Saturday, April 30, 2011

అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం హెలికాప్టర్‌ గల్లంతు ...?


అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం హెలికాప్టర్‌ గల్లంతు
అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం దోర్జి ఖండు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గల్లంతైంది. 
శనివారం ఉదయం 9.50గంటలకు పవన్‌హన్స్‌ హెలికాప్టర్‌లో తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు.శనివారం ఉదయం 9.50గంటలకు పవన్‌హన్స్‌ హెలికాప్టర్‌లో తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు.అందులో సీఎంతో సహా 4గురు ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరు సిబ్బంది. 11.30కు అక్కడికి వెళ్లాల్సిన హెలికాప్టర్‌ అక్కడికి చేరలేదు. వాతావరనం కూడా బాగుండటంతో ఏమైందీ తెలియలేదు. హెలికాప్టర్‌ కోసం అన్వేషణ కొనసాగుతోంది.

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాల్పులు


ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం
నాలుగు తూటాలు, 17 కత్తి పోట్లు
ఓవైసీ ఆస్పత్రికి తరలింపు
క్షేమంగా ఉన్నట్లు లేఖ పంపిన అక్బర్
హైదరాబాద్ : మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై శనివారం బార్కాస్ వద్ద దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట వద్ద ఆయనతో పాటు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై కూడా దాడి జరిగింది. పాదయాత్ర చేస్తుండగా ఉదయం 11.15 నిమిషాలకు ఒవైసీపై నాలుగు రౌండ్లు కాల్పులతో పాటు కత్తులతో దాడి చేశారు. ఒవైసీ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయినట్లు సమాచారం.
అక్బర్ పాదయాత్ర గురించి ముందుగానే తెలుసుకున్న మహ్మద్ పహిల్వాన్ అనే ఎం.బి.టి నాయకుడు తన అనుచరులతో ఈ దాడికి తెగబడినట్టు ప్రాథమిక సమాచారం. మహ్మద్ గుర్రంపై వచ్చి అక్బర్‌పై కాల్పులు జరపగా, ఆయన అనుయాయులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అక్బర్ శరీరంలోకి నాలుగు తూటాలు దూసుకుపోయాయి. 17 కత్తిపోట్లు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అక్బరుద్దీన్, మహ్మద్ ల మధ్య పదెకరాల భూవివాదానికి సంబంధించిన గొడవలు గత కొంతకాలంగా జరుగుతున్నాయని, అక్బరుద్దీన్- మహ్మద్ మధ్య పాతకక్షలు కూడా ఉన్నాయని, గత ఎన్నికల నుండే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం.
ఈ ఘటనతో ఎంఐఎం పార్టీ దిగ్భ్రాంతికి గురైంది. పెద్దఎత్తున మజ్లిస్ కార్యకర్తలు ఆస్పత్రికి చే రుకుంటున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. నగరమంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడి చేసినవారు పరారీలో ఉన్నారు. 

Thursday, April 28, 2011

భగవాన్ సత్యసాయి మహా శకం ముగిసింది!!!

భగవాన్ సత్యసాయి మహా శకం ముగిసింది!!!


ముగిసిన సాయి శకం
పుట్టపర్తి, 86 సంవత్సరాల సాయి సేవా ప్రస్థానం... అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా... ప్రేమ-సేవ మూడో కన్నుగా సాగిన సాయి తత్పరత... దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తుల పారవశ్యం... బాబా ప్రతి అడుగులో అడుగు వేసిన భక్తజనం... అందరినీ ఆవేదనలో ముంచెత్తుతూ చివరి క్షణాల్లో అనారోగ్యంతో ఆసుపత్రిపాలు... గత నెల రోజులుగా భక్తుల వేదన... చివరకు సాయి మహాభినిష్క్రమణం.’ ఇలా కొనసాగిన భగవాన్ సత్యసాయి మహా శకం ముగిసింది. బుధవారం ఉదయం సాయి మహా సమాధిలోకి వెళ్లిపోవడంతో భౌతికంగా ఇక ఆయన్ను ఎవరూ సందర్శించలేని పరిస్థితి. అయితే అందరి మదిలోనూ ఆయన ఉన్నారంటూ తమ వేదనలోనూ మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్న భక్తులు. మళ్లీ సాయి జన్మిస్తారన్న నమ్మకంతో భక్తులు ఉన్నారు.









1926 నవంబర్ 23న జన్మించిన సత్యసాయి ప్రారంభంలో ఎవరికీ తెలియకపోయినప్పటికీ షిర్డీసాయి అవతారంగా సత్యసాయి ప్రకటించుకోవడంతోనే ప్రపంచంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కేవలం భక్తికే కాకుండా సేవాధర్మానికి కూడా పెద్దపీట వేసిన సాయికి అనంతకోటిగా భక్తులు ఆకర్షితులయ్యారు. నలుగురికీ ప్రేమ పంచడం మానవ ధర్మంగా సాయి ఎప్పుడూ చేసే ఉపదేశాలు లక్షలాది మంది భక్తులను సమకూర్చాయి. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలపై సాయి చేసిన ప్రయత్నాలు, సాటి మానవుడిని ఆదుకునేందుకు నిర్వహించిన అనేక కార్యక్రమాలు కూడా భక్తకోటిని తయారుచేశాయి. దీంతో చిన్న పల్లెగా ఉన్న పుట్టపర్తి ‘ప్రశాంతి’నిలయంగా మారి పెద్ద పట్టణంగా మారిపోయింది. దేశ విదేశాల సంస్కృతికి ప్రశాంతి నిలయం ఆలవాలంగా మారిపోయింది. ఎప్పుడు చూసినా వేల సంఖ్యలో భక్తులతో కళకళలాడుతూనే కనిపించేది. సాయి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులైన దేశ విదేశీ భక్తులు వేల కోట్ల రూపాయలను విరాళాలుగా గుమ్మరించడంతో సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
వచ్చే నిధులను వివిధ అభివృద్ధి రంగాలకు కేటాయిస్తూ సంక్షేమాన్ని పరుగులు తీయించడంలో బాబా కఠోరంగా శ్రమించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడడంతోపాటు, భక్తిని పెంచడంలో సత్యసాయి ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. ఇందులో భాగంగానే విద్య, వైద్యం, తాగునీరు, క్రీడలు, ఆలయాలు, మందిరాల నిర్మాణం, ప్రజల్లో భక్త్భివాన్ని పెంపొందించడం వంటి చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎడారి సీమను సస్యశ్యామలం చేసేందుకు బాబా చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ, ఎప్పటికీ అనంతపురం జిల్లా వాసుల మదిలో చిరస్థాయిగానే నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. ఇక అత్యుత్తమ విద్య, ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉండేలా రూపొందించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వంద రోజుల్లోనే రికార్డు స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన క్రీడా ప్రాంగణం సాయి శకంలో కీలక అంశాలుగానే మిగిలిపోతాయి. భక్తితోపాటు ప్రజల జీనవ విధానంలో కూడా మార్పులు రావాలని ఎప్పుడూ కోరుకునే బాబా కొంతవరకు అనుకున్న మార్పులు తీసుకురాగలిగారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది భక్తులు సాయి మార్గంలో నడిచేందుకు ముందుకు వస్తున్నారంటేనే సాయి సాధించిన విజయం అవగతమవుతుంది. బాబా భౌతకంగా లేకపోయినా పుట్టపర్తి మాత్రం భక్తులకు ఎప్పుడూ ఆలవాలంగానే మిగిలిపోతుందని, భవిష్యత్తులో మరో షిర్డీగా వర్ధిల్లుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వారి భావనల మాదిరిగానే పుట్టపర్తి ప్రశాంతి నిలయం రానున్న కాలంలో మరో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశాలు పుష్కలంగా కలిపిస్తున్నాయి. సాయి శకం ముగిసినా ఆయన జనం హృదయాల్లో మాత్రం చిరస్థాయిగానే వర్ధిల్లుతారు.


Wednesday, April 27, 2011

బాబాను ప్రశంసలతో ముంచెత్తిన విదేశీ పత్రికలు


బాబాను ప్రశంసలతో ముంచెత్తిన విదేశీ పత్రికలు
 బ్రిటిష్ మీడియా సత్యసాయి బాబాను ఆకాశానికెత్తేసింది. ఈ శతాబ్దంలో గుర్తించ దగిన మత ప్రముఖుల్లో ఆయన కూడా ఒకడంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఆదివారం మరణించిన బాబా (84) భారత్‌లో ఏంతో ప్రాచుర్యం పొందిన వ్యక్తి మాత్రమే కాకుండా..పూర్తిగా అర్థంకాని వ్యక్తి కూడా అని డైలీ టెలిగ్రాఫ్ పత్రిక వ్యాఖ్యానించింది. సాయి భక్తులకు మాత్రం ఆయన జీవించి ఉన్న దేవుడు. ఆయన తరచుగా క్రీస్తు, కృష్ణ, బుద్ధ వంటి వారితో తనను పోల్చుకుంటూ ఈ యుగానికి సంబంధించిన అవతారమూర్తిగా తనను తాను చెప్పుకొనేవారు అని పేర్కొంది. ఆయన పైకి అన్నీ తెలుసని నటించే వ్యక్తి అంటూ వ్యతిరేకులు ఎంతగా విమర్శించినా అత్యంత చరిష్మా ఉన్నవాడిగా అభివర్ణించింది. భారత్‌కు చెందిన అత్యంత ప్రాచుర్యమైన, వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్తల్లో బాబా ఒకరుగా దిటైమ్స్ వ్యాఖ్యానించింది. సాయిబాబా శాంతి, ప్రేమ, అహింస గురించి బోధించారని పేర్కొంది. కేవలం భారత్ నుంచే కాదు.. అమెరికా, జర్మనీ, స్కాండినేవియా, ఇటలీ దేశాలనుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆయన్ను సందర్శించేవారని దిటైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

మానవత మూర్తీభవించిన దైవ స్వరూపమే పుట్టపర్తి సత్యసాయి బాబా,,,,





సత్యసాయిబాబా,,,,


Tuesday, April 26, 2011

తన బోధనలతో మానవాళిని సన్మార్గం వైపు నడిపిస్తూనే ,,,,



శాంతి... సేవ అదే బాబా అభిమతం




సమత.. మమత.. మానవత మూర్తీభవించిన దైవ స్వరూపమే పుట్టపర్తి సత్యసాయి బాబా. ఓవైపు తన బోధనలతో మానవాళిని సన్మార్గం వైపు నడిపిస్తూనే చేతలతో ఆర్తులకు అండగా నిలిచారు. సామాన్యుడి జీవితం సాఫీగా సాగడానికి అడుగడుగునా ఆపన్నహస్తం అందించారు. స్వాత్రంత్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా కరవు జిల్లాలో గుక్కెడు మంచినీళ్లు కూడా అందని గ్రామాలకు రక్షిత నీటితో దాహార్తి తీర్చారు. ప్రకృతి ప్రకోపానికి నీడ కోల్పోయిన వేలాది మందికి ఇళ్లు కట్టించి నీడనిచ్చారు. నేటి యాంత్రిక జీవనంలో మహమ్మారి రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న లక్షలాది మందికి ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించాలన్న ధ్యేయంతో దేశంలోనే ఎన్నదగిన సదుపాయాలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఏటా వేలాదిమందికి ప్రాణదానం చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా దేశ ప్రగతికి, వ్యక్తి ఎదుగుదలకు ఆటంకంగా నిలుస్తున్న నిరక్షరాస్యతను పారదోలడానికి ప్రాథమిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విద్యను ఉచితంగా చేప్పే ఏర్పాటు చేసి పలు కుటుంబాల్లో అక్షర జ్యోతి వెలిగించారు.
 కరవు సీమ ప్రజల దాహార్తి తీరుస్తూ సత్యసాయి అపర భగీరథుడిగా మన్ననలు అందుకున్నారు. ఫ్లోరైడ్‌ భూతం నుంచి అనంతపురం జిల్లాను కాపాడేందుకు సత్యసాయి బాబా శ్రమించారు. రూ.కోట్లు ఖర్చు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించటంలో సఫలీకృతులయ్యారు. రూ.500 కోట్లు వెచ్చించి సత్యసాయి పథకం ద్వారా అనంతపురం జిల్లాలోని 1447 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. దాదాపు 3,200 కిలోమీటర్లకు పైగా పైపులైను వేయించారు. బాబా తన 30వ ఏటనే పుట్టపర్తి కేంద్రంగా పరిసర గ్రామాల ప్రజలకు వైద్యం అందించేందుకు మొదట ప్రాథమిక ఆసుపత్రిని ప్రారంభించారు. అది 1991 నాటికి అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేదలకు అందుబాట్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందిస్తూ ఆసియాలోనే ప్రత్యేకత చాటుకుంది. బెంగళూరులోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ సైన్సెస్‌ పేరిట 306 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పారు. 2001 జనవరిలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి దీనిని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మాణానికి రూ.500 కోట్లు వెచ్చించారు. గుండె, మెదడుకు సంబంధించి ఇక్కడ చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారు. అదేవిధంగా 1970లో వైట్‌ఫీల్డులో మహిళలు, పిల్లలకు సేవలందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం దీన్ని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు.
విద్య అంటే నాలుగు గోడల మధ్య నేర్చుకుని,పుస్తకాలతో కుస్తీపడితే వచ్చేదికాందటారు సత్యసాయి. అందువల్లనే సత్యసాయి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను గ్రామాల్లో జనం మధ్య తిరగమంటారు. జీవిత పాఠాలు నేర్చుకోమంటారు. అదేవిధమైన బోధన సాగేలా చూస్తున్నారు. మహోన్నత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మానవతా విలువలను మేళవించి నాణ్యమైన విద్యా ప్రమాణాలను అందిస్తున్న పుట్టపర్తి సత్యసాయి విశ్వవిద్యాలయం అరుదైన ఘనకీర్తి దక్కించుకుంది. ఇక్కడ ఓనమాల నుంచి డాక్టరేట్‌ పట్టా వరకు విద్య అందిస్తున్నాయి. ఇదంతా ఉచితమేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 1981లో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌(సత్యసాయి యూనివర్సిటీ)ని ఏర్పాటుచేశారు. ఈ విశ్వవిద్యాలయ పరిధిలో ప్రశాంతి నిలయం క్యాంపస్‌, అనంతపురంలోని సత్యసాయి మహిళా కళాశాల, బెంగళూరులో బృందావన్‌ కళాశాల, దేవనహళ్లి సత్యసాయి క్యాంపస్‌లు ఉన్నాయి. ఏడు విభాగాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) అయిదు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ), మూడు ప్రొఫెషనల్‌ కోర్సులు ఇక్కడ ఆఫర్‌ చేస్తున్నారు. ఏటా నవంబరు మూడో వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసి ప్రవేశ పరీక్షల ద్వారా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. క్రమశిక్షణ, అంకితభావం, సంఘసేవ తదితర వాటిల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
సత్యసాయి బాబా జీవన ప్రస్థానం 
ప్రేమతత్వం విశ్వశాంతి సారాంశం. అలాంటితత్వమే సత్యసాయిబాబా అభిమతం. ఆధ్యాత్మిక బోధనలతో లక్షలాదిమంది భక్తులకు ఆరాధ్యునిగా సుపరిచితులైన బాబా 1926 నవంబరు 23న జన్మించారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి(నేటి పుట్టపర్తి) స్వగ్రామం. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. సాధారణ కుటుంబంలో జన్మించిన బాబా పలు ఆధ్యాత్మిక బోధనలు చేసి సత్యసాయి బాబాగా అవతరించారు.
పేరు: సత్యసాయిబాబా 
ప్రథమ పేరు: సత్యనారాయణరాజు 
తల్లిదండ్రులు: పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ 
జననం: 1926 నవంబరు 23న కార్తీక సోమవారం 
తల్లిదండ్రులకు బాబా రెండో సంతానం. 
ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు 
అన్న: కీ.శే. శేషంరాజు 
అక్క: కీ.శే.వెంకమ్మ 
తమ్ముడు: కీ.శే.జానకిరామయ్య 
చెల్లెలు: కీ.శే.: పార్వతమ్మ
విద్యాభ్యాసం: 1 నుంచి 5వ తరగతి వరకు (1931 నుంచి 1936 వరకు) పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో 
* 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (1936 నుంచి 1939) బుక్కపట్నంలో విద్యాభ్యాసం 
* 9వ తరగతి ఉరవకొండలో (1939 నుంచి 1940 వరకు)
అనంతరం చదువు అర్ధంతరంగా ముగించారు. 
* సత్యసాయిగా అవతారం: 1940లో తనను తాను సత్యసాయిగా ప్రకటించుకున్నారు.
నాటి కుగ్రామం నేడు అంతర్జాతీయ కేంద్రం 
చిత్రావతి నది ఒడ్డున కొండ కోనల్లో వెలసిన కుగ్రామం గొల్లపల్లి. ఇదే నేడు పుట్టపర్తిగా మారింది. ప్రపంచ పటంలోనే విశిష్టస్థానం చాటుకుంది. ఇక్కడే పెద వెంకమరాజు ఈశ్వరమ్మల దంపతులకు పుట్టిన సత్యనారాయణరాజు. బాబాగా అవతారమెత్తి ఆధ్యాత్మిక ప్రబోధకునిగా శాంతి సందేశాలు చేయడం మొదలుపెట్టారు. 1945లో ప్రశాంతి నిలయం నిర్మాణం చేపట్టారు. 1950లో దీన్ని ప్రారంభించారు. అది మొదట కుగ్రామం. అంచలంచెలుగా పట్టణమైంది. సత్యసాయి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీగా ఏర్పడింది. క్రమంగా పుట్టపర్తి పర్యాటక కేంద్రంగా విలసిల్లింది. రోడ్డు, ప్రత్యేక రైలు మార్గంతోపాటు విదేశీభక్తుల రాకపోకలకు వీలుగా విమానాశ్రయం ఇక్కడ వెలసింది. పట్టణవీధుల్లోని సత్యసాయి విద్యాలయాలు, ప్రశాంతి నిలయంలోని ఒక్కో భవనం ప్రత్యేక ఆకృతిలో నిర్మితమై ఆధునిక దేవాలయాలను తలపిస్తున్నాయి.
బాబా తొలి ఉపదేశం 
అనంతపురం జిల్లా పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విశ్వఖ్యాతి గడించిన సత్యసాయిబాబా తన అవతార ప్రకటన చేసినది ఉరవకొండలో. సత్యం,ప్రేమ, సేవ మానవాళికి పంచిన సత్యసాయిబాబా 14 ఏళ్ల వయస్సులో ఈ అవతార ప్రకటన చేశారు. బాబా 'అవతార పురుషుడి' ప్రకటన చేసే నాటికి ఉరవకొండ శ్రీకరిబసవస్వామి బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన సోదరుడు శేషంరాజు వద్ద ఉండేవారు. ఇక్కడే 8వ తరగతి చదువుతుండేవారు. విద్యార్థిగా ఉన్నప్పుడే మహిమలు చూపుతూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేసేవారని చెబుతారు. 1940 అక్టోబర్‌ 20న బడికి బయల్దేరి పాఠశాల గేటు బయట నుంచే వెనక్కి మళ్లాడు. ఇంటికొచ్చి పుస్తకాల సంచి విసిరి వేశాడు. 'నేను సత్యనారాయణుడిని కాదు సాయిబాబాను! మాయ వీడినది. నేను కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని నిర్వర్తించాల్సి ఉంది. నా భక్తులు పిలుస్తున్నారు. నేను వెళ్లాలని' బిగ్గరగా అరిచారు. ఈ మాటవిని ఆశ్చర్యపోయిన వదిన ఎంతగా వారించినా వినలేదు. భవబంధాలను తెగించి వెళ్తున్నానని చింతించవద్దని బయలుదేరాడు. స్థానిక అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ బంగ్లా ఆవరణ తోటలో పెద్ద బండరాయిపై కూర్చొని ధ్యానంలో మునిగిపోయారు. మానవజాతిని అసత్యం నుంచి సత్యం వైపునకు.. చీకటి నుంచి వెలుగు వైపునకు నడిపించే గురుచరణాలను పూజించి నిబ్బరమైన సంసార సాగరాన్ని దాటటానికి ప్రయత్నించండి అంటూ భక్తులకు ప్రబోధించారు. అలాగే వారితో 'మానస భజరో గురుశరణం భవసాగర తరణం' అనే భజన గీతాన్ని పాడించారు. ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉరవకొండ వచ్చారు. పుట్టపర్తికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వెళ్లడానికి నిరాకరించడంతో తమ కళ్లెదుటే ఉండి ఆధ్యాత్మిక బోధనలు చేసుకోవచ్చని తల్లి కోరడంతో పుట్టపర్తికి చేరారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అక్కడే ఉండిపోయి సాయిబాబాగా పూజలు అందుకుంటున్నారు.


