Sunday, October 9, 2011

రాష్ట్రంలో అంధకారం అలముకోనుంది???


రాష్ట్రంలో అంధకారం అలముకోనుంది???
ఇక చిమ్మచీకట్లే ?
సక్సెస్ న్యూస్;;   రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అంధకారం అలముకోనుంది. విద్యుత్‌ సంక్షోభం రోజు...రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కె౦ద్రాల్లో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నారు. రాష్ట్రానికి విద్యుత్‌ను అందించే విద్యుత్‌ ఉత్పత్తి కె౦ద్రాలన్నీ బొగ్గు కొరత కారణం గా సామర్ధ్యం మేరకు పనిచేయలేకపోతున్నారుు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నెలా...పలా రోజుల్లో రాష్ట్రాన్ని కారుచీకట్లు కమ్మేయడం ఖాయమంటున్నారు. వరంగల్‌ జిల్లాలోని కాక తీయ థర్మల్‌ పవర్‌ కె౦ద్రం (కెటీపీపీ)లోను విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోను౦ది. ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించినా ఎటువంటి మార్పు కనిపించడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీజెన్‌కోకు కష్టాలు ప్రారం భమయ్యాయి. సకల జనుల సమ్మె ప్రభావంతో రాష్ట్రంలో మరో కొద్ది రోజుల్లో చిమ్మచీకట్లు కమ్ముకోనున్నాయి. పలు పవర్‌ స్టేషన్‌లో బొగ్గు నిల్వలు నిండుకోవటంతో అంధకారం నెలకొన నున్నది. ఈ కష్టాలు తొలగాలంటే సకల జనుల సమ్మె ముగియాలి. లేదంటే రాష్ట్రంలో ఇక నుంచి చిమ్మ చీకట్లే...
విజయవాడ,  రాష్ర్టంలో విద్యుత్‌ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న నార్లతాతారావు విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్టీటీపీఎస్‌)లో మరో కొద్ది రోజుల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుందా..? తెలంగాణాలో సకల జనుల సమ్మె ప్రభావంతో సింగరెణి కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావంవల్ల బొగ్గు తవ్వకం, రవాణాపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. రాష్ర్ట ప్రభుత్వం ముందస్తుగా బొగ్గు నిల్వలకు చర్యలు చేపట్టకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేళా పాళలేని విద్యుత్‌ కోత కారణంగా నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వ్యవసాయం గురించి ప్రస్తావించనవసరం లేదు.
ఎన్టీటీపీఎస్‌లో తగ్గిన బొగ్గు నిల్వలు
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని నార్లతాతారావు ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ఇక్కడ ఏడు యూనిట్లలో రోజుకు 1760 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవుతుంది. అందుకు గాను 15 వేల టన్నుల బొగ్గు అవసర మవ్వగా అవసరానికి తగినంత బొగ్గు నిల్వలు లేవని అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ కేంద్రం నుంచి ఏప్రిల్‌ నెలలో 1238 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవ్వగా ఆగస్టులో 1069.11 మెగా వాట్స్‌ మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి అయ్యిందని అధికారులు వివరిస్తున్నారు. 

గత నెల రోజులుగా ఉత్పత్తి తీవ్రంగా తగ్గిందని రోజుకు 1760 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి గాను ఈ నెల మొదటీ వారానికి కెవలం 30.70, 5న 32.35, 6వ తేదీన 36.9 మెగా వాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అయ్యిందని అధికారులు వివరిస్తున్నారు. ఎన్టీటీపీఎస్‌లో ఇలానే విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి కేవలం 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఓడిషా, చత్తీస్‌ఘడ్‌ నుంచి బొగ్గు దిగుమతి : రాష్ర్ట ప్రభుత్వం చొరవతో కొల్‌ ఇండియా సహకారంతో రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల మద్య ఓడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాగన్ల ద్వారా బొగ్గు సరఫరా అవుతుందని ఎన్టీటీపీఎస్‌ అధికారులు తెలిపారు. 


బొర్లా పడుతున్న వ్యవసాయ బొర్లు : వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ ఇస్తామన్న ప్రభుత్వం హామీలేమె గానీ కేవలం నాలుగు గంటలైనా విద్యుత్‌ ఇవ్వాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు. వరి పంట ఇప్పుడూ పొట్ట దశలో ఉందని, ఈ దశలో పంటకు అధికంగా నీరు అవసరమని, ధాన్యం తయారయ్యే దశలో నీరు అందకపోవటం వల్ల పంటనష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. (ఎస్‌పిడిసిఎల్‌)సదరన్‌ పవర్‌ డిస్ట్రిబూషన్‌ కంపెనీ పరిధిలోని కృష్ణ జిల్లాలో 326 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 290 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 418 గ్రామాలు, నెల్లూరు జిల్లాలోని 457 గ్రామాలు, చిత్తూరు జిల్లాలోని 683 గ్రామాలు, కడప జిల్లాలోని 543 గ్రామాల్లో కేవలం రెండు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్‌ అందిస్తున్నామన అధికారులు పుతున్నారు .

కేటిపిపిలో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి
వరంగల్‌ జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కుడా  విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోను౦ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సా‘దన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో భాగంగా కెటిపిపికి అందాల్సిన ‘ొగ్గు సరఫరా కాకపోవడంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విద్యుత్‌ ప్లాంట్‌ నిలిచిపోవద్దని కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకుని బొ్గ్గు తరలించాలని ఆదేశించినా ఫలితం కనిపి౦చలెదు. ఇప్పటి వరకు సుమారు వందకు లారీలకుపైగా బొగ్గును గట్టి పోలీసు బందోబస్తు నడుమ కెటిపిపికి తరలించినప్పటికీ అది కేవలం ఐదారుగంటల వరకు మాత్రమే సరిపోయినట్లు తెలుస్తోంది. 

కెటిపిఎస్‌లో నిండుకుంటున్న బొగ్గు నిల్వలు
కెటిపిఎస్‌లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో 1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇప్పటికే వరంగల్‌లోని భూపలపల్లిలోని కాకతీయ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడిన విషయం తెలిసిందే.తాజాగా కెటిపిఎస్‌లోని 6వ దశలోని 11వ యూనిట్‌ 2011,9వ నెల 7,8,తెది ల్లో రెండు రోజుల పాటు పనిచేయకపోవడంతో దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.అధికారులు సాంకేతిక కారణాలు అని చెబుతున్నప్పటికి బొగ్గు నిల్వలు నిండుకోవడం వల్లనే పనిచేయలేదని తెలిసిందే.అదేవిధంగా 6వ దశలోని 9,10వ యూనిట్లో కేవలం 12,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది.ఇది కేవలం ఒక్కరోజుకే సరిపోతుందిని సమాచారం.  బొగ్గు నిల్వలు రాకపోతే  ఈ యూనిట్‌ కూడా మూత పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే మరో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పతికి గండి పడనుంది. 

No comments:

Post a Comment