ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు
మూడోపార్టీ ఉండకుండా కుట్ర
రాష్ట్రంలో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించాలని యువనేత జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలతో ఢిల్లీ పెద్దలకు దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పాలని సభలో జగన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
విశాఖ జిల్లాలో జగన్ పర్యటనకు విశేష స్పందన రావటంతో
యువనేత జగన్‌కు విశాఖ జిల్లాలో జనం నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
జగన్ అధికార, ప్రతిపక్షాలపై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకుండా కాంగ్రెస్, టిడిపిలు దౌర్బాగ్య రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రెండు పార్టీలు ఏకమవ్వటం దారుణమన్నారు. ఉప ఎన్నికలు వస్తున్నాయన్న జగన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అభిమాన నేతకోసం ఎదురుచూసిన జనం... ఆయన పలకరింపుకోసం పరితపించిన జనం... ఆయన చిరునవ్వుకోసం నిరీక్షించిన జనం... ఆయన కరచాలనానికి పెనుగులాడిన జనం... ఆయన ప్రసంగంకోసం ఎగబడిన జనం... జననేత రోడ్‌షోకు పోటెత్తిన జనం... ఒక్క అడుగైనా ముందుకు సాగనివ్వని జనం... అనుకున్న సమయానికి వెళ్లనివ్వని జనం... ఒక గంట కాదు... రెండు గంటలు కాదు... చివరకు ఒక రోజైనా పొడిగించక తప్పని ఆభిమానం... అదీ జిల్లాలో సాగిన జగన్ ప్రయాణం.
ఈ కార్యక్రమాల్లో జగన్ వెంట అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పార్టీ జిల్లా కన్వీనర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పుగోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, గండి బాబ్జీ, పూడి మంగపతిరావు, మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, విజయనగరం జిల్లా ఇన్‌చార్జి జి.వి.రవిరాజు, ఏపీటీఎస్ మాజీ అధ్యక్షుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్పొరేటర్లు జహీర్ అహ్మద్, తిప్పల నాగిరెడ్డి, కంపా హనోకు, చొప్పా నాగరాజు, కండిపల్లి అప్పారావు, ఉరుకూటి అప్పారావు, చింతపల్లి పోతురాజు, అంగ అప్పలరాజు, పీలా ఉమారాణి, గంపల గిరిధర్, పసుపులేటి ఉషాకిరణ్, అదీప్‌రాజు, కాకర్లపూడి శ్రీకాంత్, చొక్కాకుల వెంకటరావు, కోరాడ రాజబాబు, విళ్లా శ్రీనివాసరావు, పోతల ప్రసాద్, మువ్వల పోలారావు, పూజారి ఉదయ్‌కుమార్, పక్కుర్తి చిన్నారావు, నారా నాగేశ్వరరావు, పక్కి దివాకర్, గొలగాని శ్రీనివాసయాదవ్, షబ్నం అఫ్రోజ్, నీలాపు వెంకటరమణ, భూపతిరాజు శ్రీనివాసరాజు, గుడిమెట్ల రవికుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో జగన్ వెంట నడిచారు.
No comments:
Post a Comment