మానవ రహిత హెలికాఫ్టర్ ఢీ కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే జన నివాసాల మధ్య పడివుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. సమాచారం తెలుసుకున్న నేవీ అధికారులు నలుగురు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కొండపైకి వెల్లారు. ఈ ప్రమాదం సాంకేతిక కారణమా లేక మరేదైనా ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది.
భారత నౌకాదళానికి చెందిన ఓ మానవ రహిత గ్లాడర్ ఓ కొండను ఢీకొంది. ఈ ఘటనలో ఈ గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. దీనికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎన్ 901 మానవ రహిత గ్లాడర్ గత కొన్ని రోజులుగా గాజువాక సమీపంలోని గణేష్ నగర వద్ద ఉన్న కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. సమాచార వ్యవస్థ కోసం నౌకాదళం ఈ విమానాన్ని వినియోగిస్తోంది. దీని ద్వారా వివిధ ప్రాంతాల్లో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటుంటారు.
పూర్తిగా రిమోట్ సహాయంతో నడిచే ఈ గ్లాడర్ విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ నుంచి గురువారం ఫిబ్రవరి 16 తేది న మధ్యాహ్నం బయల్దేరింది. కొండ చుట్టుపక్కల కొంతసేపు చక్కరు కొట్టిన గ్లాడర్ అకస్మాత్తుగా నేలకు అతి చేరువగా వచ్చేసింది. కొండ దిగువ భాగంలో ఉన్న ఇళ్ళకు అతి చేరువుగా వెళుతూ కొండను ఢీకొంది. పెద్ద శబ్దంతో గ్లాడర్ పేలిపోయింది. దీని శకలాలు చాలా దూరం ఎగిరిపడి, పెద్ద మంటలు చెలరేగాయి. దీంతో కొండవాలు ప్రాంతంలో ఉన్న జనం భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినా, కోట్ల రూపాయల విలువైన గ్లాడర్ దగ్ధమైంది. అలాగే కొండ అంచును తగిలి గ్లాడర్ పేలిపోయింది. అదే ఇళ్ళ మధ్య ఈ ప్రమాదం జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం వాటిల్లి ఉండేది. సంఘటనా స్థలానికి చేరుకోడానికి నేవీ అధికారులకు చాలా కష్టసాధ్యమైంది. హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని ఘటనా స్థలానికి చేరువలో దించినా, కొండపైకి వెళ్లడానికి చాలా అవస్థలుపడాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన నేవీ అధికారులు ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.
No comments:
Post a Comment