హైదరాబాద్ MMTS రెండోదశకు గ్రీన్‌సిగ్నల్
ఈ రైల్వే బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. ఎంతో ఆశగా ఎదురు చూసినా... నిరాశే మిగిలింది. కొత్త లైన్ల ప్రతిపాదనలు తప్ప... చెప్పుకోదగ్గ కేటాయింపులేమీ లేవు. మొత్తం 15 దురంతో ఎక్స్‌ప్రెస్‌లను ప్రకటిస్తే... అందులో ఒకటి మనకు కేటాయించారు. సికింద్రాబాద్- విశాఖ మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చారు. సికింద్రాబాద్- పూణే మధ్య ఓ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. హౌరా - తిరుపతి, హౌరా -విశాఖల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు, తిరుపతి - అమరావతిల మధ్య కొత్త రైలును ప్రకటించారు. విశాఖ - కోరాపూట్‌ల మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిపాదించారు. తిరుపతి - గుంతకల్లు, కాచిగూడ - నడికుడి, కాచిగూడ - మిర్యాలగూడ, సికింద్రాబాద్ - నిజామాబాద్‌ల మధ్య ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జెట్‌లో తెలిపారు. వీటితో పాటు కొత్త లైన్లను కూడా ప్రతిపాదించారు. సిద్దిపేట మీదుగా హైదరాబాద్- కరీంనగర్ మధ్య కొత్త లైను వేయనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. కరీంనగర్ - హసన్‌పర్తి, విశాఖ - భద్రచాలం, దొనకొండ - ద్రోణాచలం, పటాన్‌చెరు - ఆదిలాబాద్ , భద్రాచలం - ఖరగ్‌పూర్, తిరుపతి - కాంచీపురం - నాగూరు మధ్య కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించారు. వీటితో పాటు హైదరాబాద్ రెండోదశ ఎంఎంటీఎస్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
No comments:
Post a Comment