరీక్ష కోసం తాము పడిన శ్రమంతా నిష్ప్రయోజనమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment