కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు, రక్షణ మంత్రి ఏకే ఆంటోని హైదరాబాద్ వచ్చారు. వచ్చిన వెంటనే పీసీసీ చీఫ్ డి. శ్రీనివాసరావును వెంటబెట్టుకుని నేరుగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇంటికి వెళ్లడం జరిగింది. కేంద్రమంత్రి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రజారాజ్యం పార్టీని భాగస్వామి కావాలని కోరినట్లు తెలిసింది. ఇది కూడా బడ్జెట్ సమావేశాలకంటే ముందే జరిగిపోవాలని ఆయన కోరినట్లు సమాచారం.హఠాత్తుగా చిరుతో సోనియా దూత భేటీ కావడం వెనుక కారణాలను విశ్లేషిస్తే.... జగన్ వర్గం కాంగ్రెస్ సర్కార్‌ను ఎప్పటినుంచో బెదిరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మద్దతుతో ఆ వర్గంపై గట్టి చర్యలు తీసుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వంలో చేరితే ప్రస్తుతం యూపీఎ ఎదుర్కొంటున్న అనేక అవినీతి కుంభకోణాలకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందేమోనన్న భయంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా బడ్జెట్ సమావేశాలకంటే ముందుగా ఎలాగైనా పీఆర్పీని క్యాబినెట్‌లోకి ఆకర్షించాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా యత్నిస్తున్నట్లు సమాచారం. ఇక మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన సోంత జిల్లా అయినటువంటి చిత్తూరులో రచ్చబండ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాదులో లేకపోవడం కేంద్రమంత్రి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.ఐతే ఈవిషయంలో పెద్ద ఆలోచించవలసిందిగా ఏమిలేదని అంటున్నారు. ఈ సందర్బంలో డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజకీయాల్లో బాగా పరిణితి చెందారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి ప్రారంభ రాజకీయాలకు నేటి రాజకీయాలకు ఎంతో తేడా ఉందన్నారు.
No comments:
Post a Comment