Friday, April 1, 2011

కృష్ణా జిల్లా నేతల కుమ్ములాటపై నందమూరి హరికృష్ణ ఆగ్రహం


కృష్ణా జిల్లా నేతల కుమ్ములాటపై నందమూరి హరికృష్ణ ఆగ్రహం
హైదరాబాద్: పార్టీ కృష్ణా జిల్లా నాయకుల మధ్య కుమ్ములాటపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కడంపై ఆయన మండిపడ్డారు. పార్టీలో సమన్వయంతో పని చేసి, అందరినీ కలుపుకుని పోవాలి తప్ప విభేదాలకు తావిచ్చేలా వ్యవహరించడం సరి కాదని ఆయన కృష్ణా జిల్లా నాయకులకు చెప్పినట్లు సమాచారం. హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటనపై జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు వ్యతిరేకంగా వల్లభనేని వంశీ విజయవాడ నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. వంశీ, శాసనసభ్యుడు కొడాలి నాని తనపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ దేవినేని ఉమా మహేశ్వర రావు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వంశీ, ఉమ పరస్పరం సవాళ్లు కూడా విసురుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై విమర్సలు చేయడం సరి కాదని ఉమమహేశ్వర రావు అన్నారు. ఉమా మహేశ్వరరావుకు మద్దతుగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు రాజీనామా చేశారు. ఈ పరిణామాల పట్ల హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment