చంద్రబాబుకు మరోషాక్ ఇవ్వనున్న నాగం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడుకి ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన రెడ్డి మరో షాక్ ఇవ్వనున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత ఎజెండా రూపొందించుకునే పనుల్లో ఆయన ఉన్నారు. త్వరలో తన సొంత నియోజకవర్గం నాగర్ కర్నూలులో కార్యాచరణ ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. మే 9 తన ఇంటి నుంచి తెలంగాణ సాధన యాత్ర ప్రారంభించాలన్న యోచనలో నాగం ఉన్నారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవారిని కలుపుకుపోతానని ఆయన అంటున్నారు. దీని కోసం అధినేత అనుమతి అవసరంలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
No comments:
Post a Comment