పుట్టపర్తి సత్యసాయి బాబా జీవిత చరిత్ర 

 సత్యసాయి బాబా 1926, నవంబర్‌ 23 న పెద్ద వెంకపరాజు, ఈశ్వరమ్మ దంపతులకు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత జన్మించిన ఈ బిడ్డకు సత్యనారాయణ రాజు ( సత్యసాయి బాబా) గా నామాకరణం చేశారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతటికి అవే మోగాయని చెబుతున్నారు. బాబా బుక్కపట్నం గ్రామంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయస్సులోనే నాటకాలు , సంగీతం , కవిత్వం , నటన వంటి కళల్లో ప్రావీణ్య కనబర్చారు. 
అక్కడ తన అన్న శేషమ రాజు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతుండుగా అప్పటి సత్యనారాయణ రాజు సైతం అక్కడే ఉరవకొండ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. అయితే 1940 , మార్చి 8న యదావిధిగా పాఠశాలకు వెళ్ళిన సత్యనారాయణ రాజు కొద్ది సేపటికి ఇంటికి వచ్చి పుస్తకాలను పక్కన పెట్టి తాను సత్యనారాయణరాజును కాను సత్యసాయి బాబాను అంటూ ప్రకటించకున్నారు. అక్కడికి సమీపంలోని ఓ రాతి గుండు పై కూర్చుని ‘‘ మానస బజరే హరిచరణం ’’ అన్న కీర్తనను ఆలపించారు. 
అక్కడ నుంచి బాబా కుటుంబీకులు పుట్టపర్తికి తీసుకురాగా బాబా మహిమలు గుర్తించిన భక్తులు రావడంతో అధికం కావడంతో 1944లో భక్తులు బాబాకు ఆశ్రమాన్ని నిర్మించారు. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో 1948 లో ప్రస్తుతం వున్న ప్రశాంతి నిలయం నిర్మాణం చేపట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా ఆశీస్సులు కోసం వచ్చే భక్తులు సంఖ్య పెరగడంతో ప్రశాంతి నిలయం సైతం అన్ని హంగులతో విశాలంగా తీర్చిదిద్దారు. కాగా తాను షిరిడి సాయిబాబా అవతార పురుషుడుగా ప్రకటించుకున్న సత్యసాయి బాబా తిరిగి తాను ప్రేమా సాయి బాబాగా అవతరిస్తానని 1976 లో భక్తులకు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశంలో తెలిపారు. 
సత్యసాయి బాబా ఆశీస్సుల కోసం దే శ , విదేశాలు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో బాబా కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దకెక్కిడంతో నేడు దాదాపు 146 దేశాల్లో సత్యసాయి బాబా భక్తులు వున్నారు. నాటి కుగ్రామంగా వున్న పుట్టపర్తి నేడు అంతర్జాతీయ చిత్ర పటంలో గుర్తించబడిందంటే అ ఘనత సత్యసాయి బాబా బోధించే అధ్యాత్మిక బోధనల ప్రభావమే అనడంలో అతిశయోక్తిలేదు.


Saturday, April 16, 2011

ఉప్పొంగిన ఉత్సాహం


జగన్ నామినేషన్ సందర్భంగా ఉప్పొంగిన ఉత్సాహం

జగన్ నామినేషన్ సందర్భంగా ఉప్పొంగిన ఉత్సాహం



యువనేత నామినేషన్ సందర్భంగా జనసంద్రమైన కడప రోడ్లు
స్థానికులతోపాటు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన అభిమానులు
నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ సమాధిని సందర్శించిన జగన్
భావోద్వేగానికి గురైన జగన్ కుటుంబ సభ్యులు, చలించిపోయిన అభిమానులు
కడప, న్యూస్‌లైన్‌బ్యూరో: వైఎస్సార్ పార్టీ అధినేత, ఆ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర వారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కడప కలెక్టర్‌రేట్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. 11.04 గంటలకు ఒకసెట్ దాఖలు చేయగా, 11.22 గంట లకు మరో సెట్‌పై సంతకం చేసి రిటర్నింగ్ అధికారి శశిభూషణ్ కుమార్‌కు అందజేశారు. జగన్ వెంట ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, న్యాయవాది పుల్లారెడ్డి ఉన్నారు.
జనసంద్రంగా కలెక్టరేట్ 
యువనేత నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాల యం చుట్టూ ఉన్న రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. పార్టీ కార్యకర్తలు అభిమానుల కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వెల్లువులా వచ్చిన అభిమానులను నిలువరించడానికి పోలీసులు పడరాని పాట్లుపడ్డారు. 
నాన్నకు నివాళులు..అమ్మ దీవెనలు

ఉదయం 9.30గంటల ప్రాంతంలో మొదట విజయమ్మ, షర్మిళ, భారతిరెడ్డి వైఎస్‌ఆర్ సమాధివద్ద నివాళులర్పించారు. విజయమ్మ ప్రార్థన చేస్తుండగా సమాధి వద్దకు జగన్ రాగానే ఆమె ఉద్వేగానికి గురై కుమారుని పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చుతూ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. అనంతరం నామినేషన్‌కు సంబంధించిన ఫైలును సమాధిపై ఉంచి జగన్‌ను దగ్గరకు తీసుకుని విజయమ్మ ముద్దుపెట్టి ఫైలు అందించారు. కాగా, ఇడుపుల పాయకు బయలుదేరే ముందు పులివెందులలోని ఇంట్లో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా అమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న అభిమానులు తిరుపతి ప్రసాదాలు, కుంకుమ జగన్‌కు ఇచ్చారు. వాహనం ఎక్కగానే గుమ్మడికాయ దిష్టి తీశారు.
తరలివచ్చిన నేతలు.. అభిమానులు

యువనేత నామినేషన్ కార్యక్రమానికి, అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద నివాళులర్పించేందుకు జగన్ మామ ఇ.సి.గంగిరెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వై.ఎస్.సుశీలమ్మ, వై.ఎస్.ఆనంద్‌రెడ్డి, వై.ఎస్.రాజేష్‌రెడ్డి, జార్జిరెడ్డి సతీమణి వై.ఎస్.భారతమ్మ, జగన్‌మేనత్త విమలమ్మ, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, కడప మాజీమేయర్ రవీంద్రనాథరెడ్డి, సజ్జల దివాకర్‌రెడ్డి, వై. ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మారెప్ప, పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, బూచేపల్లె శివప్రసాద్‌రెడ్డి, ఆళ్ల నాని, శేషారెడ్డి, సత్యవతి, షాజహాన్, శోభానాగిరెడ్డి, బాబురావు, కాటసాని రామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గండి బాబ్జి, విష్ణువర్దన్‌రెడ్డి, శివరామరాజు, బాజిరెడ్డి గోవర్దన్, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రెహ్మాన్, కంచర్ల ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైఎస్ చైర్మన్ శంకరరెడ్డి, సినీనటి రోజా, వాసిరెడ్డి పద్మ, శ్రీలక్ష్మీరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, గోనె ప్రకాశరావు, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఇ.వి.సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు
.
వైఎస్ జగన్ చరాస్తి విలువ రూ. 365 కోట్లు
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ చరాస్తి విలువ రూ. 365,68,55,224లుగా తెలిపారు. స్థిరాస్తులు, వాటిపై చేసిన అభివృద్ధి తదితరాలు రూ. 8,35,97,412 లుగా వివరించారు. ప్రస్తుతం ఈ స్థిరాస్తి మార్కెట్ విలువ రూ. 25,04,50,893 కాగా, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డి పేరున ఉన్న చరాస్తి విలువ రూ. 41,33,46,809లుగా ప్రకటించారు. భారతి పేరున ఉన్న స్థిరాస్తి విలువ రూ. 1,59,53,540లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థిరాస్తి విలువ రూ. 13,63,94,338లుగా తెలిపారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి జగన్ తీసుకున్న రుణాలు రూ. 2,40,73,390లుగా తెలిపారు. వైఎస్ భారతి తీసుకున్న రుణాల విలువ రూ. 7,71,39,995లుగా పేర్కొన్నారు.

Friday, April 15, 2011

చంద్రబాబుకు మరోషాక్ ఇవ్వనున్న నాగం


చంద్రబాబుకు మరోషాక్ ఇవ్వనున్న నాగం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడుకి ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన రెడ్డి మరో షాక్ ఇవ్వనున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం సొంత ఎజెండా రూపొందించుకునే పనుల్లో ఆయన ఉన్నారు. త్వరలో తన సొంత నియోజకవర్గం నాగర్ కర్నూలులో కార్యాచరణ ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. మే 9 తన ఇంటి నుంచి తెలంగాణ సాధన యాత్ర ప్రారంభించాలన్న యోచనలో నాగం ఉన్నారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవారిని కలుపుకుపోతానని ఆయన అంటున్నారు. దీని కోసం అధినేత అనుమతి అవసరంలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్‌


ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్‌
గత ఎన్నికల్లో తండ్రి పేరు వల్ల ఎంపి సీటు సంపాదించి గెలిచిన జగన్మోహన్‌ రెడ్డికి ఏనాడు ప్రజా జీవితంతో సంబంధాలు లేనేలేవన్న విషయం గుర్తుంచుకుని విమర్శలకు దిగితే బాగుంటుందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.
 ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ కేవలం ముఖ్యమంత్రి కావాలనే తన ఉద్దేశ్యం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా కాదన్నందునే ఉప ఎన్నికల భారాన్ని ప్రజల నెత్తిన మోపారని ఆరోపించారు. ఎలాంటి ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్‌కు సోనియాను విమర్శించే అర్హత లేదన్నారు.

Thursday, April 14, 2011

ఆ ఫోన్ వస్తే కట్ చేయండి


ఆ ఫోన్ వస్తే కట్ చేయండి
మీకు ఎప్పుడైనా, ఎవరినుంచైనా ఓ ఫోన్ రావచ్చు. మొబైల్ వెరిఫికేషన్ కోసం కాల్ చేశామని చెప్పొచ్చు. ఓ చిన్న పని చేయమని అడగొచ్చు. మీ మొబైల్‌లో #90 కాని #09 టైప్ చేయమని అడగొచ్చు. అలా ఎవరైనా అడిగితే వెంటనే కాల్‌ను కట్ చేయండి. దీన్ని కొన్ని సంఘవిద్రోహశక్తులు, తీవ్రవాదులు, మోసాలకు పాల్పడుతున్నవారు తెలివిగా వాడుకుంటున్నారు. మీరు #90 కాని #09 టైప్ చేసిన వెంటనే మీ సిమ్ వారి కంట్రోల్‌లోకి వెళిపోతుంది. మీ సిమ్ ద్వారా వాళ్లు కాల్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. పని వాడు చేసుకుంటాడు.. కేసు మీ మీదకు వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది దీని బారిన పడ్డారు. మీకూ అలాంటి కాల్ రాకముందే తేరుకోండి. ఇది ఊరికే చెబుతున్న మాట కాదు. కావాలంటే, ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోనూ మీరు వెరిపై చేసుకోవచ్చు. ఆ లింక్‌ను కూడా ఈ పోస్ట్‌లో ఇస్తున్నాం. లింక్‌ను ఓపెన్ చేసిన తర్వాత Dont'sలోచివరి పాయింట్‌ను చదవండి.

Monday, April 11, 2011

కన్యాకుమారి వద్ద మునిగిపోయిన ఓ నౌక: నౌకలోని వారు సురక్షితం..


సముద్రంలో మునిగిన ఐరన్ ఓర్ నౌక

కన్యాకుమారి వద్ద మునిగిపోయిన ఓ నౌక: నౌకలోని వారు సురక్షితం.. 
     విశాఖ నుంచి జపాన్ వెళుతున్న ఓ నౌక కన్యాకుమారి వద్ద మునిగిపోయింది. గత నెలలో ఇనుపఖనిజంతో బయల్దేరిన ఈ నౌక కన్యాకుమారి ప్రాంతంలో ప్రమాదానికి లోనైంది. సముద్రంలోని భారీ రాళ్లను ఢీకొనడంతో ఓడ సముద్రంలోకి మునిగిపోసాగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై నౌకలోని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 

నవమి నాడయినా బాబా దర్శనం ఇప్పించరూ...


నవమి నాడయినా బాబా దర్శనం ఇప్పించరూ...
ఈ రోజు అనగా సోమవారం సాయంత్రం వైద్యులు విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, సత్యసాయి బాబా వారి ఆరోగ్యం చాల త్వరగా మెరుగవుతోంది అని తెలిసింది.ఆయన బీ.పీ. మరియు షుగర్ లెవెల్స్ కూడా సరియిన స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా ఆయన గుండె కొట్టుకోవడం కూడా సరిగ్గా ఉంది. 
ఇక, కొద్ది రోజుల క్రితం వైద్యానికి సరిగ్గా స్పందించని ఆయన అంతర్గత  అవయవాలు కూడా ఇప్పుడు చక్కగా స్పందిస్తూన్నాయి. ఆయన కిడ్నీలు కూడా ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నాయి. ఇక, ఆయన ఊపిరి తిత్తులలో ఉన్న ఇంఫెక్షను కూడా పూర్తిగా తొలగి పోయింది. అందువల్ల శ్వాస తీసుకోవడం కూడా ఇప్పుడు సులువయింది. అయినప్పటికీ, జాగ్రత్త కోసం వెంటిలేటర్ సప్పోర్ట్ ఉంచారు. అయితే, ఇటీవల ఆయన లివర్( కాలేయము)కి సోకిన జాండిస్ (పచ్చ కామెర్లు) గురించి సరయిన సమాచారమేది విడుదల చేసిన బులెటిన్ ఇవ్వక పోవడంతో, బాబా భక్తులు తీవ్ర అసంతృప్తికి, అందోళ్ళనకి లోన్నయారు. అన్ని బాగ్గున్నాయని చెపుతున్న  డాక్టర్లు బాబాని కనీశం వీడియో ద్వారనైనా ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాజా బులెటిన్ ప్రకారం డాకర్లు చెప్పిందంత నిజమే అయితే రేపు శ్రీ రామ నవమి శుభ సందర్బంగా నయినా తప్పని సరిగా తమకి బాబా దర్శనం కల్పించాలని ఆసుపత్రి సూపర్-ఇండెంట్ డా.సఫాయ మీద తీవ్ర వొత్తిడి తెస్తున్నారు. అందువల్ల, బహుశః రేపు ఏదో ఒక సమయంలో సత్యసాయి బాబా వారి దర్శనం వీడియో ద్వారనైనా జరిగే అవకాశముందని అనుకోవచ్చు.

విశాఖ ఉక్కు ఎస్‌ఎంఎస్‌లో భారీ ప్రమాదం
 ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కులో అదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, రూ.100కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ‘ఎ’ షిప్ట్‌డ్యూటీ నిర్వహిస్తున్న 8మంది కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టి పరుగులు తీయడంతో తృటిలో ప్రాణనష్టం తప్పింది. నవరత్న హోదాకలిగిన విశాఖ ఉక్కు చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే ప్రథమం. స్టీలు మెల్టింగ్‌షాప్‌(ఎస్‌ఎంఎస్‌) మెషిన్‌-2లో హాట్‌మెటల్‌ను తీసుకెళ్లే లేడల్‌ లెైనింగ్‌బ్రిక్స్‌ పగిలిపోవడంతో 120టన్నుల ఉక్కు నేలపాలెైంది. లేడల్‌ 150టన్నుల ఉక్కును సిసిడికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉక్కు దిమ్మలుగా మారి బయటకు వస్తుంది. అయితే, లేడల్‌ లెైనింగ్‌ బ్రిక్స్‌ పగిలిపోవడంతో 120టన్నుల ద్రవం ఉక్కు ఎస్‌ఎంఎస్‌ మెషిన్‌-2ప్రాంతంలో బయటకు చిమ్మింది. 
దీని కారణంగా ఇటీవల 80కోట్ల రూపాయల వ్యయంతో అమర్చిన ఆటో మెషీన్‌ పనికిరాకుండా పోయే ప్రమాదముందని ఉక్కు వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదవశాత్తు సైడ్‌ వాల్వ్‌ క్లోజ్‌ అయినప్పుడు లేడల్‌ యాంగిల్‌ కంట్రోల్‌ రూం నుంచి మార్చే అవకాశం ఉంది. యాంగిల్‌ మారితే ద్రవ ఉక్కు బయటకు పోయి మెషినరీ సురక్షితంగా ఉండేదని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లోపించిన లెైనింగ్‌ బ్రిక్స్‌, సమయానికి స్పందించని అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రమాద తీవ్రతను పెంచాయి. 1700 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఉక్కుద్రవం కారణంగా మంటలు వ్యాపించి కేబుల్స్‌, ఇన్‌స్ట్రుమెంట్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి.‘ఎ’షిప్ట్‌లో ఫోర్‌మేన్‌, చార్జ్‌మేన్‌, జూనియర్‌మేనేజర్‌, టెక్నీషియన్లు ఉన్నారు. ఉక్కు ప్రమాదానికి 6500హీట్లతో మార్చాల్సిన లెైనింగ్‌బ్రిక్స్‌ అంతకు మించిన హీట్ల వరకూ మార్చకపోవడంతో ప్రమాదం సంభవించినట్టు కార్మికసం ఘాలు ఆరోపిస్తున్నాయి. మెషిన్‌-2లో జరిగిన ప్రమాదానికి నిరసనగా మెషిన్‌-5, మెషిన్‌-6లో ‘ఎ’షిప్ట్‌లో పనులు నిలిపివేశారు. కాగా, యంత్రాలు పునర్నిర్మించేందుకు 3నెలల కాలం పడ్తుందని అధికారులు చెబుతున్నారు. ఉక్కులో ఆరు మెషీన్‌లు ఉండగా నాలుగు మెిషీన్‌లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇందులో మరో మెషీన్‌ ప్రమాదం కారణంగా నిలిచిపోయింది. దీంతో ప్రతిరోజూ వేయిటన్నుల ఉక్కు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశముంది. సంఘటనా స్థలిని వర్క్‌‌స జిఎం పిఎన్‌రావు, వర్క్‌‌స ఇడి రంజన్‌లు పరిశీలించి నష్టాన్ని అంచనావేస్తున్నారు.

Sunday, April 10, 2011




ఇది ఆరంభమే!
అవినీతిపై యుద్ధంలో రాజీ లేదు
ప్రజా చైతన్యానికి దేశ యాత్ర
ప్రజాగ్రహానికి మద్దతు మచ్చుతునక
యువత, ప్రజలకు హజారే పిలుపు

:అధికార్లు, ప్రజాప్రతినిధుల్లో పెచ్చుమీరుతోన్న అవినీతిపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలకు మచ్చుతునక తాను చేపట్టిన ఆమరణ నిరశనకు లభించిన మద్దతని గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యానించారు. అవినీతిని అంతం చేసే విషయంలో రాజీ పడకూడదన్న ప్రజా మనోభావాలకు ఇదొక సంకేతంగా ఆయన అభివర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా చేపట్టిన ఆమరణ నిరశనతో దిగివచ్చిన ప్రభుత్వం, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదించటంతో శనివారం ఉదయం ఆయన దీక్ష విరమించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.అవినీతి జాడ్యాన్ని ఏరిపారేసేంత వరకూ ప్రజలు విశ్రమించకూడదని పిలుపునిస్తూ, లంచాలు అడిగిన వారిని ఉపేక్షించవద్దని హెచ్చరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టం కానున్నందున తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన హామీ ఇచ్చారు. తన దీక్షకు లభించిన ప్రజామద్దతే ప్రభుత్వం కళ్లు తెరిపించిందని చెప్పుకున్నారు. అధికార్లు, ప్రజాప్రతినిధుల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయనిపక్షంలో, ప్రజా జీవితాలు మరింత దుర్భరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనలో మనకు ఎన్ని అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ, అవినీతిని తుడిచిపెట్టే విషయంలో దేశంలో సమైక్యరాగం వినిపించిందని చెప్పారు. ‘్భన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. అవినీతిపై ప్రజలు విసుగెత్తిపోయారు. ప్రజల ఆవేదనను గ్రహించి ప్రభుత్వం అవినీతిని అదుపుచేయటానికి ఎలాంటి చర్యలూ తీసుకోక పోవటంవల్లే, అవినీతి ఊడలు మరింత లోతుకు పాతుకుపోయాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకురానున్న చట్టం అవినీతికి భరత వాఖ్యం పలికి తీరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రారంభించిన ఈ యుద్ధానికి కులం మతం ప్రాంతంతో పనిలేదన్నారు. అవినీతి అంతమయ్యేంత వరకూ విశ్రమించరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ప్రారంభించిన దీక్షకు వివిధ వర్గాలు, ముఖ్యంగా యువతనుంచి లభించిన మద్దతుకు ప్రభుత్వం గడగడలాడిందని అన్నా హజారే ఆనందంగా చెప్పారు. అవినీతిని రూపుమాపటంలో యువత కీలకపాత్ర వహించాలని హజారే సూచించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను తయారు చేయటానికి ఒక కమిటీని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం అంగీకరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాలేదని, అసలు పోరాటం ఇక్కడి నుంచే మొదలవుతుందని గుర్తు చేశారు. లక్ష్య సాధనలో మనం ఇంకా చాలా దూరాన్ని అధిగమించాల్సి ఉందని హజారే చెప్పుకొచ్చారు. బిల్లును వ్యతిరేకించే రాజకీయ నాయకులకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు దేశంలో పర్యటించి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తానని హామీ ఇచ్చారు.
దీక్ష విరమించిన హజారే
ఫలితాన్నిచ్చిన ఆమరణ నిరశన జన్‌లోక్‌పాల్ ముసాయిదా కమిటీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ మద్దతుదారుల్లో పెల్లుబికిన ఆనందం
 హజారే సత్యాగ్రహం అంతిమ విజయం సాధించింది. స్వతంత్ర భారత చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అవినీతికి వ్యతిరేకంగా సాగించిన అహింసాయుత యుద్ధంలో విజయం సాధించిన అన్నా హజారే, ఈతరానికి స్ఫూర్తిగా నిలిచారు. జాతిపిత త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన అహింసా మార్గంలో 97గంటల నిరాహార దీక్ష సాగించి ప్రభుత్వం మెడలు వంచిన హజారే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడగల ఆత్మవిశ్వాసాన్ని బలమైన ఆయుధంగా ప్రజలకు అందించారు. నాలుగు దశాబ్దాల కాలంలో ఎవ్వరూ సాధించలేకపోయిన విజయాన్ని ప్రజా మద్దతుతో సాధించి, ప్రజాబలంతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలమని నిరూపించారు. చీడపురుగు మాదిరి దేశాన్ని పట్టి పీడీస్తున్న అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నాహజారే ప్రారంభించిన ఆమరణ దీక్షకు ప్రజల నుంచి లభించిన స్పందన, కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపింది. అవినీతిని రూపుమాపే విషయంలో తమ చిత్తశుద్ధి శంకించవద్దన్న సంకేతాన్ని పంపుతూ కేంద్రం అన్నాహజారే చేసిన ప్రతిపాదనలకు లోబడి లోక్‌జన్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీకి అంగీకరించటంతో అన్నా హజారే, ఆయన మద్దతుదారులు సుమారు 97 గంటలపాటు నిర్వహించిన ఆమరణ దీక్షకు తెరపడింది. శనివారం ఉదయం పది గంటల సమయంలో అన్నా హజారే, ముందు తన సహచరులతో దీక్ష విరమింప చేశారు.తరువాత ఒక చిన్న పాప అందించిన నిమ్మరసం తీసుకుని దీక్షకు స్వస్థి చెప్పారు. ఆయన దీక్ష విరమించగానే జంతర్ మంతర్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అంతేగాక ఇకనుంచి అధికారులకు లంచం ఇవ్వకుండానే పనులు చేయించుకోగలమన్న ఆత్మవిశ్వాసం తోణికిసలాడిందని చెప్పక తప్పదు. 40 ఏళ్లనుంచీ అతీగతీ లేకుండా పడివున్న లోక్‌పాల్ బిల్లు జన్‌లోక్‌పాల్ బిల్లుగా రూపాంతరం కాబోతోంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు బలమైన అధికారాలను ఆపాదిస్తూ, పటిష్టంగా రూపకల్పన చేయటానికి పదిమంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి కేంద్రం అంగీకరించింది. ఈమేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నాహాజారే డిమాండ్ చేసినట్టు కమిటీలోని పదిమందిలో ఐదుగురు పౌర సమాజం నుంచి ఉంటారు. ఐదుగురు మంత్రులు కమిటీలో భాగస్వాములు అవుతారు. కేంద్ర ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. కాగా మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ సహాధ్యక్షులుగా ఉంటారు. న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ, హోంమంత్రి పి చిదంబరం, జలవనరుల మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో పాటు హజారేతో దీక్ష విరమింప చేయటంలో కీలకపాత్ర వహించిన మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి కపిల్ సిబల్ ప్రభుత్వం తరఫున సంఘంలోఉంటారు. పౌర సమాజం పక్షాన శాంతి భూషణ్‌తోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ప్రశాంత్ భూషణ్, ఎన్ సంతోష్ హేగ్డే, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ కార్యదర్శి వికె భాషన్ సంతకంతో శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీ జూన్ నెలాఖరుకు తన ముసాయిదాను ప్రభుత్వానికి అంద చేయాల్సి ఉంటుంది. ముసాయిదాను అధ్యయనం చేసిన తరువాత ప్రభుత్వం బిల్లును వర్షాకాలపు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.



Tuesday, April 5, 2011

సమైక్యాంధ్ర జ్యోతిష్కులు వర్సెస్ తెలంగాణా జ్యోతిష్కులు


సమైక్యాంధ్ర జ్యోతిష్కులు వర్సెస్ తెలంగాణా జ్యోతిష్కులు
ఉగాది పర్వదినం తెలంగాణా జ్యోతిష్కులు, సమైక్యాంధ్ర జ్యోతిష్కుల మధ్య చిచ్చు పెట్టింది. సోమవారం ఉగాది పండుగనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగం వినిపించిన ప్రముఖ జ్యోతిష్కులు వచ్చే ఏడాది కూడా ఉగాది సమైక్యాంధ్రలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరిశ్ రావు మండిపడ్డారు. 
టీడీపి పంచాంగం పచ్చి అబద్ధమని ధ్వజమెత్తింది. చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా పంచాంగం చెప్పాలని జ్యోతిష్కులపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే అటువంటి వ్యాఖ్య చేసి ఉంటాన్నారు. తెలంగాణా ప్రాంత జ్యోతిష్యుడు దామోదర్ శర్మ మాట్లాడుతూ... సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెల్లడించిన పంచాంగం శుద్ధఅబద్దమనీ, వచ్చే మే నెల 21 తేదీ లోపు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని చెప్పుకొచ్చారు. మరి ఎవరి జ్యోతిష్యం కరెక్టవుతుందో చూద్దాం.

అధిష్టానం వద్ద మోకరిల్లండి.. పోటీ నుంచి తప్పుకుంటా!!


అధిష్టానం వద్ద మోకరిల్లండి.. పోటీ నుంచి తప్పుకుంటా!!
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి ఒక ఆఫర్ ప్రకటించారు. జగన్‌తో పాటు ఆయన వర్గానికి చెందిన నేతలంతా కాంగ్రెస్ అధిష్టానం వద్ద మోకరిల్లితే తాను ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. రాజకీయాల్లో బంధుబంధుత్వాలు పని చేయవని, రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని చెప్పుకుంటూ వచ్చిన వివేకా.. ఒక్కసారి ఇలా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తన అన్న వైఎస్‌ఆర్‌ రాముడైతే.. తాను లక్ష్మణుడు అని మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా వివేకా ప్రకటించి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తాజాగా, జగన్ వర్గంపై నిప్పులు చెరిగారు. జగన్ వర్గం నేతలు చేసిన తప్పులు అంగీకరించి కాంగ్రెస్ హైకమాండ్‌కు లొంగిపోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా తాను ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంతేకాకుండా, జగన్‌కు ఒక హితబోధ కూడా చేశారు. అన్ని వేళలా సెంటిమెంట్ కూడా పని చేయదని చిన్నపాటి ఉచిత సలహా కూడా ఇచ్చారు మంత్రివర్యులు.

కడప జిల్లాలో ఊపందుకున్న"ఎలక్షన్‌ ఫీవర్‌"


కడప జిల్లాలో ఊపందుకున్న"ఎలక్షన్‌ ఫీవర్‌"
కడప జిల్లాలో ఎలక్షన్‌ ఫీవర్‌ ఊపందుకోనుంది. రేపటి నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు YSR కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి. తనను ఓడించేందుకు కాంగ్రెస్‌, TDPలు మళ్లీ కుమ్మక్కయాయన్న జగన్‌ ఆ పార్టీలపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెడతారన్నది ఆసక్తిగా మారింది. అటు తల్లి YS విజయమ్మపై బాబాయి వివేకా పోటీ చేస్తుండడంతో యువనేత చేయబోయే ప్రచారం జనాల్లో ఉత్కంఠ రేపుతోంది. మే 8న జరగబోయే కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రచార పర్వానికి బుధవారం తెరలేవనుంది. తమ కుటుంబాన్ని గెలిపించాలంటూ క్యాంపేయిన్‌ మొదలుపెట్టనున్నారు యువనేత జగన్‌. కడప పార్లమెంట్‌ పరిధిలోని కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకురు, బద్వేల్‌, కమలాపురం, ప్రొద్దుటూర్‌ నియోజకవర్గాల్లో జగన్‌ టూర్‌ ఖరారైంది. పులివెందులలో YS విజయమ్మపై YS వివేకానందరెడ్డి పోటీ చేయనుండడంతో జగన్ ఈ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్‌ చేయనున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం గడువు ముగిసేంత వరకు ఆయన కడప జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఈనెల 6, 15, 24 తేదీల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో.... పర్యటించనున్నారు. ఇక ఈనెల 8, 14, 17, 23, 30 తేదీలతోపాటు మే 2, 4 తేదీల్లో పులివెందుల కానిస్టెన్సీలో పర్యటించనున్నారు జగన్‌. ఏప్రిల్‌ 12, 22, 29 తేదీల్లో బద్వేల్‌ నియోజకవర్గంలో... ఈనెల 11, 21తోపాటు మే 5 తేదీల్లో కడప నియోజకవర్గంలో టూరేస్తారు యువనేత. ఇక ఇదేనెల 19, 27, మే 3 తేదీల్లో ప్రొద్దుటూర్‌ నియోజకవర్గంలో... ఏప్రిల్‌ 10, 20, 26 తేదీలతోపాటు మే 3వ తేదీల్లో మైదుకురు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు YSR కాంగ్రెస్‌ అధినేత. జగన్ ప్రచారం కోసం ఇప్పటికే ప్రచార రథం సిద్ధమైంది. పార్టీ అధినేత టూర్‌ను విజయవంతం చేసేందుకు యువనేత వర్గం MLAలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కమలమ్మ, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, MLC దేవగుడి నారాయణరెడ్డి, YSR కాంగ్రెస్‌ నాయకులు భూమా నాగిరెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి జగన్‌ టూర్‌ కోసం కసరత్తు చేస్తున్నారు. 

చైతన్యశీలి డాక్టర్జీ ...


చైతన్యశీలి డాక్టర్జీ

సార్థకమైన జీవితానికి గీటురాయి ఎంత కాలం జీవించారు అనేది కాదు, ఆ వ్యక్తి తన జీవితంలో ఏమి సాధించాడు అనేది అవుతుంది. అట్లాగే ఏ మహాపురుషుడినైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జీవించి ఉన్న కాలంలోని సమకాలీన పరిస్థితులు, ఆ సమయంలో వారు సాదించిన విజయాలు, ఆలోచనలు, అన్నీ కలగలసి ఆ మహాపురుషుడిని అర్థం చేయిస్తాయి. భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో అనేకమంది మహాపురుషులు జన్మించారు. వారిలో స్వామి వివేకానంద, అరవింద, బంకించంద్ర, డాక్టర్‌ హెడ్గేవార్‌లు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో వారు చేయవలసిన పనులను ఒకరి తరువాత ఒకరు చేసుకుంటూ వెళ్ళారు.
వారిలో డా||హెడ్గేవార్‌ హిందూ సమాజాన్ని శక్తివంతం చేసేందుకు ప్రారంభించిన కార్యం క్రమంగా విస్తరిస్తూ ఈ రోజున ప్రపంచంలోనే స్వచ్ఛందంగా పనిచేసే ఏకైక అద్భుత వ్యవస్థగా నిలబడింది. సమాజంలోని అన్ని రంగాలలో తనదైన శైలిలో పనిచేస్తూ అందరి మనస్సులను గెలుస్తూ ముందుకు పోతున్నది. ఇంతటి మహత్తర కార్యరచనకు డాక్టర్జీకి ప్రేరణ ఇచ్చిన అంశం ఏమిటి? అని ఆలోచిస్తే ఒకే ఒక అంశం మనకు కనబడుతున్నది. అదే ''ఇది మన మాతృభూమి, మనం మన మాతృభూమి వైభవం కోసం పని చేయాలి. దానికోసం ప్రతిరోజూ ఒక గంట సమయమిచ్చి అందరం ఒకచోట కలవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దేశం గురించి మనం కలిసి పనిచేయటం నేర్చుకోవాలి ఈ సరళమైన కార్యపద్ధతికి, ఆలోచనకు సమాజంలోని అన్నివైపుల నుండి స్వాగతం లభించింది. ప్రతి రోజు కనీసం గంట సమయం ఇవ్వాలనే ఆలోచన నుండి తమ జీవితాలలో సంపూర్ణ సమయాన్ని సమర్పణ చేసి పనిచేసే వ్యక్తులు వేలాదిమంది తయారైనారు. ఆ విధంగా సంపూర్ణ సమయం సమాజం కోసం సమర్పణ చేసి పనిచేసే కార్యకర్తలు ఈ రోజున మూడు వేలమందికి పైగా కనబడతారు. సంఘ కార్య పద్ధతిని వికసింప చేయ డంలో పూజనీయ డాక్టర్జీకి ఆ సమయంలో ఎదురైన సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లోరో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. అవి కాంగ్రెస్‌ వేదికగా స్వాతంత్య్రపోరాటం ఉధృతంగా నడుస్తున్న రోజులు. 1920వ సంవత్సరం తరువాత కాంగ్రెస్‌ స్వతంత్ర పోరాటం కోసం మూడు పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చింది. మొదటి ఆందోళన 1920-21లో ప్రారంభై 1924 ఫిబ్రవరిలో గాందీజీ జైలు నుండి విడుదలవ
టంతో నిలిచిపోయింది. 1930-31లో ప్రారంభమైన రెండవ ఆందోళన 1934 మే నెలలో గాంధీజీ ఆందోళనను వెనుకకు తీసుకోవడంతో ఆగిపోయింది. మూడవ ఆందోళన 1941 అక్టోబర్‌ 17న వినోబా భావే వ్యక్తిగత సత్యాగ్రహంతో ప్రారంభమై 1942లో పూర్తి ఆందోళనగా రూపుదిద్దుకొంది. 1945 జూన్‌ 15వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులను విడుదల చేయటంతో ఈ ఆందోళన ఆగి పోయింది.
మొదటి ఆందోళన సమయానికి సంఘ స్థాపన జరగలేదు. డాక్టర్జీ కాంగ్రెస్‌లో పనిచేస్తున్న రోజులవి. ఆ ఆందోళనలో డా|| హెడ్గేవార్‌ క్రియాశీలంగా పనిచేసిన సంగతి అందరికీ తెలుసు. 1930వ సంవత్స రంలో సత్యాగ్రహంలో పాల్గొనేందుకు డాక్టర్జీ నిర్ణయించుకున్నారు. ఆందోళనకు తాత్కాలిక మహత్య మెంత ఉన్నా అది ఒక నైమిత్తిక కార్యక్రమం మాత్రమే. ఈ నైమిత్తిక కార్యం పూర్తి కావాలి. కాని ఈ పనుల వల్ల సంఘ నిత్యకార్యానికి ఆటంకం కలగరాదు. ఈ సంతులనాన్ని పరిరక్షించాల్సి ఉంది. దానికి కావలసిన ఆలోచనలను డాక్టర్జీ చేశారు. కాబట్టి డాక్టర్జీ సత్యాగ్రహంలో పాల్గొనేముందు సరసంఘ చాలక్‌ బాధ్యత వేరేవారికి అప్పగించారు. సత్యాగ్రహానికి డాక్టర్జీ ఎంచుకున్న సమయం చూసినట్లైతే వాస్తవానికి సత్యాగ్రహం మార్చి మాసంలో ప్రారంభమైనా సంఘ శిక్షావర్గ పూర్తి అయిన తరువాత మాత్రమే డాక్టర్జీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1937వ సంవత్సరం వరకు డాక్టర్జీ సంఘకార్య పద్ధతి కాంగ్రెస్‌ కార్యక్రమాలకు మధ్య సంతులనం ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఆ సంవత్సరం కాంగ్రెస్‌ సంకీర్ణ దశ స్వరూపాన్ని ధరించింది. ఆ సమయంలో డాక్టర్జీ ఇలా చెప్పాడు.
కాంగ్రెస్‌ జాతీయ స్వరూపాన్ని వీడనంతవరకు నేను దానిలో సభ్యునిగానే ఉన్నాను. కాంగ్రెస్‌ కేవలం ఒక పార్టీగా రూపాన్ని ధరించటం ప్రారంభించినప్పటి నుండి నేను దానిలో సభ్యుడిని కాను. మరోపక్క డాక్టర్జీ ప్రారంభం నుండి హిందూ మహాసభలో క్రియీశీలంగా ఉండేవారు. అందులో అనేక రకాల బాధ్యతలు నిర్వహించారు. హిందూ మహాసభ వారు డాక్టర్జీ ప్రారంభించిన సంఘం స్వయం సేవకులు తమ పనులన్నీ చేసిపెట్టాలి అని భావిస్తుండేవారు. నిత్య, అనిత్య వివేకంతో డాక్టర్జీ వ్యవహరించిన కారణంగా అన్ని రకాల ఉద్యమాల మధ్య సంఘకార్యం స్థిరంగా నిలబడింది. అంతిమ లక్ష్యం మీద దృష్టి ఉన్నా, తాత్కాలిక అంశాలను పట్టించుకోకుండా ఉండటం అవ్యవస్థిత మానసిక స్థితిగా డాక్టర్జీ భావించేవారు. అదే విధంగా తాత్కాలిక ఆవేశంతో కొట్టుకు పోవటం వల్ల అంతిమ లక్ష్యానికి దెబ్బ తగిలేటట్లయితే అది కూడా అవ్యవస్థిత మానసిక లక్షణంగానే భావించారు. అంతిమం తాత్కాలికం అయినా ఆవశ్యకతలో నిత్య కార్యాన్ని సంఘాను కూలంగా సంతులితంగా ఉండటం పరమ ఆవశ్యకం. ఈ సంతులనంలో వ్యక్తి నిరపేక్షతా, ధ్యేయనిష్ఠ స్పస్టంగా కనిపిస్తుంది. ఈ సంతుల నాన్ని డాక్టర్జీ ఎప్పుడూ కోల్పోలేదు. ఈ విషయాలను చాలామంది సరిగా అర్థం చేసుకోక పోవటం కారణంగా డాక్టర్జీ విషయంలో, సంఘం విషయంలో అసంతుష్టిగా ఉండేవారు. డాక్టర్జీ సంతులన స్థితికి లభించిన మూల్యం ఒకవైపు కాంగ్రెసీల అసంతుష్టి, మరొకవైపు హిందూ సోదరుల అసంతృప్తి రెండు వైపుల అసంతృష్టి వాయువులు వీస్తున్నా చింతించకుండా డాక్టర్జీ రాష్ట్ర నిర్మాణ కార్యంలో నిమగ్నమై పనిచేశారు.
దేశంలో పనిచేసే హిందూ సంస్థల ధోరణులను కూడా అర్థం చేసుకోవాలి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు అర్థం చేసుకొని పరిస్థితులను అధిగమించేందుకు డాక్టర్జీ వ్యవహార కుశలతను అర్థం చేసుకొని ముందుకు సాగాలి.
,,, భారతి....

