రాష్ట్ర జనాభా 8.46 కోట్లు
హైదరాబాద్ : జాతీయ స్థాయిలో చేపట్టిన జనాభా గణన ప్రకారం రాష్ట్ర జనాభా 8,46,65,533కి చేరింది. రాష్ట్రంలో జనాభా లెక్కల వివరాలను ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ తెలిపారు.మొత్తం జనాభాలో పురుషుల సంఖ్య 4,25,09,881 కాగా, మహిళల సంఖ్య 4,21,55,652. జనాభా వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ కూడా పాల్గొన్నారు.తాజాగా జరిపిన జన గణన సందర్భంగా ‘నపుంసకుల’ను కూడా గణించారు కానీ వీరిని పురుషుల జాబితాలోనే కలిపారు. వీరి సంఖ్యను తర్వాత వెల్లడిస్తామని అనూరాధ తెలిపారు. ప్రస్తుతం ఇవి ప్రాథమిక లెక్కలని, పూర్తిస్థాయి లెక్కలు వెల్లడించడానికి మరో ఏడాది సమయం పడుతుందని వివరించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా 7,62,10,007 మాత్రమే. రాష్ట్రంలో జన గణన 2011 ఫిబ్రవరి 9న ప్రారంభించి ఫిబ్రవరి 28న ముగించారు. 2011 మార్చి ఒకటి నుండి ఐదు వరకు రివిజనల్ రౌండ్ లెక్కింపు జరిగింది. 2011 మార్చి 1 ప్రారంభం అయ్యే సమయానికి జన్మించిన ప్రతిశిశువును రెండో పర్యాయం జరిగిన రివిజనల్ రౌండ్ సందర్భంగా లెక్కల్లోకి తీసుకున్నారు. జనాభా గణనలో తొలుత 2010 ఏప్రిల్ 26 నుండి జూన్ 10 వరకు జరిగిన గణనలో ఇళ్ల వివరాలను సేకరించారు. దీని ఆధారంగా జనాభా గణన చేశారు.ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా దేశంలో నాలుగో స్థానంలో ఉండగా జనాభా పరంగా ఐదోస్థానంలో నిలిచింది. జనాభా అత్యధికంగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యధికంగా జనాభా ఉన్న జిల్లాగా రంగారెడ్డి (52,96,396) నిలిచింది. రెండో స్థానంలో తూర్పుగోదావరి (51,51,549), మూడో స్థానంలో గుంటూరు జిల్లా (48,89,230) నిలిచింది. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (23,42,868) నిలిచింది. మహిళల జనాభాలో కూడా రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.ఈ జిల్లాలో మహిళల సంఖ్య 25,87,702కాగా అతితక్కువ మహిళల జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (11,80,955) నిలిచింది. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే జనాభాలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (18,480), అతితక్కువగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ (170) నిలిచాయ.అక్షరాస్యతలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (80.96%) నిలవగా రెండో స్థానంలో రంగారెడ్డి (78.05%), మూడో స్థానంలో కృష్ణా జిల్లా (74.37%) నిలిచాయ. అతితక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (56.06%), ఆ తర్వాతి స్థానంలో విజయనగరం (59.49%) నిలిచాయ. మహిళల విషయం పరిశీలిస్తే మహిళల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లాగా హైదరాబాద్ (78.42%), అతితక్కువ ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (45.65%) నమోదయ్యాయ.(చిత్రం) గురువారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో జనగణన వివరాలు వెల్లడిస్తున్న జనగణన శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ. చిత్రంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ ఉన్నారు.
=======================================================
రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన పది జిల్లాలుజిల్లా జనాభా
రంగారెడ్డి 5296396
తూర్పు గోదావరి 5151549
గుంటూరు 4889230
కృష్ణా 4529009
విశాఖపట్నం 4288113
చిత్తూరు 4170468
అనంతపురం 4083315
కర్నూలు 4046601
మహబూబ్‌నగర్ 4042191
హైదరాబాద్ 4010238
============================================
No comments:
Post a Comment