ప్రఖ్యాత సినీ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు భార్య దాసరి పద్మ ఈ రోజు ఉదయం ( శుక్రవారం) హైదరాబాద్ లో మరణించారు. పద్మ ఎప్పుడూ దాసరి వెన్నంటే ఉన్నారు. నాలుగు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతతో కారణంగా ఆవిడను యశోదా హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. దాసరి పద్మ, నారాయణరావు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మేఘసందేశం, శివరంజిని, మజ్నూ, ఒసేయ్ రాములమ్మ, కొండవీటి సింహాసనం సినిమాలకు ఈవిడే నిర్మాత. నటుడు మోహన్ బాబు మాతృమూర్తిగా దాసరి పద్మ గారిని భావిస్తారు. ఈవిడ స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి. మల్టీ డిసీస్ తో ఆవిడ కొంత కాలంగా బాధపడుతున్నారు. దాసరి స్థాపించిన ఉదయం పత్రికకు సంపాదకురాలిగానూ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలిగానూ ఆవిడ పనిచేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
No comments:
Post a Comment