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?


తరచుగా ఒక ప్రశ్న వేస్తుంటారు - అది, బాబావారు తామే అద్భుత రీతిలో రోగాలకు చికిత్స చేసి మాన్చుతున్నప్పుడు, పుట్టపర్తిలో డాక్టర్లతోను, ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నవాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాలనేకాక విజ్ఞాన శాస్త్రాలనుకూడా దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని ఆర్జించుకోవాలి. రష్యాలో అధిమనో విజ్ఞాన శాస్త్రాన్ని (శసశూా-ఠుుగా) ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు. అక్కడ అతిమానుషమయిన (కార్య కారణ సంబంధం లేకుండా దైవశక్తితో కూడిన) కొన్ని విషయాలమీద ఆకట్టుకొనే ప్రయోగాలను జరిపారు. వాటిని గురించి ఇటీవల అమెరికాలో ఒక తక్కువ వెల పుస్తకం ప్రచురింపబడింది. ప్రశాంతి నిలయంవంటి ఆశ్రమాలలోని డాక్టర్లు ఆధ్యాత్మిక నేపథ్యంతో వైద్య చికిత్సలు చేయాలి. డాక్టర్లు ఒక జబ్బును నిర్ధారించి దానికి చికిత్స ఎట్లా చేయాలో నిర్ణయించటానికి మందు ఆ జబ్బుమీద అంతర్‌ బుద్ధిని ప్రయోగించాలి. అప్పుడే ఆ జబ్బు వివరాలను, దానికి సంబంధించిన సూక్ష్మాంశాలను గుర్తించడంలో అతని విజ్ఞానశాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. అనుగ్రహంయొక్క పరిధిలో విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచాలి.
డా|| సామ్యుయెల్‌ హెచ్‌. సాండ్‌వైస్‌, ఎం.డి., అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కేలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌డీగో విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసరేకాక, మనో వైజ్ఞానిక (సైకియాట్రిస్ట్‌) డాక్టర్‌గా కూడా వృత్తిని నిర్వహిస్తున్న వాడు. ఆయన రాసిన 'సాయిబాబా, ది హోలీ మ్యాన్‌ అన్‌డ్‌ ది సైకియాట్రిస్ట్‌' అన్న గ్రంథం ఎంతో ఆకట్టుకొంటున్న గ్రంథం. మనో విజ్ఞాన మూలాల్ని తెలుపుతూ ఒక ఆకర్షకమైన కథనం అందులో ఉన్నది. మనో విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడ్తున్న శాస్త్రం ఒక అసమగ్రమైన శాస్త్రమనీ, దాన్ని నిజంగా ప్రభావవంతం చేయాలంటే, ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఎన్నో విషయాలను అందులో చేర్చాల్సి ఉంటుందని ఆయన నిశ్చితంగా చెప్పాడు. ఈ గ్రంథంలో డా|| సాండ్‌వైస్‌ తనకు బాబాతో కలిగిన అనుభవాలనుకూడా వివరించారు. మొట్టమొదట తను 'అనిశ్చితి', 'అనిర్ణయత' ఉన్నవాడిననీ, అధ్యాత్మక వెలుగులో తాను మారానన్నారు. తన నాస్తికపు సంశయాత్మక బుద్ధిని ఎంతమేరకు వెళ్ళగలదో అంతమేరకు వెళ్ళనిచ్చాననీ, ఐతే అట్లా సంశయించడంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నప్పటికీ, అది ఆత్మయొక్క ఉనికినీ, ఆధ్యాత్మిక సత్యాన్నీ అంగీకరిస్తుందన్నారు. తన వృత్తిమీదకూడా తనకున్న దృష్టిలో మార్పు వచ్చిందంటారు, సాండ్‌వైస్‌.
మతపరమైన మనో విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఒక పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా అధ్యయనం చేయటానికి ఆయన భారత దేశానికి వచ్చారు. చిత్‌శక్తి శాస్త్ర పునాదిమీద ఆధారపడి, మనోవిజ్ఞాన చికిత్సా విధాన శాస్త్రమే తన రోగ చికిత్సా పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు.
నిపుణుల కమిటీ ఒకటి బాబావారి మిరకిల్స్‌ (అద్భుతాల)ను గురించి ప్రత్యక్షంగా అధ్యయనం చేయడంకోసం పుట్టపర్తికి వచ్చిందని నాల్గవ అధ్యాయనంలో రాశాను ('ది ఎడ్వెంట్‌ ఆఫ్‌ సత్యసాయి' -అన్న గ్రంథంలో) వారు అమెరికాలోని చెస్టర్‌ ఎఫ్‌. కార్ల్‌సన్‌ రీసెర్చి లేబొరేటరీకి చెందినవారు. ఇందులోని ఇద్దరు మనో విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు. ఊాతో పాటు ాఒ కి చెందిన అంశాలను అధ్యయనం చేయడానికే ఈ లేబొరేటరీ (ప్రయోగశాల)ని వ్యవస్థాపించారు. (ఊా మరియు ాఒ లు అతీంద్రియ జ్ఞానాన్ని శాస్త్రీయంగా పరిశోధించి తెలిపే శాస్త్రాంశాలు). ఇద్దరు శాస్త్రవేత్తలు - ఒకరు డాక్టర్‌ కార్లిస్‌ ఇసిస్‌. వీరు అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చికి డైరెక్టరు. మరొకరు ఎర్‌టెన్‌డుర్‌ హరాల్డ్‌సన్‌ - ఐస్‌ల్యాండ్‌ యూనివర్శిటీకి చెందినవారు. బాబాను అధ్యయనం చేశాక వీరిద్దరూ వైదుష్యంతో కూడిన కొన్ని అంశాలతోఒక పరిశోధన పత్రాన్ని 'శ్రీ సత్యసాయిబాబావారికి సంబంధించిన ఐదు దేహాంతర కేసులు' అన్నదాన్ని రాశారు. (వీటిని క్షఇఊ అంటారు. అంటే క్షషష ుౌ ఇుdా ఊూ|స|n-| అని అర్థం. దేహం నుంచి తాను బైటకు వెళ్ళి జరిపే పనులని అర్థం). వీరి ఈ అధ్యయనాన్ని గమనిస్తే వీరికి చురుకయిన, సంకుచితం కాని మనస్సే కాక, తాము అధ్యయనం చేయదలచుకొన్న ఆధ్యాత్మికమైన మిరకిల్స్‌ మీద గౌరవం ఉన్న విషయాన్నిచూడ గల్గుతాము. అలాంటి అనుభవాలవద్దకు అవి దొంగవనో, అబద్ధమనో (ముందే ఏర్పరచుకొన్న) నిర్ణయాలతో వీరు వెళ్ళలేదు. ఈ అసాధారణ విషయాలను తమ పత్రంలో వీళ్ళు చర్చిస్తున్నప్పుడు వీటిని తెలుపడానికి తగిన పరిభాషా శబ్దాలనుకూడా వీరు సిద్ధం చేసికొన్నారు. ఇది విశేషమయిన ప్రత్యేక శాస్త్రం. సాహిత్యాన్నో, సాంఘిక, భౌతిక విజ్ఞాన శాస్త్రాలనో అధ్యయనం చేస్తే ఈ జ్ఞానాన్ని పొందలేము. ఈ పరిశోధక పత్రంలో వీరు ఆధారపడిన గ్రంథ, వ్యాస సూచికల పట్టికను పరిశీలిస్తే, వీరికి అద్యతన అధిమనో విజ్ఞాన శాస్త్రంతోనూ (పేరాసైకాలజీ), భారతీ యులూ, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌ రచయితలూ బాబావారిని గురించి రాసిన రచనలతోనూ ఎంతటి గాడమైన విద్వత్తూ పరిచయమూ ఉన్నవో తెలస్తుంది. ాఒ పరిశోధనలకు ఆ శాస్త్రానికే పరిమితమైన సొంత పరిశోధన పద్ధతులున్నాయి. అధిమనో విజ్ఞాన శాస్త్ర అధ్యయనం లేకుండా, కనీసం ఆ పద్ధతులను గురించి దిఙ్మాత్ర పరిచయమైనా లేకుండా ఎవరయినా ఇలాంటి పరిశోధనలకు పూనుకుంటే, అది సాహసమే అవుతుంది.
తమ పత్రాన్ని గురించి ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు ఇట్లా అన్నారు ''ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించి, తమ అనుచరులు ఈ (మా) పరిశోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించినందుకు శ్రీ సత్యసాయికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఇంటర్వ్యూల నిర్వహణలో తోడ్పడిన సాక్షులకూ, ఇతరులకూ హృదయపూర్వకమయిన కృతజ్ఞతలు''.
ఈ పరిశోధన పత్రం నుంచి కొన్ని ఉదాహరణలు:
''కేవలం ప్రఖ్యాతులయిన వ్యక్తులూ, శాస్త్రజ్ఞులూ, పారిశ్రామికవేత్తలూ, రాజకీయనాయకుల కోసం కాకుండా, వీరి క్షఇఊ (దేహాంతర అనుభవం) పొందాల్సిన వ్యక్తికి కల్గిన ఆత్యయిక పరిస్థితి (జబ్బూ, నిస్పృహా మొదలైనవి) వల్లనే కలిగింది. కేవలం అవసరం వల్లనే బాబావారి క్షఇఊ (దేహాంతర అనుభవం) అగుపించినందువల్ల మా పరిశోధనల్లో వారిని పాల్గొనేటట్లు చేయడానికి మాకు అత్యల్ప అవకాశమే ఉన్నదని గ్రహించాము. ఐతే, వారు మాకోసంగాను అనేక సందర్భాలలో వస్తువులు అగుపించడం, మాయమవడం వంటివాటిని చూపించారు....''
ఈ నిపుణులు ఆకర్షకమైన కేసులను అన్వేషించే కార్యక్రమంలో, మూడుసార్లు భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలను చూశారు. 1973లో వారు చేసిన మూడవ పర్యటనలో వారికి బాబా విషయం తెలిసి వారిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలనిపించినట్లుగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అయిన ఒక వృద్ధురాలైన భక్తురాలికి బాబావారు ప్రత్యక్షం కావడాన్ని గురించి వీరీ పత్రంలో తెలిపారు: మద్రాసు సమీపంలో ఉన్న వెంకటగిరిలో ఉంటూనే శైలజ అన్న ఒక చిన్నపిల్ల ప్రార్థనవల్ల కాలికట్‌ సమాపంలోని మంజేరీలో శరీరంతో అగుపించి కొన్ని గంటలు భజన, సంభాషణ చేయడంగురించి ఇందులో వీళ్ళు తెలిపారు.
(వారి మాటల్లో ''మంజేరీ విషయంగా మేము బాబావారిని ప్రశ్నించాము. రెండు సందర్భాలలో 'తాను' దేహం విడిచి రావు కుటుంబంతో ఉన్నట్లుగా ధృవీకరించడం చాలా క్లుప్తంగా చేశారు.'')
ముగ్గురు దుబాసీల సహాయంతో వీళ్ళు 21 మంది సాక్షులను పరీక్షించినట్లుగా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఏయే అంశాలను పరీక్షించాలో ఆరు పట్టికల్లో రాసికొన్నారు. ఈ నిపుణులు ఇంకా వివరిస్తూ -''దేశ దిమ్మరి సన్న్యాసులవలె సాయిబాబా భిక్షమడగరు. ఏమీ కోరరు. పోగా వారే ఇతరులకు సాయం చేస్తుంటారు'' అని తెలిపారు. బావిలో పడి మునిగిపోతున్న ఒక మనిషిని సాయమం దించేవాళ్ళు వచ్చేదాకా తానే సూక్ష్మ శరీరంతో ఎత్తి ఉంచిన కుప్పం సంఘటనను గురించి చర్చిస్తూ ఈ నిపుణులు ''ఇది క్షఇఊ అంశం. ఊా (ఊషసశ ా|nుసా |స-|ూషుn -అంతీంద్రియ గ్రమణం) కన్నా విశేషమైనది'' అని అంటూ ''బాబా తమని అవతారంగా భావించే - వారి అనుయాయులకు అనేకానేక ఊా శక్తులను ఖచ్చితంగా ప్రదర్శించారు. వారి ఊా శక్తిని మేము కూడా స్వయంగా చూశాము. ఊఐ కు (అతని స్వదేశమయిన) ఐస్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రత్యేక సందర్భాలను సరిగ్గా పేర్కొన్నారు'' అని అన్నారు. ఆ విషయాన్ని గురించి వీళ్ళు ''బాబా చెప్పినవి క్షఇఊ లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
తమ పరిశోధన పత్రం ముగింపుగా వీరు ''అరవై లక్షల భారతీయ భక్తులు శ్రీ సత్యసాయిబాబా ఒక విశేష లక్షణ వ్యక్తిగా, అవతారంగా భావించడం విషయంలో మనం దాని సంభావ్యతనుగురించి సానుకూల మనస్కతతో ఉండాలి. పోగా, ఈ కేసులు ఆయనను గురించి ప్రత్యేకంగా తెలియపరిచేవేగాని భారతీయ సంస్కృతినిగురించి తెలిపేవి కావు. వీరికి సంబంధించిన ఈ కేసులు పాశ్చాత్య దేశాల కేసుల కన్నాకూడా ఖచ్చితంగా విల క్షణమయినవి. అసా ధారణమైనవాటిని గురించి తెలిసికోవడానికి ఇవి ఎక్కువ వీలు కల్గిస్తున్నట్లుగా అగుపిస్తున్నది'' అని రాశారు. వీటన్నిటివల్ల శరీరంతోనూ, క్షఇఊ పద్ధతుల ద్వారానూ బాబావారు సామాన్య మానవునికి ఎట్లా సాయం చేస్తున్నారన్న విషయం పాఠకులకు తేటతెల్లమవుతుంది.
ాఒ శాస్త్రాన్ని (క్షఇఊ, ఊా మొదలైనవి) అధ్యయనం చేయాలని కోరుకొనే వ్యక్తులు ఇది అత్యంత నూతన విజ్ఞానశాస్త్రమనీ, ప్రపంచంలో ఎంతో అభివృద్ధి పొందిన దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధించడానికి ప్రయోగశాలలూ, యూనివర్శిటీలూ స్థాపించారనీ గమనించాలి.పైన పేర్కొన్న పత్రం నుంచి అక్కడక్కడ ఉటంకించిన కొన్ని కొటేషన్లుకూడా ఈ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకమైందనీ, దీని పద్ధతులు వేరనీ, వీటిని అనుసరించి పరిశోధనలు జరిపినప్పుడే సత్యం ఆవిష్కారమవుతందనీ తెలుపుతాయి. ఏదో ఒక అంశంలోనైనా అనుభవాలను గురించిన ఈ ప్రయోగశాలల్లోకూడా తప్పులు జరుగవచ్చు. ఈ క్షేత్రంలో పని చేయడానికి భారతదేశంలో ఎందరికి శిక్షణ ఉన్నది? ఎందరు యోగ్యతా, అర్హతా సంపాదించుకొన్నారు? అన్నది సందేహాస్పదమే!

