Thursday, February 24, 2011

మణుగూరు ప్యాసింజర్‌కు నిప్పు – ప్రయాణికులు సురక్షితం


రంగల్-విజయవాడ మార్గంలోని తాళ్ళపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు మణుగూరు ప్యాసింజెర్ రైలుకు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో ఒక బోగీ (ఎస్-3) పూర్తిగా దగ్ధమైంది. దీంతో రెండు గంటలపాటు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి.
అప్రమత్తమైన రైలుడ్రైవర్ విషయాన్ని సమీపంలోని తాళ్లపూసపల్లి స్టేషన్ మాస్టర్ షమీర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో పోలీసు, రెవిన్యూఅధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను కేసముద్రం స్టేషన్‌లో, అప్ లైనులో తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణాఎక్స్‌ప్రెస్, విజయవాడ-కాజీపేట ప్యాసింజర్, గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మహబూబాబాద్ స్టేషన్లో గంటపాటు నిలిపివేశారు. రైల్వే, పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

No comments:

Post a Comment