పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ స్పూర్తితో పల్స్‌పోలియోకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలి విడత జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రం పోలియో రహితంగా మంచి ఫలితాలను సాధించిందని, రాబోవు కాలంలో కూడా ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పసిపిల్లలకందరికి పోలియో చుక్కలు వేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటింటికి కార్యకర్తలు తిరిగి పోలియో చుక్కలు వేసే విధంగా తదుపరి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి వేయడం జరుగుతుందని, బుధవారం నాడు ఏడు నగరపాలక కార్పోరేషన్‌ల పరిధిలో పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా కార్యాచరణ రూపొందించబడిందని తెలియచేశారు. 2008 నుండి రాష్ట్రంలో పోలియో పూర్తిగా నిర్మూలించబడిందని ముఖ్యమంత్రి వివరించారు. బిక్షగాళ్లు, వైద్యం అందుబాటులోలేని గిరిజన ఆవాసాలు, మత్స్యకారులు, వలస కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు, పట్టన మురికివాడలు, పట్టణాలు, గ్రామాలకు దూరంగా జీవనం సాగించేవారు, పంచాయతీల శివారులో ఉండేవారు, కొత్త కాలనీలు, పర్యాటక బృందాలు, వ్యవసాయ కూలీలు, ఆవాసాలకు దూరంగా పని చేస్తు జీవించే కుటుంబాలలోని పసి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,766 పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 11,835, గ్రామీణ ప్రాంతాల్లో 44,349 కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో 6,597, 1865 సంచార బృందాలను పోలియో చుక్కలను వేయడానికి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 99,38,713 మంది ఐదేళ్లలోపు పిల్లకు పోలియో చుక్కలు వేయడానికి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్ధలు, ఆశ వర్కర్లు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొంటాయని తెలియచేశారు. ఈ నెల 20న మహాశివరాత్రి పర్వదినం ఉన్నందున అన్ని దేవాలయాల వద్ద పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
---------------------------------------------------------------
The Chief Minister Sri N.Kiran Kumar Reddy has administered pulse polio drops to children at the Camp Office on the occasion of "National Immunisation Day" on Sunday. The Chief Minister said that Andhra Pradesh is Polio-free State since 2008 and appealed to work with the same spirit to achieve zero polio status across the country by 2012. The Chief Minister also released a special brochure on the occasion.
No comments:
Post a Comment