పుట్టపర్తిలో ....




సత్యసాయి ఆరోగ్యంపై సీఎం సమీక్ష
హైదరాబాద్ : సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు.
అమ్మవారి విగ్రహానికి పునఃప్రతిష్ట
పుట్టపర్తి : పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు బాబా భక్తులు,ప్రజలు సిద్ధం అయ్యారు. రెండు నెలల క్రితం సత్తెమ్మ అమ్మవారి విగ్రహం దెబ్బతినటంతో ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. పుట్టపర్తి : పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు బాబా భక్తులు,ప్రజలు సిద్ధం అయ్యారు. రెండు నెలల క్రితం సత్తెమ్మ అమ్మవారి విగ్రహం దెబ్బతినటంతో ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. 
బాబా స్పృహలోనే ఉన్నారు: సఫాయా
పుట్టపర్తి : సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై తాజా బులిటెన్ విడుదల చేశారు. బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. హార్ట్ బీట్, బీపీ నార్మల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు.ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని సఫాయా పేర్కొన్నారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈరోజు మధ్యాహ్నాం పుట్టపర్తి రానున్నారు.
సత్యసాయిలో స్వల్ప చలనం
పుట్టపర్తి: సత్యసాయి బాబా కళ్లలో స్వల్ప చలనం కనిపించిందని ఆయన సమీప బంధువులు తెలిపారు. ఈ రోజు రాత్రి బాబా బంధువులు ఐసియులోనికి వెళ్లి ఆయనని పలకరించారు. దాంతో బాబాలో స్వల్పంగా చలనం కనిపించినట్లు వారు చెప్పారు. కాళ్లు కూడా కదిపినట్లు వారు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లమని వారు కోరారు.
'సత్తెమ్మ విగ్రహం తొలగింపుతో బాబాకు అరిష్టం'
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహం తొలగింపు వల్ల సత్యసాయి బాబాకు అరిష్టమని భక్తులు నమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం సత్తెమ్మ విగ్రహాన్ని తొలగించి చెరువులో నిమజ్జనం చేశారు. అలా చేయడం వల్లే బాబాకు ఆరోగ్యం క్షీణించిందని భక్తులు నమ్ముతున్నారు. ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించేందుకు భక్తులు ప్రయత్నిస్తున్నారు. చెరువులో పాత విగ్రహం కోసం వారు వెతుకుతున్నారు.
పుట్టపర్తికి పోలీస్ బలగాల తరలింపు
పుట్టపర్తి: సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబాని తమకు చూపించాలని వారు డిమండ్ చేస్తున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాహనాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి వాహన్నాన్నికూడా అడ్డుకున్నారు. దాంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ అనిత, ఆర్టీఓలను అడ్డుకున్నారు. జర్నలిస్టులను కూడా వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బలగాలు తరలి వచ్చాయి.
బాబా త్వరగా కోలుకోవాలని చిరు ఆకాంక్ష
హైదరాబాద్: సత్యసాయిబాబా త్వరగా కోలుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి
సోమవారం ఆయన బాబా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సత్యసాయి ట్రస్టు వర్గాలతో ఫోన్లో మాట్లాడి
 ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.