Friday, March 11, 2011

ఓయూలో విద్యార్థులు VS పోలీసులు...!!


ఓయూలో విద్యార్థులు VS పోలీసులు...!!
* క్యాంపస్‌ గేట్ల మూసివేత 
* రాళ్లదాడులు ..అడ్డుకున్న పోలీసులు 
మిలియన్‌ మార్చ్‌తో ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉడికిపోయింది. ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపస్‌ గేట్లు మూసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్టూడెంట్స్‌ను అదుపుచేసేందుకు లాఠీఛార్జ్‌తోపాటు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు ఖాకీలు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది. ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ టెన్షన్‌..టెన్షన్‌. 
మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ట్యాంక్‌బండ్‌ వైపు కదలడంతో పోలీసులు అలర్టయ్యారు. NCC గేట్‌ వద్ద వాళ్లను అడ్డుకున్నారు. ముందుకు కదలనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. పోలీసుల వలయం దాటేందుకు స్టూడెంట్స్‌ ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీఛార్జ్‌ చేయడంతో రెచ్చిపోయిన స్టూడెంట్స్‌... ఖాకీలపై రాళ్లు విసిరారు. అంతే..విద్యార్థులపై బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు పోలీసులు. 
పోలీసులు అదుపుచేసినా విద్యార్థులు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆవేశంతో NCC గేటు విరగ్గొట్టి మరీ బయటకు వచ్చారు. దీంతో మరోసారి విద్యార్థులపైకి రబ్బర్‌ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు ఖాకీలు. ఖాకీల తీరుపై మండిపడ్డారు విద్యార్థులు. అరెస్ట్‌ చేసిన స్టూడెంట్స్‌ను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. మిలియన్‌ మార్చ్‌ ముగిసినా..ఓయూలో మాత్రం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

No comments:

Post a Comment