Tuesday, February 1, 2011

కిరణ్‌ సర్కారులోకి మెగాపార్టీ ...!! సోనియాతో చిరంజీవి భేటీ, అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు


బడ్జెట్‌ సమావేశాలకు ముందే విస్తరణ ! 
* కేబినెట్‌లో PRPకి 3 లేదా 4 బెర్తులు ! 
* చిరుతో ఆంటోని రహస్య మంతనాలు 
* డిప్యూటీ సీఎంగా చిరు ?
ఊహించిందే జరిగింది. బేరం కుదుర్చుకుంది. PRPతో అధికారం పంచుకునేందుకు సిద్ధమైంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. అకస్మాత్తుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆంటోని చిరంజీవితో భేటీ కావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా జరిగిన ఈ హాఠాత్పారిణామం రాష్ట్రాన్ని షేక్‌ చేస్తోంది. డిప్యూటీ సీఎం సహా మూడు నాలుగు బెర్త్‌లు ఇస్తారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే కాంగ్రెస్‌ ఆఫర్‌కు చిరు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కడిగిపారేసిన PRPతో అంటకాగేందుకు సిద్ధమైంది అధికారపార్టీ. బొటాబొటి మెజార్టీతో పాలన నెగ్గొకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌ సర్కారుకు ఆక్సిజన్‌ ఎక్కించేందుకు గత కొన్ని నెలలుగా హైకమాండ్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. యువనేత జగన్మోహన్‌రెడ్డి కడప ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఢిల్లీ పెద్దలకు ముచ్చెమటలు పోశాయి. క్షణం ఆలస్యం చేయకుండా నువ్వే ఆపద్భాంధవుడివంటూ చిరు శరణు జొచ్చారు. ఎన్నికలప్పుడు దుమ్మెత్తిపోసిన చిరు మాటలను ఓ చెత్తో తుడుచుకుని మరో చేయితో స్నేహ హస్తం అందించింది కాంగ్రెస్‌. హుటాహుటిన హస్తినకు పిలిపించుకున్న సోనియా చిరుతో ఫేస్‌ టు ఫేస్‌ భేటీ అయ్యారు. తమను ఆదుకుంటే భారీ ప్రతిఫలం ఇస్తామని బేరం పెట్టారు. మరు మాట్లాడకుండా మేడం బంపరాఫర్‌కు OK చెప్పారు చిరు. ముఖ్యమంత్రి పదవికి రోశయ్య రాజీనామా చేసిన వెంటనే PRP అధికారంలో చేరుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో సీన్‌ రివర్సయింది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత యువనేత జగన్‌ లక్ష్య దీక్ష, జలదీక్ష, జనదీక్ష చేయడంతో 25 మంది కాంగ్రెస్‌ MLAలు క్యూ కట్టారు. దీంతో మళ్లీ షేకయిన హైకమాండ్‌... నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. PRP, MIMలను టచ్‌లో ఉంచుకుని సర్కారుకు ముప్పు రాకుండా వ్యూహాలు సిద్ధం చేసింది. అయితే జగన్‌ దీక్షల్లో పాల్గొన్న MLAలు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్‌ విసరడం వివాదస్పదమైంది. దమ్ముంటే హైకమాండే చర్యలు తీసుకోవాలంటూ యువనేత వర్గం ప్రతిసవాల్‌ చేయడంతో ఖంగుతిన్నారు పెద్దలు. YS తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టబోమని పదేపదే చెబుతున్నా... కాంగ్రెస్‌ నుంచే కవ్వింపు చర్యలు వస్తుండడం అది కూడా CM స్థాయి వ్యక్తి నుంచే రావడం డేంజర్‌ సంకేతాలు వెళ్లాయి. మరో మూడేళ్ల పాటు అసెంబ్లీకి కాలపరిమితి ఉండడంతో భారీ నష్టం జరక్కముందే జాగ్రత్తపడాలనుకున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ హుటాహుటిన ఆంటోనిని పంపి రాజకీయం చక్కబెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి మలుపు ఉంటుందని గత కొన్ని నెలలుగా ఊహిస్తూనే ఉన్నారు. అయితే ఉరుములేని వానలా ఆంటోని హైదరాబాద్‌ రావడం పెను దుమారం రేపింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా చిరు నివాసానికి చేరుకున్న ఆంటోని వెంట PCC చీఫ్‌ D.శ్రీనివాస్‌ ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర సర్కారులో చేరే PRPకి డిప్యూటీ సీఎంతోపాటు మూడు నాలుగు బెర్త్‌లు ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్‌లో PRP విలీనం విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో MLC ఎన్నికల్లో సహాయం చేసింది PRP. బావమరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ స్థానం ఇస్తారని అప్పట్లో ప్రచారం గుప్పుమంది. కానీ చివరిలో ఆ డీల్‌ క్యాన్సిల్‌ అయింది. మరిప్పుడు అలాంటి ప్రతిపాదనలే ఉండొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌కు చిరు ఎలా రియాక్ట్‌ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది.  చిరంజీవి రేపో మాపో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారా, విలీనం కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించడానికే రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ హైదరాబాదు వచ్చారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు. సోనియాను కలవాలని ఆంటోనీ చిరంజీవికి చెప్పారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆంటోనీ, చిరంజీవి భేటీలో రహస్యమేమీ లేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో చేరే విషయంపై చర్చ జరగలేదని, రెండు పార్టీలున కలిసి పనిచేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు.కాగా, చిరంజీవి వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రేపటి నుంచి చిరంజీవి తిరుపతి పర్యటన చేయాల్సి ఉంది. ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్‌ వర్గానికి చెందిన శాసనసభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుని, చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకుంటుందని అంటున్నారు. తొలి విడతగా జగన్ వర్గానికి చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపై వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురైదుగురు శానససభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్‌కు రాజ్యసభ సీటు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. సి. రామచంద్రయ్య కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.

No comments:

Post a Comment