Tuesday, April 5, 2011

అధిష్టానం వద్ద మోకరిల్లండి.. పోటీ నుంచి తప్పుకుంటా!!


అధిష్టానం వద్ద మోకరిల్లండి.. పోటీ నుంచి తప్పుకుంటా!!
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి ఒక ఆఫర్ ప్రకటించారు. జగన్‌తో పాటు ఆయన వర్గానికి చెందిన నేతలంతా కాంగ్రెస్ అధిష్టానం వద్ద మోకరిల్లితే తాను ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. రాజకీయాల్లో బంధుబంధుత్వాలు పని చేయవని, రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని చెప్పుకుంటూ వచ్చిన వివేకా.. ఒక్కసారి ఇలా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తన అన్న వైఎస్‌ఆర్‌ రాముడైతే.. తాను లక్ష్మణుడు అని మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా వివేకా ప్రకటించి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తాజాగా, జగన్ వర్గంపై నిప్పులు చెరిగారు. జగన్ వర్గం నేతలు చేసిన తప్పులు అంగీకరించి కాంగ్రెస్ హైకమాండ్‌కు లొంగిపోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా తాను ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంతేకాకుండా, జగన్‌కు ఒక హితబోధ కూడా చేశారు. అన్ని వేళలా సెంటిమెంట్ కూడా పని చేయదని చిన్నపాటి ఉచిత సలహా కూడా ఇచ్చారు మంత్రివర్యులు.

No comments:

Post a Comment