Sunday, October 30, 2011

నాగులచవితి రోజున పుట్టలో పాలు పోస్తే..!


పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
అంటూ నాగరాజును స్తుతిస్తూ నాగులచవితి రోజున పుట్టలో పాలు పోస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా కుజ, రాహుదోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు నాగులచవితి రోజున, లేదా కార్తీకమాసములో వచ్చే షష్ఠీ, చతుర్దశిలలో వచ్చే మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలిసివచ్చే రోజుకాని ఉపవాసముండి, పై మంత్రమును పటించాలి. అనంతరం ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేయాలి

ఇలా స్త్రీలు నాగుల చవితినాడు నాగరాజుకు పూజ చేస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం అనాది కాలం నుంచి వస్తోంది. 
అలాగే నాగుల చవితి రోజున నాగేంద్రునిని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారు. నాగుల చవితి రోజున సర్పపూజ చేసే వారి వంశం తామరతంపరగా వర్ధిల్తుతుందని పురోహితులు చెబుతున్నారు.

Friday, October 28, 2011

డిసెంబర్‌ 1న రాంచరణ్‌, ఉపాసన నిశ్చితార్థం


మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్, అపోలో హాస్పిటల్స్ అధినేత సి ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనల పెళ్లి నిశ్చితార్థానికి మూహుర్తం ఖరారు అయింది. డిసెంబర్ ఒకటవ తేదీన నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చిరంజీవి స్వయంగా రాష్టగ్రవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలియజేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి బుధవారం చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్ రాజ్‌భవన్‌కు వెళ్ళారు. ఈ సందర్భంగా రాంచరణ్ పెళ్ళి విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీన నిశ్చితార్థం జరగనున్నదని, ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకా వాలని చిరంజీవి దంపతులు గవర్నర్ దంపతుల్ని ఆహ్వానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న రాంచరణ్ ముసిముసినవ్వులు చిందించారు. ఇలా ఉండగా రాంచరణ్, ఉపాసన నిశ్చితార్థం కార్యక్రమం కోసం నిజామాబాద్ జిల్లా దోమకొండ కోటను ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం భారీ వ్యయంతో అలంకరణలు చేస్తున్నట్లు చిరంజీవి సన్నిహితులు తెలియజేశారు. (చిత్రం) రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు 

సాహితీవేత్త, అలనాటి చందమామ కథకుడు “అవసరాల” కన్నుమూత





ప్రముఖ సాహితీవేత్త, అలనాటి చందమామ కథకుడు, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు అనారోగ్యంతో  అక్టోబర్ 28 2011శుక్రవారం ఉదయం  విశాఖలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిహేనేళ్ళ వయసులో రామకృష్ణారావు రాసిన “పొట్టి పిచ్చుక కథ”.  ఆయనకు, చందమామ బాలల పత్రికకు కూడా మొదటి కథ. తను కష్టపడి సాధించుకున్న దాన్ని పోగొట్టుకున్న ఓ బడుగుజీవి పిచ్చిక ఎంతోమందిని కలుసుకుని, ఎవరూ కలిసిరాకపోయినా పట్టుదల వదలక చివరికి విజయం సాధిస్తుంది. తొలి చందమామలో కుతూహలం కొద్దీ రాసిన ఈ కథ తదనంతర జీవితం మొత్తంలో తన విజయ సూత్రం అవుతుందని అవసరాల రామకృష్ణ గారు ఆనాడు ఊహించనే లేదట. 1931, డిసెంబర్ 21న చెన్నైలో రామకృష్ణారావు జన్మించారు. ఎనభై పదుల వయసులోనూ రచన వ్యాసంగాన్ని కొనసాగించిన వ్యక్తి ఆయన. తెలుగు బాష మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఇతర ప్రాంతీయ బాషలు నేర్చుకోలేకపోయానని అంటూ ఉండేవారట. కొన్నాళ్ళు ఒరిస్సాలో ఇంగ్లీష్ లెక్చరర్ గానూ, రీడర్ గానూ పని చేశారు. ఆయన ఒరిస్సాలో ఉండగానే కొడవటిగంటి కుటుంబరావు గారు ఒరియా చందమామ కు పని చేయవచ్చు కదా అని అడిగితే, ఒరియాలో ఒక్క ముక్క రాయడం రాకుండా ఆ పత్రికలో పనిచేయలేనని అన్నారట.( బాష రాకుండా పత్రికలో పనిచేయడం కాదు, నేడు ఏకంగా పత్రికలూ నడిపే ప్రబుద్ధులు కూడా ఉన్నారు.). ఆరోగ్యం బాగే కదా అని అడిగితే, రాయడమే ఆరోగ్యం, మనసుకు పనిపెట్టడమే ఆరోగ్యం అనేవారాయన. సుమారు వెయ్యికి పైగా రచనలు చేశారు. ఆయన రాసిన వాటిలో ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది.

తుది శ్వాస విడిచిన దాసరి నారాయణరావు భార్య దాసరి పద్మ.


ప్రఖ్యాత సినీ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు భార్య దాసరి పద్మ ఈ రోజు ఉదయం ( శుక్రవారం) హైదరాబాద్ లో మరణించారు. పద్మ ఎప్పుడూ దాసరి వెన్నంటే ఉన్నారు. నాలుగు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతతో కారణంగా ఆవిడను యశోదా హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. దాసరి పద్మ, నారాయణరావు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మేఘసందేశం, శివరంజిని, మజ్నూ, ఒసేయ్ రాములమ్మ, కొండవీటి సింహాసనం సినిమాలకు ఈవిడే నిర్మాత. నటుడు మోహన్ బాబు మాతృమూర్తిగా  దాసరి పద్మ గారిని భావిస్తారు. ఈవిడ స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి. మల్టీ డిసీస్ తో ఆవిడ కొంత కాలంగా బాధపడుతున్నారు. దాసరి స్థాపించిన ఉదయం పత్రికకు సంపాదకురాలిగానూ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలిగానూ ఆవిడ పనిచేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Wednesday, October 26, 2011

చీకట్లను తరిమికొట్టేలా వేయి దివ్వెలు వెలగనీ...

.
పాఠకులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలకు దీపావళి శుభాకాంక్షలు -ఎడిటర్









Wednesday, October 19, 2011

ఆరు లైన్లుగా విస్తరిస్తారు



విశాఖపట్నం:  ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయం వృధా కానక్కర్లేదు. అనుకున్న సమయానికి గమ్యం చేరిపోవచ్చు. నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోనక్కర్లేదు.జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తారు. ఎనిమిది చోట్ల వంతెనలను నిర్మిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. నవంబర్‌లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆనందపురం నుంచి విశాఖ మీదుగా అనకాపల్లి వరకూ వున్న జాతీయ రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి సి.పి.జోషి పచ్చజెండా ఊపారు.సత్వరం టెండర్ల ప్రక్రియ పూర్తికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ)పథకం కింద రహదారి డిజైన్, నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. నగర పరిధిలో మద్దిలపాలెం, సత్యం, ఎన్‌ఏడీ, విమానాశ్రయం, డాక్‌యార్డ్ (షీలానగర్), గాజువాక, గంగవరం, స్టీల్‌ప్లాంట్ కూడళ్లలో మొత్తం ఎనిమిది చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించేం దుకు టెండర్లు పిలుస్తున్నారు.అగనంపూడి వద్ద పాదచారులు నడిచేందుకు మార్గాలు, అండర్‌పాత్ వేలను ఏర్పాటు చేస్తారు.సుమారు రూ. 760 కోట్ల ఖర్చుతో దాదాపు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించింది.  . 

కూడళ్లలో భూగర్భ మార్గాలు : నగరంలోని పలు కూడళ్లలో వాహనాలు రాకపోకలు సాగించేందుకు భూగర్భ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ రహదారికిరువైపులా రద్దీగా ఉండే 11 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు ఆమోదం లభించింది.ఈ మేరకు  పరదేశిపాలెం, మారికవలస, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, ఆదర్శనగర్, ఇసుకతోట, తాటిచెట్లపాలెం, బిర్లా(మురళీనగర్) కూడళ్లు, ఆటోనగర్, దువ్వాడ, అనకాపల్లి టౌన్‌లో ఈ మార్గాలను ఏర్పాటు చేస్తారు. పాఠశాలలు, నర్సింగ్ హోమ్‌లు, దేవాలయాలు, నివాసిత ప్రాంతాల్లో మూడున్నర మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. 
మరో రెండు టోల్ గేట్లు : రహదారి విస్తరణకయ్యే వ్యయాన్ని టోల్ రుసుము రూపంలో రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.అన౦తర౦ ఆనందపురం, లంకెలపాలెం వద్ద చెరో టోల్‌గేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అగనంపూడి టోల్ గేట్‌ను జాతీయ రహదారి అనకాపల్లి దగ్గర కి తరలించాలన్న అంశంపై సందిగ్దత కొనసాగుతోంది. 

Tuesday, October 18, 2011

విశ్వబ్రాహ్మాణ విశ్వ వీక్షణం: వీరభోగ వసంత రాయలు స్వామి రాకకు గుర్తులు

విశ్వబ్రాహ్మాణ విశ్వ వీక్షణం: వీరభోగ వసంత రాయలు స్వామి రాకకు గుర్తులు

కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం


తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఫార్సుల మేరకు గవర్నర్ కోమటిరెడ్డి రాజీనామా ఆమోదించారు. కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో ఆయన రాజీనామా బుధవారం ఆమోదించారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కోమటిరెడ్డి పాల్గొని ముఖ్యమంత్రికి, అధిష్టానానికి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైఠాయించి అరెస్టు కూడా అయ్యారు. కోమటిరెడ్డి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆమోదించాలని సిఎం లేఖ రాసినట్లుగాతెలుస్తోంది.
మంత్రివర్గం విషయంలో అధిష్టానం ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. ఒక మంత్రి రాజీనామా ఆమోదించాలన్నా, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా సిఎం విచక్షణాధికారాలతోనే జరగాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వారిపై చర్యలు తీసుంటామనే హెచ్చరికను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులలోకి తీసుకెళ్లేందుకే కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు అధిష్టానం కూడా చొరవ చూపే అవకాశాలు ఉండవచ్చుననేది పలువురి అభిప్రాయం. ఇటీవల మంత్రి శంకర్ రావు సహ మంత్రులు, ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను బర్తరఫ్ చేయాలని కిరణ్ నిర్ణయించుకున్నారట. అయితే అధిష్టానం శంకర్ రావును మందలించి సిఎంకు నచ్చజెప్పటంతో సద్దుమణిగిందని తెలుస్తోంది. కాగా ఈ నెల ఒకటిన కోమటిరెడ్డి తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి రాజీనామాను ఆమోదించారు. ఎమ్మెల్యే రాజీనామా పెండింగులోనే ఉంది.

Sunday, October 9, 2011

రాష్ట్రంలో అంధకారం అలముకోనుంది???


రాష్ట్రంలో అంధకారం అలముకోనుంది???
ఇక చిమ్మచీకట్లే ?
సక్సెస్ న్యూస్;;   రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అంధకారం అలముకోనుంది. విద్యుత్‌ సంక్షోభం రోజు...రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కె౦ద్రాల్లో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నారు. రాష్ట్రానికి విద్యుత్‌ను అందించే విద్యుత్‌ ఉత్పత్తి కె౦ద్రాలన్నీ బొగ్గు కొరత కారణం గా సామర్ధ్యం మేరకు పనిచేయలేకపోతున్నారుు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నెలా...పలా రోజుల్లో రాష్ట్రాన్ని కారుచీకట్లు కమ్మేయడం ఖాయమంటున్నారు. వరంగల్‌ జిల్లాలోని కాక తీయ థర్మల్‌ పవర్‌ కె౦ద్రం (కెటీపీపీ)లోను విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోను౦ది. ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించినా ఎటువంటి మార్పు కనిపించడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీజెన్‌కోకు కష్టాలు ప్రారం భమయ్యాయి. సకల జనుల సమ్మె ప్రభావంతో రాష్ట్రంలో మరో కొద్ది రోజుల్లో చిమ్మచీకట్లు కమ్ముకోనున్నాయి. పలు పవర్‌ స్టేషన్‌లో బొగ్గు నిల్వలు నిండుకోవటంతో అంధకారం నెలకొన నున్నది. ఈ కష్టాలు తొలగాలంటే సకల జనుల సమ్మె ముగియాలి. లేదంటే రాష్ట్రంలో ఇక నుంచి చిమ్మ చీకట్లే...
విజయవాడ,  రాష్ర్టంలో విద్యుత్‌ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న నార్లతాతారావు విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్టీటీపీఎస్‌)లో మరో కొద్ది రోజుల్లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుందా..? తెలంగాణాలో సకల జనుల సమ్మె ప్రభావంతో సింగరెణి కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావంవల్ల బొగ్గు తవ్వకం, రవాణాపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. రాష్ర్ట ప్రభుత్వం ముందస్తుగా బొగ్గు నిల్వలకు చర్యలు చేపట్టకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేళా పాళలేని విద్యుత్‌ కోత కారణంగా నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వ్యవసాయం గురించి ప్రస్తావించనవసరం లేదు.
ఎన్టీటీపీఎస్‌లో తగ్గిన బొగ్గు నిల్వలు
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని నార్లతాతారావు ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ఇక్కడ ఏడు యూనిట్లలో రోజుకు 1760 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవుతుంది. అందుకు గాను 15 వేల టన్నుల బొగ్గు అవసర మవ్వగా అవసరానికి తగినంత బొగ్గు నిల్వలు లేవని అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ కేంద్రం నుంచి ఏప్రిల్‌ నెలలో 1238 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవ్వగా ఆగస్టులో 1069.11 మెగా వాట్స్‌ మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి అయ్యిందని అధికారులు వివరిస్తున్నారు. 

