Friday, October 28, 2011

డిసెంబర్‌ 1న రాంచరణ్‌, ఉపాసన నిశ్చితార్థం


మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్, అపోలో హాస్పిటల్స్ అధినేత సి ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనల పెళ్లి నిశ్చితార్థానికి మూహుర్తం ఖరారు అయింది. డిసెంబర్ ఒకటవ తేదీన నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చిరంజీవి స్వయంగా రాష్టగ్రవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలియజేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి బుధవారం చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్ రాజ్‌భవన్‌కు వెళ్ళారు. ఈ సందర్భంగా రాంచరణ్ పెళ్ళి విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీన నిశ్చితార్థం జరగనున్నదని, ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకా వాలని చిరంజీవి దంపతులు గవర్నర్ దంపతుల్ని ఆహ్వానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న రాంచరణ్ ముసిముసినవ్వులు చిందించారు. ఇలా ఉండగా రాంచరణ్, ఉపాసన నిశ్చితార్థం కార్యక్రమం కోసం నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటను ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం భారీ వ్యయంతో అలంకరణలు చేస్తున్నట్లు చిరంజీవి సన్నిహితులు తెలియజేశారు. (చిత్రం) రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు 

No comments:

Post a Comment