Tuesday, April 5, 2011

పుట్టపర్తిలో ....




సత్యసాయి ఆరోగ్యంపై సీఎం సమీక్ష
హైదరాబాద్ : సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు.
అమ్మవారి విగ్రహానికి పునఃప్రతిష్ట
పుట్టపర్తి : పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు బాబా భక్తులు,ప్రజలు సిద్ధం అయ్యారు. రెండు నెలల క్రితం సత్తెమ్మ అమ్మవారి విగ్రహం దెబ్బతినటంతో ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. పుట్టపర్తి : పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు బాబా భక్తులు,ప్రజలు సిద్ధం అయ్యారు. రెండు నెలల క్రితం సత్తెమ్మ అమ్మవారి విగ్రహం దెబ్బతినటంతో ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. 
బాబా స్పృహలోనే ఉన్నారు: సఫాయా
పుట్టపర్తి : సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై తాజా బులిటెన్ విడుదల చేశారు. బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. హార్ట్ బీట్, బీపీ నార్మల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు.ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని సఫాయా పేర్కొన్నారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈరోజు మధ్యాహ్నాం పుట్టపర్తి రానున్నారు.
సత్యసాయిలో స్వల్ప చలనం
పుట్టపర్తి: సత్యసాయి బాబా కళ్లలో స్వల్ప చలనం కనిపించిందని ఆయన సమీప బంధువులు తెలిపారు. ఈ రోజు రాత్రి బాబా బంధువులు ఐసియులోనికి వెళ్లి ఆయనని పలకరించారు. దాంతో బాబాలో స్వల్పంగా చలనం కనిపించినట్లు వారు చెప్పారు. కాళ్లు కూడా కదిపినట్లు వారు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లమని వారు కోరారు.
'సత్తెమ్మ విగ్రహం తొలగింపుతో బాబాకు అరిష్టం'
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహం తొలగింపు వల్ల సత్యసాయి బాబాకు అరిష్టమని భక్తులు నమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం సత్తెమ్మ విగ్రహాన్ని తొలగించి చెరువులో నిమజ్జనం చేశారు. అలా చేయడం వల్లే బాబాకు ఆరోగ్యం క్షీణించిందని భక్తులు నమ్ముతున్నారు. ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించేందుకు భక్తులు ప్రయత్నిస్తున్నారు. చెరువులో పాత విగ్రహం కోసం వారు వెతుకుతున్నారు.
పుట్టపర్తికి పోలీస్ బలగాల తరలింపు
పుట్టపర్తి: సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబాని తమకు చూపించాలని వారు డిమండ్ చేస్తున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాహనాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి వాహన్నాన్నికూడా అడ్డుకున్నారు. దాంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ అనిత, ఆర్టీఓలను అడ్డుకున్నారు. జర్నలిస్టులను కూడా వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బలగాలు తరలి వచ్చాయి.
బాబా త్వరగా కోలుకోవాలని చిరు ఆకాంక్ష
హైదరాబాద్: సత్యసాయిబాబా త్వరగా కోలుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి
సోమవారం ఆయన బాబా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సత్యసాయి ట్రస్టు వర్గాలతో ఫోన్లో మాట్లాడి
 ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment