Tuesday, April 5, 2011

కడప జిల్లాలో ఊపందుకున్న"ఎలక్షన్‌ ఫీవర్‌"


కడప జిల్లాలో ఊపందుకున్న"ఎలక్షన్‌ ఫీవర్‌"
కడప జిల్లాలో ఎలక్షన్‌ ఫీవర్‌ ఊపందుకోనుంది. రేపటి నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు YSR కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి. తనను ఓడించేందుకు కాంగ్రెస్‌, TDPలు మళ్లీ కుమ్మక్కయాయన్న జగన్‌ ఆ పార్టీలపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెడతారన్నది ఆసక్తిగా మారింది. అటు తల్లి YS విజయమ్మపై బాబాయి వివేకా పోటీ చేస్తుండడంతో యువనేత చేయబోయే ప్రచారం జనాల్లో ఉత్కంఠ రేపుతోంది. మే 8న జరగబోయే కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రచార పర్వానికి బుధవారం తెరలేవనుంది. తమ కుటుంబాన్ని గెలిపించాలంటూ క్యాంపేయిన్‌ మొదలుపెట్టనున్నారు యువనేత జగన్‌. కడప పార్లమెంట్‌ పరిధిలోని కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకురు, బద్వేల్‌, కమలాపురం, ప్రొద్దుటూర్‌ నియోజకవర్గాల్లో జగన్‌ టూర్‌ ఖరారైంది. పులివెందులలో YS విజయమ్మపై YS వివేకానందరెడ్డి పోటీ చేయనుండడంతో జగన్ ఈ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్‌ చేయనున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం గడువు ముగిసేంత వరకు ఆయన కడప జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఈనెల 6, 15, 24 తేదీల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో.... పర్యటించనున్నారు. ఇక ఈనెల 8, 14, 17, 23, 30 తేదీలతోపాటు మే 2, 4 తేదీల్లో పులివెందుల కానిస్టెన్సీలో పర్యటించనున్నారు జగన్‌. ఏప్రిల్‌ 12, 22, 29 తేదీల్లో బద్వేల్‌ నియోజకవర్గంలో... ఈనెల 11, 21తోపాటు మే 5 తేదీల్లో కడప నియోజకవర్గంలో టూరేస్తారు యువనేత. ఇక ఇదేనెల 19, 27, మే 3 తేదీల్లో ప్రొద్దుటూర్‌ నియోజకవర్గంలో... ఏప్రిల్‌ 10, 20, 26 తేదీలతోపాటు మే 3వ తేదీల్లో మైదుకురు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు YSR కాంగ్రెస్‌ అధినేత. జగన్ ప్రచారం కోసం ఇప్పటికే ప్రచార రథం సిద్ధమైంది. పార్టీ అధినేత టూర్‌ను విజయవంతం చేసేందుకు యువనేత వర్గం MLAలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కమలమ్మ, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, MLC దేవగుడి నారాయణరెడ్డి, YSR కాంగ్రెస్‌ నాయకులు భూమా నాగిరెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి జగన్‌ టూర్‌ కోసం కసరత్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment