టీనేజ్ అంటే ఒక తరంగం.
టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.
దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలే ..
- కంచర్ల
No comments:
Post a Comment