ఆ ఫోన్ వస్తే కట్ చేయండి
మీకు ఎప్పుడైనా, ఎవరినుంచైనా ఓ ఫోన్ రావచ్చు. మొబైల్ వెరిఫికేషన్ కోసం కాల్ చేశామని చెప్పొచ్చు. ఓ చిన్న పని చేయమని అడగొచ్చు. మీ మొబైల్‌లో #90 కాని #09 టైప్ చేయమని అడగొచ్చు. అలా ఎవరైనా అడిగితే వెంటనే కాల్‌ను కట్ చేయండి. దీన్ని కొన్ని సంఘవిద్రోహశక్తులు, తీవ్రవాదులు, మోసాలకు పాల్పడుతున్నవారు తెలివిగా వాడుకుంటున్నారు. మీరు #90 కాని #09 టైప్ చేసిన వెంటనే మీ సిమ్ వారి కంట్రోల్‌లోకి వెళిపోతుంది. మీ సిమ్ ద్వారా వాళ్లు కాల్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. పని వాడు చేసుకుంటాడు.. కేసు మీ మీదకు వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది దీని బారిన పడ్డారు. మీకూ అలాంటి కాల్ రాకముందే తేరుకోండి. ఇది ఊరికే చెబుతున్న మాట కాదు. కావాలంటే, ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోనూ మీరు వెరిపై చేసుకోవచ్చు. ఆ లింక్‌ను కూడా ఈ పోస్ట్‌లో ఇస్తున్నాం. లింక్‌ను ఓపెన్ చేసిన తర్వాత Dont'sలోచివరి పాయింట్‌ను చదవండి.
No comments:
Post a Comment