కె. బాలచందర్‌కు 2010'దాదాసాహెబ్ పాల్కే' అవార్డు
సినీ రంగంలో అత్యున్నత పురష్కారం ప్రతిష్థాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె.బాలచందర్ ను వరించింది.2010 ఏడాదికిగానూ ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.వరుసగా రెండోసారీ దక్షినాదికి చెందిన చలన చిత్ర ప్రముఖునికే ఈ అవార్డు రావడం విశేషం.ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, పది లక్షల నగదు, శాలువా బహూకరిస్తారు.బాలచందర్ గత 45 ఏళ్లుగా సినీ రంగంలో సేవలందించారు.దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ఆయన పేరెన్నిక గన్నారు.అంతేకాక తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందకు పైగా సినిమాలకు దర్శకత్వ, నిర్మాణ, రచయిత బాధ్యతలు ఆయన నిర్వహించారు. బాలచందర్ 1930 జులైలో తమిళనాడులోని తంజపూరు జిల్లాలో జన్మించారు.మొదట నాటక రచయిత అయిన బాలచందర్ 1965లో సినీరంగంలోకి ప్రవేశించారు. ఆయన సినిమాలు అపూర్వ రాగగళ్, అవర్గల్, 47 నాట్కల్ (47 రోజులు), సింధు భైరవి, ఏక్ ధూజే కే లియే వంటి చిత్రాలను తీశారు.ఆయనకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అంతే ఆదరణ ఉంది.సత్తెకాలపు సత్తయ్య, అంతులేని కథ, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, ఆడవాళ్లూ మీకు జోహార్లు, భలేకోడల్లు, గుప్పెడు మనసు, కోకిల, రుద్రవీణ, అందమైన అనుభవం లాంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత బాలచందర్ ది.లోతైన వ్యక్తిగత సంబంధాలను, సామాజిక అంశాలను ఆధారం చేసుకుని సినిమాలు చేయడం ఆయనలో ఉన్న విశేషం.తమిళనాడుకు చెందినవారైనప్పటికీ తెలుగువారికి ఆయన బాగా దగ్గరయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్ తదితర ఎందరో నటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్ కే దక్కుతుంది.బాలచందర్ కు అవార్డు రావడం పట్ల టాలీవుడ్, కోలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది.బాలచందర్ రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులు, రెండుసార్లు జాతీయ సమైక్యతా అవార్డు (నర్గీస్ దత్)గెలుచుకున్నారు. 1987 లో పద్మశ్రీ అవార్డుని, 1973 తమిళనాడు అత్యుత్తమ పురస్కారం కలైమామణి అవార్డుని, 2011 ఏఎన్ఆర్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణ నంది, రజత నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు పలు మార్లు ఉత్తమ దర్సకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.బాలచందర్ తీసిన సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందటమే కాకుండా 4 చిత్రాలు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి.
No comments:
Post a Comment