అబ్బో..! రాజశేఖర్‌ని జీవిత ఎలా భరిస్తుందో..?!!
నటుడు రాజశేఖర్‌కు నిలకడ లేదని ఇండస్ట్రీలోని చాలామంది అనుకుంటున్నదే. ఇటీవల ఆయన సినిమాలు కొన్ని బాక్సుల దాకా వచ్చి ఆగిపోయాయి. దీంతో ఏకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రపై సినిమా తీయాలనీ, జగన్ నుంచి సొమ్ములు వస్తాయని ఆశించి భంగపడ్డాడు.
అప్పట్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర తీస్తున్నట్లు పబ్లిసిటీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత జగన్‌నూ కలిశారు. తాము మాట్లాడుదామనుకున్న విషయం కొద్దిరోజులకు వాయిదా పడింది. చూసీ చూసీ ఇక లాభం లేదనుకుని తాను ఆ సినిమా చేయడం లేదని చెప్పేశాడు.
అయితే ఇదంతా రాజశేఖర్ ప్రవర్తన వల్లే అయిందని పూరీ తన సన్నిహితులతో అన్నాడట. అతని మనస్తత్వం నిలకడలేనిదనీ, కాసేపటికే మూడ్ మారిపోతుందని అన్నాడట. అబ్బో... జీవిత ఎలా భరిస్తోందని కామెంట్ కూడా చేశాడట.
ఇటీవల పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. జగన్ దీక్షలో విజయవాడలో పాల్గొని... ఇప్పుడు వారిని తిట్టిపోశాడు. తాజాగా చంద్రబాబు పంచన చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈయన చేరితో ఒరిగేదేమీ లేకపోగా నష్టం జరుగుతుందని చంద్రబాబుకు కొందరు సూచించారట.
ఆల్‌రెడీ మొదట్లో ఎన్.టి.ఆర్.కు సపోర్ట్ చేసినవాడే రాజశేఖర్. ఆయన పదవీభ్రష్టుడ్ని చేసినప్పుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ.. నల్లదుస్తులు ధరించి ఆయన ఎన్టీఆర్ వెంట ప్రచారం చేశాడు. మరి ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో కలిసి పనిచేస్తానంటూ ముందుకు దూకుతున్నాడు. తెదేపాలో చేరితో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
No comments:
Post a Comment