విశాఖపట్నం, శబరిమలై యాత్రికు ల సౌక ర్యార్థం ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీలకు విశేష ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ విశాఖ ప్రాం తీయ అధికారి జగదీష్‌బాబు తెలిపారు. ద్వార కా బస్‌కాంప్లెక్స్‌లో నిర్వహించిన గురుస్వాముల సదస్సులో ఆయన మాట్లాడు తూ ఇప్పటి వరకు విశాఖ రీజియన్‌లో 40 బస్సుల్ని స్వాములు బుక్ చేసుకున్నారన్నారు. ప్రయాణంలో స్వాములు గతంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించి స్వాములకు ఎటువంటి ఆటంకం లేకుండా బస్సులు పంపేందు కు ఏర్పాట్లు చేశామన్నారు.
గత సంవత్సరం 74 బస్సుల్ని శబరిమలైకు పంపగా ఈసారి 165 బస్సుల్ని నడిపేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఏడాది అన్నీ కొత్త బస్సుల్నే నడుపుతున్నామన్నారు. పంబలోయలో రిలీఫ్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. తొలుత డిప్యూటీ సీటీఎం వీరయ్య చౌదరి మాట్లాడుతూ సుశిక్షుతులైన డ్రయివర్లను ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో డిప్యూటీ సీడీఎం అప్పలనాయుడు,డిఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment