వైఎస్‌ఆర్ కాంగ్రెస్
రాష్ట్రంలో కొత్తగా నమోదైన ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షునిగా దివంగత నేత వైయఎస్ తనయుడు, కడప మాజీ ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోగా జగన్ స్వయంగా దరఖాస్తు చేసుకొన్న ‘వైఎస్‌ఆర్ పార్టీ’కి ఎన్నికల కమీషన్ గుర్తింపు లభించకపోవచ్చుననే అనుమానంతో జగన్ ఇంతకుముందే శివకుమార్ అనే వ్యక్తి దరఖాస్తును ఆమోదించి రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీగా కమీషన్ రిజిస్టర్ చేసిన ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ని ఆయన అనుమతితో సొంతం చేసుకొన్నట్లు తెలియవచ్చింది. ఈ కొత్త పార్టీ అధ్యక్షునిగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియజేసే పత్రాలను వైఎస్ తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి మంగళవారంనాడిక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలుసుకొని సమర్పించారు. జగన్ దరఖాస్తు చేసిన ‘వైఎస్‌ఆర్ పార్టీ’ని ప్రాంతీయ పార్టీగా రిజిస్టర్ చేసేందుకు కూడా ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా అనుమతిని తెలియజేసినప్పటికీ ఇందుకేమైనా అభ్యంతరాలుంటే వాటిని ఎవరైనా నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు తెలియజేయాలంటూ ప్రచార మాధ్యమాలతో జగన్ తన సొంత ఖర్చుతో వాణిజ్య ప్రకటనలను విడుదల చేయాలని ఆదేశించిన నేపధ్యంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందనే అభిప్రాయంతో ఆయన ఇప్పటికే అన్ని లాంఛనాలు పూర్తిచేసుకొన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైనట్లు సమాచారం. తాను రాజీనామా చేసిన కడప లోక్‌సభ స్థానానికి, తన తల్లి విజయలక్షి రాజనామాతో ఖాళీయ అయిన పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలలో తన సొంత పార్టీ పేరు, గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.
No comments:
Post a Comment