Tuesday, March 8, 2011

నాగం జనార్ధన్‌రెడ్డి కొత్త పార్టీ పెడతారా..!

* బాబు చాణక్యం బెడిసి కొట్టిందా! * నాగం వెనుక షాడో లీడర్‌ ఎవరు * సడెన్‌గా టోన్‌ మార్పు దేనికి సంకేతం * జనార్ధన్‌రెడ్డి వెంట ఎంతమంది వెళ్తారు 

చంద్రబాబుతో నాగంకి సయోధ్య కుదిరినా.. భవిష్యత్‌లో ఆయన మౌనంగా ఉంటారని చెప్పడానికి లేదు. పార్టీలో ఉండే పోరాడతానని నాగం చెప్తున్నా.. మిగతా నేతల్లో ఎక్కడో సందేహం. ఇంతకీ నాగం కొత్త పార్టీ పెడతారా. అసలు ఆయన వ్యూహం ఏంటి. గత కొంత కాలం నుంచి ప్రత్యేక తెలంగాణం విన్పిస్తున్న నాగం జనార్ధన్‌రెడ్డి సెపరేట్‌ శాఖ కోసం పట్టుబడుతున్నారు. ససేమిరా అన్న అధినేతపై అప్పటి నుంచే రగిలిపోతున్నారు. 
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల తర్వాత ప్రత్యేక కాంక్ష నాగంలో మరింత పెరిగిపోయింది. TDPకి చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయని సాకుగా చూపారు నాగం. అయినా బాబు నో చెప్పారు. పొలిటికల్‌ JAC, TRS అధినేత KCR డైరెక్షన్‌లో జరిగిన పలు ప్రొగ్రామ్స్‌లో వారితో క్లోజ్‌గా కలిసి నడుస్తున్న నాగంలో అనూహ్యంగా మార్పొచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షపై తమను అధినేత కట్టడి చేస్తున్నారని జనార్ధన్‌రెడ్డి బహిరంగంగానే తప్పుబట్టేంత ధైర్యాన్ని ఇచ్చింది. 
2004 వరకు సమైక్య వాదిగా ఉన్న నాగం స్వరంలో ఛేంజ్‌ వచ్చింది. YS మరణం తర్వాత KCR దీక్షకు మైలేజ్‌ రావడం... కేంద్రం ప్రత్యేక ప్రకటన తర్వాత ఈ మాజీ మంత్రి వ్యవహార శైలీ బాగా మారింది. OU క్యాంపస్‌లో దెబ్బలు తిన్న తర్వాత పక్కా తెలంగాణ వాదయ్యారు నాగం. TDPని ఇరుకున పెట్టాలన్న సింగిల్‌ పాయింట్‌ ఏజెండాను అమలు చేసేందుకు నాగంను KCR, కోదండరాం పావుగా వాడుకున్నారన్న వాదనా ఉంది. అయితే ఈ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన అధినేత వారి పాచికలు పారకుండా చిత్తు చేస్తూ వస్తున్నారు. 
ప్రతి విషయంలో ఓ విజన్‌తో ముందుకెళ్లే చంద్రబాబు... ఈసారి లెక్క తప్పారా. నాగం అసెంబ్లీలో రగడ విషయంపై ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నాగం సడెన్‌గా టోన్‌ మార్పు వెనుక ఎవరున్నారన్న దానిపై బాబు ఆరా తీస్తున్నారు. తెలంగాణ విషయంలో TDPని కౌంటర్‌ చేస్తున్న TRS, పొలిటికల్‌ JAC మెగా ప్లాన్‌గా అనుమానిస్తున్నారు. అయితే నాగంను ఆడిస్తున్న షాడో లీడర్‌ ఎవరన్న దానిపై కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు బాబు. నాగం మరో దేవేందర్‌ గౌడ్‌ అవుతారా!, చెన్నమనేని రమేష్‌ను ఫాలోవర్‌గా మారుతారా....ఇవే ఇప్పుడు తేలాల్సి ఉంది. 
అధినేతను కాదని అది కూడా అసెంబ్లీ సాక్షిగా నాగం ప్రత్యేక తెలంగాణం విన్పించడమంటే భారీ సాహసానికి ఒడిగట్టడమే. క్రమశిక్షణకు మారు పేరున్న TDPలో ఇలాంటివి చేయాలంటే అన్నింటికి తెగించాలి. ముఖ్యంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారన్న భయం ఉంటుంది. ఇవన్నింటిని నాగం ఎక్స్‌పెక్ట్‌ చేయరనడానికి లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న జనార్ధన్‌రెడ్డి కొత్త ప్లాన్‌ ఉండడంవల్లే ఇంతటి డేరింగ్‌ స్టెప్‌ వేశారంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. దేవేందర్‌గౌడ్‌ పార్టీని వీడిన తర్వాత దాదాపు నెంబర్‌ టుగా ఉంటూ వస్తున్న నాగం... ఇప్పుడు ఆయన్నే ఫాలోఅవుతారా అన్న డౌట్స్‌ వస్తున్నాయి. 
లేదంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని వీడిన మాజీ MLA చెన్నమనేని రమేష్‌లా ఏదో ఒక పార్టీ పంచన చేరుతారా అన్నది కూడా ఆసక్తి రేకేత్తిస్తోంది. దేవేందర్‌ గౌడ్‌ పార్టీని వీడేముందు సీనియర్లు కొందరు వెళ్తారననుకున్నారు. తీరా అసలు వ్యూహం బెడిసి కొట్టడంతో పెద్దిరెడ్డి ఒక్కరే మాజీ హోంమంత్రిని అనుసరించారు. మరి ఈసారి నాగం విషయంలో కూడా సేం సీన్‌ రిపీటవుతుందా. లేదంటే కొందరైనా MLAలు కలిసి వచ్చే ఛాన్స్‌ ఉందన్న వాదన బలంగా విన్పిస్తోంది. 
తెలంగాణ MLAల రాజీనామా పత్రాలన్ని తన జేబులోనే ఉన్నాయన్న నాగం కామెంట్స్‌కు బలం చేకూరుస్తూ సీనియర్‌ నేత మండవ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. నాగంతో వెళ్లేంత సీన్ గానీ... ఆయన చెప్పినట్లు చేసే అగత్యం తమకు లేదంటూ కొందరు నేతలంటున్నారు. నాగం ఒంటరయ్యారంటూ చేసిన ప్రచారం కూడా వట్టిదేనన్న సీన్‌ కన్పిస్తోంది. మోత్కుపల్లి, మండవ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తెలంగాణ MLAలంతా హాజరు కాలేదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. నాగం తీరుపై సీమాంధ్ర నేతల్లోనూ చర్చ జరుగుతోంది. 
అధినేత వద్దన్నా... సభలో జనార్ధన్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై పార్టీ పరంగా రియాక్షన్‌ ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఫ్యూచర్‌లో తమకూ ఇలాంటి పరిస్థితే వస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై డిస్కస్‌ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అధినేత చంద్రబాబుకు మళ్లీ సంకట పరిస్థితి తప్పదంటున్నారు విశ్లేషకులు. ఉద్యమాలతో అటు లోక్‌సభలో... ఇటు అసెంబ్లీలో... ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్‌కు TDPలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలు కాస్త ఊరట నిచ్చాయి. 

1 comment:

  1. చాలా బాగా రాసారు.స్వార్ధానికి నీతీ న్యాయం వుండవు. అణచివేత, దోపిడీ దాని నైజం.స్వాభిమానానికి అలుపు, మరపు వుండవు. ప్రాణాలకు తెగించి ఎంతకాలమైనా పోరాడటం దాని స్వభావంఅంతిమ విజయం సత్యానిదే,,,

    ReplyDelete