భార్యను కరిచిన రేబిస్ వ్యాధిగ్రస్తుడు
కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుక్క కరిచి రేబిస్ సోకిన ఓ వ్యక్తికి వ్యాధి ముదరటంతో భార్యను కరిచిన ఘటన కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన సుబ్బారావుకు కొద్దిరోజుల క్రితం కుక్క కరిచింది. అతనికి రేబిస్ వ్యాధి సోకటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సుబ్బారావుకు వ్యాధి ముదరటంతో అతనికి సపర్యలు చేస్తున్న భార్య నాగమణిని కరిచాడు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment