* 73 కిలోమీటర్ల పాదయాత్ర
* హరితయాత్రగా నామకరణం
* నాలుగు రోజులపాటు యాత్ర
* భారీ ఏర్పాట్లలో అనుచరులు
* ఏడు - రావులపాలెం - పేరవరం
* ఎనిమిది - పేరవరం - ధవళేశ్వరం - కొవ్వూరు
* తొమ్మిది - కొవ్వూరు - వేగేశ్వరపురం
* పది - వేగేశ్వరపురం - పోలవరం
యువనేత జగన్ మహానేత వైఎస్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. తన తండ్రిలా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ హరితయాత్రను చేయనున్నారు. వచ్చే నెల ఏడున రావులపాలెంలో ప్రారంభం కానున్న హరిత యాత్ర పదో తేదీన పోలవరం బహిరంగ సభతో ముగియనుంది. ఈ యాత్ర కోసం జగన్ అభిమానులు ఉభయగోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, యంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న యువనేత జగన్ ఈ సారి తన దృష్టిని పోలవరం ప్రాజెక్ట్ పై సారించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతూ పాద యాత్ర చేపడుతున్నారు. వచ్చే నెల 7 నుండి నాలుగు రోజుల పాటు హరిత యాత్ర కొనసాగుతుంది. 7న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి యాత్ర ప్రారంభమై పేరవరం వరకు 15 కిలో మీటర్లు పాద యాత్ర కొనసాగుతుంది.8న పేరవరం నుండి దవళేశ్వరం, రాజమండ్రి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు 22 కిలో మీటర్ల పాద యాత్ర కొనసాగుతుంది. 9న కొవ్వూరు నుండి ప్రారంభమై వేగేశ్వరపురం వరకు, 10న పోలవరం వరకు పాద యాత్ర కొనసాగుతుంది. మొత్తం 73 కిలో మీటర్లు జగన్ పాద యాత్ర కొనసాగుతంది.
పోలవరం ప్రాజెక్ట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరికి నిరసనగానే జగన్ హరిత యాత్ర చేపడుతున్నారని టీటీడి మాజీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు, పోరాటాలు చేపట్టినా, జగన్ ఏకంగా పాద యాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
No comments:
Post a Comment