Monday, November 21, 2011

సీబీఐ విచారణపై చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్!!!


 సీబీఐ విచారణపై చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్!!!



 క్రమ ఆస్తులపై సీబీఐ విచారణ నిర్వహిస్తే అవిశ్వాస తీర్మానం పెడతామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు గాజువాక 61వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని 21-11-2011ఆదివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో రోజా ప్రసంగించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారన్నారు. అందువల్ల అవిశ్వాసం పెట్టాలంటే ఆయన అరికాళ్లకు చెమట్లు పడుతున్నాయన్నారు. అధికారంలోకి రాలేమని తెలిసే చంద్రబాబునాయుడు అవిశ్వాసానికి ముందుకు రావడం లేదన్నారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. 
గతంలో పదవుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చుట్టూ తిరిగిన నేతలు ఆయన మరణానంతరం రోశయ్య చుట్టూ, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నారన్నారు. వైఎస్ బతికున్న కాలంలో వానపాముల్లా ఉండే కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇప్పుడు నాగుపాముల్లా బుస కొడుతున్నారన్నారు. వారు బుస కొట్టడానికి తప్ప దేనికీ పనికి రారన్నారు. ఎందరు నాయకులు, పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. వైఎస్ ప్రతిష్టను చూసి ప్రజలు ఓట్లేశారు తప్ప, కిరణ్‌కుమార్‌రెడ్డిని, బొత్స సత్యనారాయణను చూసి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏనాడూ రైతు సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం రైతు సమస్యలపై పగటి వేషగాడిలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ మరణం తరువాత రాష్ట్రం చిన్నాభిన్నమైందన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్త అధ్యక్షురాలు నిర్మలా కుమారి మాట్లాడుతూ వైఎస్ మరణానంతరం రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. పార్టీ అర్బన్ కన్వీనర్ జి.వి.రవిరాజు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను దోచుకున్న చంద్రబాబునాయుడిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో అతని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. గాజువాక నియోజకవర్గ నేత తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, నాయకులు ఉరుకూటి అప్పారావు, చొప్పా నాగరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, అంగ అప్పలరాజు, వంశీకృష్ణ యాదవ్, చట్టి అప్పారావు (బాబు), నక్క వెంకట రమణ, పరదేశి, షౌకత్ అలీ, పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment