పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
అంటూ నాగరాజును స్తుతిస్తూ నాగులచవితి రోజున పుట్టలో పాలు పోస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా కుజ, రాహుదోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు నాగులచవితి రోజున, లేదా కార్తీకమాసములో వచ్చే షష్ఠీ, చతుర్దశిలలో వచ్చే మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలిసివచ్చే రోజుకాని ఉపవాసముండి, పై మంత్రమును పటించాలి. అనంతరం ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేయాలి.
ఇలా స్త్రీలు నాగుల చవితినాడు నాగరాజుకు పూజ చేస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం అనాది కాలం నుంచి వస్తోంది.
No comments:
Post a Comment