Wednesday, March 2, 2011

 శివోహం.. శివోహం..!
వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళ మని అర్థం.పరమ మంగళకరమైనది శివ స్వరూపం.ఆ పరమ శివుని అనుగ్రహం పొందటా నికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాల లో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతి రూపంలో, లింగా కారం గా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అం టారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ము ఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురా ణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుం డా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్త్యా త్మనమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యమున్నదం టారు.
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క వి ధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్ప టికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివు డు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.
ప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.
దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.ఆపుణ్య తిధినాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణము జరిపించుటకు శుభముహుర్తంగా నిర్ణయించారు. ఈ జగత్తు దేనిలో సంచరించ దేనిలో లయం చెందుతుందో అదే లింగము. దీని మొదలు ఏదో చెప్పడానికి వీలుకాదు. కనుక అద్యంతాలు లేనిదే లింగము.లింగతత్వమే…. ఆత్మ…కనుక ప్రతిదేహమందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు. ఆ సత్యమును చాటడానికే ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉదర్భవించి బ్రహ్మ విష్ణువులుకు దర్శనవిచ్చాడు… ఆనంత లింగాకారుడై ముల్లోకాలలోను వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకున్నారు.
అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. పుష్ప స్వర్ణాభరణాలంకారాలతో పరమే శునికి పని లేదు. ఈ అనంతవిశ్వంలో ఏ అలంకరణలు, ఏ అభరణాలు శాశ్వతం కావు. బాహ్య సౌందర్యం పరమావధి కానేకాదు. జీర్ణించుకు పోయే బాహ్య దేహానికి ముఖ్యత్వం ఇవ్వడం అవివేకం. శాశ్వతంగా ఏ మార్పులేకుండా చిరస్థాయిగా నిలిచివుండేది. ఆత్మ ఒక్కటే. అలాంటి మ హోన్నత ఆత్మను మనం సదా గౌరవించి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తిని పొందే మార్గం. ఈ నిగూఢ నిర్మల తత్త్వాన్ని మనకు అవగతం చేసేందుకు అద్యంతరహితుడైన పార్వతీశుడు ఏ అలంకరణలూ లేకుం డా అతి నిరాడంబరంగా దిగంబరుడుగా లోకాన నిలిచాడు.
శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం..
శైవనామాన్ని ధరించేవారు మధ్య రేఖ మద్యలో చందనమూ, కుంకుమ మిశ్రమంలో కూడిన వృత్తాకార రూపాన్ని తప్పక ధరించాలి. వర్థి విభూతి రేఖలవలన శైవ కృపకు మాత్రమే పాత్రులు అవుతారు.అలాకాక మధ్య లో వృత్తాన్ని ధరించడం వల్ల ఆ శివుని పత్నియైన పార్వతీమాత కటాక్షాన్ని కూడా పొందవచ్చు.దేహంలోని మిగిలిన అంగాలపైన మూడు విభూతి రేఖలు మాత్రమే దిద్దుకొవాలి. జప తప ధ్యానాదుల ద్వారా మూలాధార చక్రంలో మేల్కొన్న కుండలిని శక్తి ‘ఇలాపింగళ’ నాడులు (సుషూమ్నా) కలయిక ప్రదేశంలో చేరుకొన్నపడు దానిలోని శక్తిప్రసారం ‘భృకుటి’ (రెండు కనుబొమ్మలు బయటకు రావడానికి ప్రయత్నించే ప్రదేశంలో శివుని త్రిశూలమైన రక్షిణిని తెల్లని వర్ణంలో దిద్దుకుంటారు.
ఈ త్రిశూ లంలోని మధ్యమొనను (గీతను) ఎరుపులో దిద్దుకోవడం వెనుక ఒక రహస్యమున్నది. శక్తిని (ఇది తపము, జపము, ధ్యానముల వల్ల కల్గినది) ఎరుపు వర్ణముతో సూచిస్తారు. కుండలిని శక్తి వర్ణం కూడా ఎరుపే అవ్వడంవలన మధ్య రేఖను తప్పనిసరిగా ఎరుపు రంగులో దిద్దుకుం టారు. నిగూఢంలో పరిశీలిస్తే వైష్ణవనామం, శైవనామం ఈశ్వరుని ఆ యుధాల కలయిక అని సుస్పష్టమౌతుంది. అందువల్లనే ‘శివాయ విష్ణూ రూపాయ! విష్ణూ రూపాయ శివహే’ అన్నారు.
ప్రదక్షణ విధులు…
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.
గంగను భరించడంలో అంతరార్థం
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది.ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు.అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు.
అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కా ర్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది.. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్ర వహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకా లను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.
చంద్రుని పొందడంలో అంతర్యం 
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం.మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు శంకరుడు.
బిల్వ దళం ప్రాముఖ్యత: 
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

నంది దర్శనం
నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి.నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం. ‘‘నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం! మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’ అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపస వ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణము ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలము వచ్చును.
ద్వాదశ జోతిర్లింగాలు…
శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….
లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.
శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖర మీదే తపస్సు చేస్తున ఒక్కానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.
శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.
శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.
శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.
శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.
శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.
శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.
శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.
శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.
శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.
శివరాత్రులు ఎన్ని?
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొ త్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి మాస శివరాత్రి, మ హాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహా శివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్త ముడవుతాడని పురాణాల మాట.ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంతో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొ ద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవా రంతో కూ డి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.
భస్మధారణలోని అంతరార్థం: 
ఎంతో నిగూఢత్వం నిండివున్న భస్మా న్ని మరే ఇతర దేవుడుగాక పరమశివుడే ధరించడంలో అంతరార్థం ఏమి టో, మరే ఇతర దైవాలు ఎందుక భస్మాన్ని ధరించరో, శంకరుడే ధరించడానకి గల కారణం ఏమిటో చెప్పే కథ ఒకటుంది. మహర్షి ఆశ్ర మానికి సద్బ్రాహ్మణుడి వేషంలో తరలి వచ్చాడు పార్వతీశుడు. సాటి బ్రహ్మణుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేసాడు మహర్షి. మర్యాదలన్నీ పొందిన పిదప బ్రహ్మణ వేషధారియైన గంగేశుడు మహర్షిని ఉద్దేశించి ‘‘మహర్షి ! అతిథి సత్కారాలు సంపూ ర్ణం గా తెలిసిన నీకు విజయోస్తు ! నీవంటి జ్ఞానసంపన్నుడు, తపోధీరుడు సుఖదు:ఖాలకు అతీతుడైన ఉండాలి. సంతోషాలను ఆవేకావేశాలను అదుపులో ఉంచుకోవాలి.
కానీ నీవు ఏ విషయమో పదేపదే స్మరించు కుంటూ మహా సంబర పడుతున్నావు. నీ అంతటి అమిత తపోధీరుడిని సైతం మాయ చేసి ఇంతగా సంతోషపెట్టి ఉబ్బితబ్బిబ్బు చేస్తున్న సంగతే మిటోనే తెలుసుకోవచ్చునా?’’ అని అడిగాడు. అంతవరకు తనలోనే దాచుకున్న సంతోషాన్ని పంచుకునేందుకు ఒకరు వచ్చినందుకు మహర్షి ఎంతగానో సంబరపడుతూ ‘‘ఓ సాధుపుంగవా! నా అమితానందానికి కారణం నువ్వు తెలుసుకుంటే ఎంతటి తప: స్సంపన్నుడైనా దైవాంశ సంఘటనలకు సంతోష పడడం సహజమేనని తెలుసుకుంటావు. నా చేతి వ్రేలు గాయపడినపుడు గాయం నుండి రక్తానికి బదులు,పరిమళ భరిత ద్రావకం వెలువడుతోంది.
అంటే నా తపస్సుకు పరంథాముడు అంగీక రించినట్లే కదా! ఇంతకంటే ఆనందకారకం ఏం కావాలి’’ అంటూ వివ రించాడు. పరమశివుడు మహర్షి అజ్ఞానానికి నవ్వుతూ ‘‘మహర్షీ ! నీ అ మాయకత్వానికి ఎంతో దిగులుగా ఉంది. ఈ శరీరం, సకల జీవరాశు లు, సమస్త ప్రకృతి, ఈ అనంతవిశ్వమంతా ఏదో ఒక సమయంలో ల యం కావలసినవే. అలా లయమైనపుడు సహజ ధర్మాలకు ఆధారమైన ఆకృతి కాలి మసి కావలసిందే. అలాంటి సంపూర్ణ లయత్వంలో సృష్టిలో మిగిలేది బూడిదే. శాశ్వతమైన బూడిదను పొందడమే అద్భుతమైనది.
నా వ్రేలి నుండి అటువంటి శాశ్వతానందం నీవు చూడగలవు’’ అంటూ తన వ్రేలిని సున్నితంగా గాయపరచుకున్నాడు.ఆ వెంటనే స్వామి వ్రేలి నుండి బూడిద రాలసాగింది. వచ్చినది ఈశ్వరుడని గ్రహించి ‘స్వామీ ! నా అజ్ఞానం తెలియవచ్చింది. ఎంతో అద్భుతాన్ని నాకు చూపించి, నా అజ్ఞా నం పొగొట్టిన నీవు ఎవరో నీ దివ్యరూపమేటి టో నాకు చూసి నన్ను ధ న్యుడిని, పునీతుడిని గావించు’’ అని మహర్షి వేడుకున్నాడు.విశ్వనాథుడు తన అమిత మహోన్నత సుందర దివ్య నమ్మోహన రూపంతో దర్శనమిచ్చాడు.
*****************************************– డా వి.జి.శర్మ, 9440944132
Surya Telugu Daily 



No comments:

Post a Comment