గత నెల రోజులుగా ఉత్పత్తి తీవ్రంగా తగ్గిందని రోజుకు 1760 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి గాను ఈ నెల మొదటీ వారానికి కెవలం 30.70, 5న 32.35, 6వ తేదీన 36.9 మెగా వాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అయ్యిందని అధికారులు వివరిస్తున్నారు. ఎన్టీటీపీఎస్‌లో ఇలానే విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి కేవలం 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఓడిషా, చత్తీస్‌ఘడ్‌ నుంచి బొగ్గు దిగుమతి : రాష్ర్ట ప్రభుత్వం చొరవతో కొల్‌ ఇండియా సహకారంతో రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల మద్య ఓడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాగన్ల ద్వారా బొగ్గు సరఫరా అవుతుందని ఎన్టీటీపీఎస్‌ అధికారులు తెలిపారు. 


బొర్లా పడుతున్న వ్యవసాయ బొర్లు : వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ ఇస్తామన్న ప్రభుత్వం హామీలేమె గానీ కేవలం నాలుగు గంటలైనా విద్యుత్‌ ఇవ్వాలని రైతులు మొర పెట్టుకుంటున్నారు. వరి పంట ఇప్పుడూ పొట్ట దశలో ఉందని, ఈ దశలో పంటకు అధికంగా నీరు అవసరమని, ధాన్యం తయారయ్యే దశలో నీరు అందకపోవటం వల్ల పంటనష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. (ఎస్‌పిడిసిఎల్‌)సదరన్‌ పవర్‌ డిస్ట్రిబూషన్‌ కంపెనీ పరిధిలోని కృష్ణ జిల్లాలో 326 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 290 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 418 గ్రామాలు, నెల్లూరు జిల్లాలోని 457 గ్రామాలు, చిత్తూరు జిల్లాలోని 683 గ్రామాలు, కడప జిల్లాలోని 543 గ్రామాల్లో కేవలం రెండు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్‌ అందిస్తున్నామన అధికారులు పుతున్నారు .

కేటిపిపిలో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి
వరంగల్‌ జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కుడా  విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోను౦ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సా‘దన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో భాగంగా కెటిపిపికి అందాల్సిన ‘ొగ్గు సరఫరా కాకపోవడంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విద్యుత్‌ ప్లాంట్‌ నిలిచిపోవద్దని కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకుని బొ్గ్గు తరలించాలని ఆదేశించినా ఫలితం కనిపి౦చలెదు. ఇప్పటి వరకు సుమారు వందకు లారీలకుపైగా బొగ్గును గట్టి పోలీసు బందోబస్తు నడుమ కెటిపిపికి తరలించినప్పటికీ అది కేవలం ఐదారుగంటల వరకు మాత్రమే సరిపోయినట్లు తెలుస్తోంది. 

కెటిపిఎస్‌లో నిండుకుంటున్న బొగ్గు నిల్వలు
కెటిపిఎస్‌లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో 1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇప్పటికే వరంగల్‌లోని భూపలపల్లిలోని కాకతీయ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడిన విషయం తెలిసిందే.తాజాగా కెటిపిఎస్‌లోని 6వ దశలోని 11వ యూనిట్‌ 2011,9వ నెల 7,8,తెది ల్లో రెండు రోజుల పాటు పనిచేయకపోవడంతో దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.అధికారులు సాంకేతిక కారణాలు అని చెబుతున్నప్పటికి బొగ్గు నిల్వలు నిండుకోవడం వల్లనే పనిచేయలేదని తెలిసిందే.అదేవిధంగా 6వ దశలోని 9,10వ యూనిట్లో కేవలం 12,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది.ఇది కేవలం ఒక్కరోజుకే సరిపోతుందిని సమాచారం.  బొగ్గు నిల్వలు రాకపోతే  ఈ యూనిట్‌ కూడా మూత పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే మరో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పతికి గండి పడనుంది.