విశాఖపట్నం: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయం వృధా కానక్కర్లేదు. అనుకున్న సమయానికి గమ్యం చేరిపోవచ్చు. నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోనక్కర్లేదు.జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తారు. ఎనిమిది చోట్ల వంతెనలను నిర్మిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. నవంబర్‌లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆనందపురం నుంచి విశాఖ మీదుగా అనకాపల్లి వరకూ వున్న జాతీయ రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి సి.పి.జోషి పచ్చజెండా ఊపారు.సత్వరం టెండర్ల ప్రక్రియ పూర్తికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ)పథకం కింద రహదారి డిజైన్, నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. నగర పరిధిలో మద్దిలపాలెం, సత్యం, ఎన్‌ఏడీ, విమానాశ్రయం, డాక్‌యార్డ్ (షీలానగర్), గాజువాక, గంగవరం, స్టీల్‌ప్లాంట్ కూడళ్లలో మొత్తం ఎనిమిది చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించేం దుకు టెండర్లు పిలుస్తున్నారు.అగనంపూడి వద్ద పాదచారులు నడిచేందుకు మార్గాలు, అండర్‌పాత్ వేలను ఏర్పాటు చేస్తారు.సుమారు రూ. 760 కోట్ల ఖర్చుతో దాదాపు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది. .
కూడళ్లలో భూగర్భ మార్గాలు : నగరంలోని పలు కూడళ్లలో వాహనాలు రాకపోకలు సాగించేందుకు భూగర్భ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారికిరువైపులా రద్దీగా ఉండే 11 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ఆమోదం లభించింది.ఈ మేరకు పరదేశిపాలెం, మారికవలస, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, ఆదర్శనగర్, ఇసుకతోట, తాటిచెట్లపాలెం, బిర్లా(మురళీనగర్) కూడళ్లు, ఆటోనగర్, దువ్వాడ, అనకాపల్లి టౌన్‌లో ఈ మార్గాలను ఏర్పాటు చేస్తారు. పాఠశాలలు, నర్సింగ్ హోమ్‌లు, దేవాలయాలు, నివాసిత ప్రాంతాల్లో మూడున్నర మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
మరో రెండు టోల్ గేట్లు : రహదారి విస్తరణకయ్యే వ్యయాన్ని టోల్ రుసుము రూపంలో రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.అన౦తర౦ ఆనందపురం, లంకెలపాలెం వద్ద చెరో టోల్‌గేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అగనంపూడి టోల్ గేట్‌ను జాతీయ రహదారి అనకాపల్లి దగ్గర కి తరలించాలన్న అంశంపై సందిగ్దత కొనసాగుతోంది.
No comments:
Post a Comment